
ధూమపానాన్ని అకస్మాత్తుగా మానేయడం వలన కడుపులో ఉన్న బిడ్డకు మరియు తల్లికి ఇద్దరికీ సమస్యగానే ఉంటుంది. గర్భధారణ సమయంలో ధూమపానం చేయడం పిండం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ధూమపానం శిశువు, తల్లి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పూర్తిగా తెలుసుకుందాం. పొగాకు అనేది మీలో పెరుగుతున్న పిండంపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. గర్భవతిగా ఉన్నపుడు పొగాకు వాడడం వలన కలిగే ప్రమాదాల గురించి గర్భిణీ స్త్రీలు తరచుగా సలహా ఇస్తారు. గర్భధారణ సమయంలో పొగాకు తీసుకోవడం వలన కేవలం క్యాన్సర్ మాత్రమే కాకుండా.. శిశువులలో ఒరో ఫేసియల్ లోపాలు, పిండం పెరుగుదల తగ్గిపోవడం, ప్లాసెంటా ప్రీవియా(లో ప్లాసెంటల్ ప్లేస్మెంట్), ఆకస్మిక ప్లాసెంటా, తక్కువ జనన బరువు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఆటిజం, డౌన్ సిండ్రోమ్ వంటి ఇతర రకాల వైకల్యాలు కూడా వస్తాయి. అంతే కాకుండా అటెన్షన్ లోటు రుగ్మత(ADD) వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
ధూమపానం యొక్క దుష్ప్రభావాలు కేవలం గర్భధారణ సమయంలో మాత్రమే కాకుండా అన్ని సమయాల్లో ఉంటాయి. గర్భధారణ సమయంలో ధూమపానం చేసే తల్లులకు జన్మించిన పిల్లలు శ్వాసకోస సమస్యలు, ఆస్తమా, నియోనాటల్ అప్నియా, శిశు కోలిక్, నెలలు నిండకుండానే శిశువు జన్మించడం శిశు ఊబకాయం, మరియు ఎముకల లోపాల సమస్యలను కలిగి ఉంటారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: చిన్ననాటి రుగ్మతలు అనగానేమి? ఇవి ఎలా ఉంటాయి? వీటికి కారణాలు, చికిత్స ఏమిటి?
పాసివ్ స్మోకింగ్ అని కూడా పిలువబడే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ (ఒకరు సిగరెట్ తాగినపుడు వచ్చిన పొగను పీల్చుకోవడం) తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదం. సెకండ్ హ్యాండ్ పొగ అనేది కాలుతున్న సిగరెట్ చివరి నుంచి పుడుతుంది. ధూమపానం చేసే వారు సిగరెట్ తాగినపుడు పొగ వస్తుంది. దీనిని ధూమపానం చేయని వారు పీల్చినపుడు అది సెకండ్‌హ్యాండ్ స్మోక్గా మారుతుంది.
సెకండ్ హ్యాండ్ స్మోక్ వలన చిన్న పిల్లలు గర్భంలోనే చనిపోవడం, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురవుతారు. సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల పిల్లలు పుట్టిన తర్వాత మొదటి సంవత్సరంలో ఎవరూ ఊహించలేని ఆకస్మిక మరణం సంభవిస్తుంది. గర్భధారణ సమయంలో ఇది సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ (SIDS) వంటి అనేక రకాలైన జబ్బులకు కారణం అవుతుంది. ధూమపానంలో ఉండే రసాయనాలు మరియు పార్టికల్స్ మెదడు మరియు శ్వాసక్రియపై ప్రభావం చూపుతాయి.
గర్భధారకు కొంత ముందు లేదా గర్భధారణ సమయంలో అకస్మాత్తుగా సిగరెట్ మానేయడం ఆరోగ్యానికి హానికరం. మీ ధూమపాన అలవాట్ల గురించి మీ గైనకాలజిస్ట్‌కు వీలైనంత త్వరగా తెలియజేసి.. అతడి నుంచి ఆరోగ్య సలహా తీసుకోవడం మంచిది. గర్భవతిగా ఉన్నపుడు ధూమపానం మంచిది కాదు. హఠాత్తుగా ధూమపానాన్ని మానేయడం ప్రమాదకరం. మీరు స్వచ్ఛందంగా ధూమపానాన్ని మానేయలేకపోతే నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ లేదా NRT ఉపయోగించొచ్చు. NRT కేవలం సిగరెట్‌లోని రసాయనాలను మాత్రమే భర్తీ చేస్తుంది. నికోటిన్‌ను కాదు.
మీరు NRT(నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ) మొదలుపెట్టే ముందు మీరు జనరల్ ప్రాక్టీషనర్ లేదా గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. NRT(నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ) అనేది పాచెస్, గమ్స్, నాసల్ స్ప్రేలు, మౌత్ స్ప్రేల రూపంలో అందుబాటులో ఉంది. మీరు కనుక ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తున్నపుడు E-సిగరెట్లు కూడా ఒక ఎంపిక. వాటిలో కేవలం నికోటిన్ మాత్రమే ఉంటుంది. హానికరమైన రసాయనాలు ఉండవు. మీరు ధూమపానం ఆపేందుకు మీకు E-సిగరెట్ సహాయపడవచ్చు. నికోటిన్ మానేయడం అనేది పిండం హృదయ స్పందనల మీద ప్రభావం చూపించొచ్చు. అరిత్మియా(అసాధారణంగా గుండె కొట్టుకోవడం)కు కూడా కారణం కావొచ్చు.
