


Pregnancy Best Foods
14 December 2025 న నవీకరించబడింది
మహిళల గర్భధారణ ప్రయాణం చాలా చాలెంజింగ్‌గా ఉంటుంది. ప్రత్యేకించి గర్భవతిగా ఉన్నపుడు స్పెషల్ ఫుడ్ మరియు చాలా రకాల పోషకాలు అవసరం. గర్భిణీ స్త్రీల డైట్లో దానిమ్మ ఎంతో ప్రయోజకరమైన ఆహారంగా ఉంటుంది. ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ B, మరియు ఫోలిక్ యాసిడ్ అంతే కాకుండా ఇతర ముఖ్య మినరల్స్‌తో కూడిన సూపర్ ఫుడ్ అయినందున దానిమ్మ గర్భధారణకు చాలా మంచిది. దానిమ్మ గర్భవతిగా ఉన్నపుడు మంచిదా? అని ప్రశ్నిస్తే అవును మంచిదే అనే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. ఆశించే తల్లులకు దానిమ్మ పండు మంచి పోషణను అందిస్తుంది. పుట్టబోయే బిడ్డలో శారీరక వైఫల్యాలు అలాగే పిండంలో న్యూరల్ ట్యూబ్ అసాధారణతలను నివారించడంలో దానిమ్మ దోహదం చేస్తుంది. గర్భధారణ సమయంలో దానిమ్మ తినడం వల్ల ఆశించే తల్లుల చర్మం ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది.
గర్భధారణ సమయంలో దానిమ్మ మంచిదా? నిస్సందేహంగా.. మంచిదే. గర్భవతిగా ఉన్నపుడు తినాల్సిన ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి దానిమ్మ. ఎందుకంటే అవి కాబోయే తల్లికి ఆమె శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. దానిమ్మలో మినరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వైద్యులు మరియు ఆరోగ్యనిపుణులు గర్భధారణ కోసం దానిమ్మ తినమని సలహా ఇస్తారు. ఇందులో ఉండే అధిక విటమిన్స్ మరియు ఫైటోకెమికల్ కంటెంట్ కారణంగా దానిమ్మ గర్భిణీ స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాకుండా హృదయం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ప్రొటీన్, ఐరన్, ఫైబర్, విటమిన్స్ C, K మరియు B, ఫోలేట్ మరియు ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో మూలకాలకు దానిమ్మ గొప్ప మూలం. ఫెయిర్ బేబీ కోసం గర్భధారణ సమయంలో దానిమ్మ రసం తాగమని ఎంతో మంది సలహా ఇస్తారు. దానిమ్మరసం మాత్రమే కాకుండా దానిమ్మ విత్తనాలు కూడా ఆశించే తల్లులకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి.
గర్భవతిగా ఉన్నపుడు దానిమ్మ పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది. గర్భధారణ సమయంలో దానిమ్మ ప్రయోజనాలు ఈ కింది విధంగా ఉంటాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ఆప్రికాట్స్ తీసుకోవడం
గర్భధారణ సమయంలో దానిమ్మ అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ దానిమ్మ రసం కూడా అంతే స్థాయిలో ప్రయోజనాలను కలిగి ఉంటుందా? అని ఆశ్చర్యపోక, ప్రశ్నించక మానరు. కానీ దానికి సమాధానం అవును అనే వస్తుంది. దానిమ్మ గింజలు మాత్రమే కాకుండా దానిమ్మ రసం కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇందులో ఫోలేట్ మరియు విటమిన్స్ C, K ఉంటాయి. గర్భిణీ స్త్రీ శరీరానికి అవసరమైన అన్ని రకాల న్యూట్రియంట్స్ మరియు మినరల్స్‌ను దానిమ్మ రసం కలిగి ఉంటుంది.
గర్భవతిగా ఉన్నపుడు దానిమ్మలను ఉదయం పూట తినడం చాలా మంచిది. దానిమ్మ సిట్రస్ ఆమ్ల పండ్లు. గర్భవతిగా ఉన్నపుడు రాత్రి పూట దానిమ్మను తినడం వల్ల గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ ఏర్పడవచ్చు. సమస్యలను నివారించేందుకు రాత్రిపూట దానిమ్మ పండుకు దూరంగా ఉండడం మంచిది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో నిమ్మకాయ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు & ప్రమాదాలు
గర్భవతులు దానిమ్మ గింజలను పూర్తిగా జీర్ణం చేసుకోవచ్చు. రసం తాగడం కన్నా గింజలను తినడం వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. దానిమ్మ గింజలు జీర్ణవ్యవస్థ గుండా కదిలేందుకు కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే వీటిలో కొన్ని జీర్ణం కానివి ఉంటాయి. అయితే అవి ఎటువంటి సమస్యలను కలిగించవు. దానిమ్మ గింజలు తినడం వల్ల హానికర పరిస్థితులు తలెత్తేవి రెండే సందర్భాలు ఉన్నాయి.
గర్భధారణ సమయంలో దానిమ్మను తినడం మలబద్దకం కలుగుతుందా? అస్సలుకే కలగదు. దానిమ్మ పండులో ఫైబర్స్ ఉన్నాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఉబ్బరం మరియు మలబద్దకాన్ని నివారించడంలో కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. రెండో విషయం ఏమిటంటే గర్భధారణ సమయంలో దానిమ్మలను తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
కాబోయే తల్లులు గర్భవతులుగా ఉన్నపుడు వివిధ మార్గాల్లో దానిమ్మలను తీసుకోవచ్చు. అవి:
గర్భిణీ స్త్రీలు సాధారణంగా రోజుకు ఒక దానిమ్మ పండును తీసుకోవచ్చు. దానిమ్మ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. లేదా పంటి ఎనామిల్ పూత దెబ్బతింటుంది.
దానిమ్మ చర్మానికి అనువైనది. అయితే ఇది ఫెయిర్ స్కిన్‌ను అందిచదు. జనదారణ పొందిన నమ్మకాన్ని వమ్ము చేసేలా గర్భవతిగా ఉన్నపుడు దానిమ్మ రసం తాగితే ఫెయిర్ స్కిన్‌తో బిడ్డ పుడుతుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, మినరల్స్, పొటాషియం, విటమిన్ B ఉన్నందున దానిమ్మరసం పుట్టబోయే బిడ్డలకు చాలా మంచిది.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips











గర్భంలో ఉన్న బిడ్డ జనన అవయవాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి? (When Do Sex Organs Develop During Pregnancy in Telugu?)

గర్భాశయ పరిపక్వత (సర్వికల్ రైపెనింగ్): విషయం, పద్ధతులు, లాభాలు & అపాయాలు (Cervical Ripening: Concept, Methods, Benefits & Threats in Telugu)

ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ మరియు మీ పీరియడ్స్ మధ్య తేడాను కనుగొనడం ఎలా ? | How to Differentiate Between Implantation Bleeding and Your Periods in Telugu

మీ బేబీ కి వింటర్ ఫ్యాషన్ కోసం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు!

వెసెక్టమీ రివర్సల్ అంటే ఏమిటి? దీని వలన ఉపయోగాలు ఏమిటి? ఇది చేయడం వలన ఎదురయ్యే రిస్క్స్ ఎలా ఉంటాయి?

శిశువు కడుపు మీద నిద్రపోవడం వలన వచ్చే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి? ఈ విషయంలో ఎటువంటి సలహాలు పాటించాలి?