గర్భవతులుగా ఉండి ధూమపానం చేసే వారికి ఇతర చికిత్సలు లేదా థెరపీలైన కౌన్సిలింగ్, ధూమపానం నుంచి దూరంగా ఉంచడం వంటివి పని చేయనపుడు నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ సజెస్ట్ చేయబడుతుంది. నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ వల్ల కలిగే ప్రయోజనాలు NRT(నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ) వల్ల కలిగే నష్టాలను అధిగమించేలా ఉంటాయి. వాస్తవ ధూమపానానికి ఇవి ప్రత్యామ్నాయంగా పరిగణించబడవు. ప్లాసెంటల్ బ్యారియర్ (అవరోధం)ను నికోటిన్ సులభంగా దాటగలదు. నికోటిన్ రిప్లేస్మెంట్లో నికోటిన్ కాకుండా సిగరెట్లలోని ఇతర కెమికల్స్ మాత్రమే ఉంటాయి. పిండ కణజాలంలో నికోటిన్ యొక్క జీవక్రియ (జీర్ణం అయ్యే ప్రక్రియ) చాలా నెమ్మదిగా ఉంటుంది. పిండం రక్తప్రవాహం, ఆమ్నియోటిక్ ద్రవంలో దీర్ఘకాలిక నికోటిన్ సాంద్రతలు ఉంటాయి. నికోటిన్ అనేది అసాధారణ ఊపిరితిత్తుల అభివృద్ధికి, ఇతర అసాధారణతకు కారణం అవుతుంది. NRT(నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ) అనేది నికోటిన్‌ని నికోటిన్‌తో భర్తీ చేస్తుంది. గర్బధారణ సమయంలో నికోటిన్ థ్రెషోల్డ్ (కనిష్ట మొత్తం) పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భధారణ సమయంలో సిగరెట్ల ద్వారా నికోటిన్‌లో పాలుపంచుకునేందుకు NRT(నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ) సురక్షితమైన మార్గం.
ఉపసంహరణ లక్షణాలు కనిపించకుండా ఉండేలా తక్కువ మోతాదుతో ప్రారంభించాలి. ఆ తర్వాత మోతాదును పెంచుకోవచ్చు. చూయింగ్ గమ్స్, ఇన్హేలర్స్, లేదా మౌత్ స్ప్రేలు తక్కువ సమయం నికోటిన్లా యాక్ట్ చేసేందుకు ఉపయోగించబడతాయి. డోసేజ్ మధ్య ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవచ్చు. మరియు క్రమంగా ధూమపానాన్ని పూర్తిగా మానేయచ్చు.
ధూమపానం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి వ్యక్తిలో లెక్కించడం చాలా కష్టం. మీరు కనుక గర్భధారణ గురించి పరిగణించినట్లయితే ధూమపానం వల్ల కలిగే దీర్ఘకాలిక దుష్పలితాలను గురించి మీరు గుర్తుంచుకోవాలి. గర్భధారణకు కనీసం 15 వారాల మందు స్త్రీ ధూమపానాన్ని మానేయడం వల్ల చాలా ప్రయోజనం పొందుతుంది. గర్భధారణకు ముందు ధూమపానం మానేసిన వెంటనే పిండ ప్రమాదం అనేది తగ్గుతుంది. గర్భవతులు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ (ఇతరులు కాల్చిన సిగరెట్ పొగను పీల్చుకోవడం) ను నివారించాలి. అధికంగా పొగ ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం వలన భవిష్యత్‌లో తల్లి మరియు బిడ్డకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ధూమపానాన్ని మానేయడం వలన తల్లి మరియు బిడ్డకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గర్భధారణకు కనీసం 15 వారాల ముందు స్మోకింగ్ మానేసిన తల్లులు.. నెలలు నిండకముందే పుట్టడం, తక్కువ బరువుతో జన్మించడం వంటి ఇతర సమస్యలను తగ్గించుకోవచ్చు. కౌన్సిలింగ్, థెరపీలు, పాజిటివ్ ఆటిట్యూడ్ సహాయంతో నికోటిన్ వ్యసనాన్ని తగ్గించవచ్చు. గర్భాన్ని దాల్చడం ద్వారా కూడా కొంత మంది తల్లులలో సిగరెట్ వ్యసనం తగ్గుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మీ గర్భధారణకు ముందు లేదా ప్రారంభంలోనే సిగరెట్ మానేయడం వలన రాబోయే సంవత్సరాల్లో మీ పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
Smoking during pregnancy in telugu, effects of smoking during pregnancy in telugu, bad effects of tobacco on baby during pregnancy in telugu, benefits of quitting smoking during pregnancy in telugu, precautions to take before quitting smoking during pregnancy in telugu.
Yes
No














QQaaq Q9qaqq11
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |