


Pregnancy Best Foods
3 November 2023 న నవీకరించబడింది
ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకునే వారిలో ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ ఫుడ్ ఈ చియా విత్తనాలు. ఈ విత్తనాలకు రుచి, వాసన లేనందున, తినే వంటకం ఏదైనా, వాటి పోషక స్థాయిలను పెంచడానికి వాటికివి చేర్చుకోవచ్చు. ఈ చియా విత్తనాలు మధ్య అమెరికాకు చెందినవైనా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీటికి ఎంతో డిమాండ్ ఉంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేనప్పటికీ, గర్భిణీ స్త్రీలు వారు తీసుకొనే ఆహారాల గురించి జాగ్రత్త పడాలి. చియా విత్తనాలను ఆహారాలలో చేర్చుకునే ముందు వాటిలోని పోషక విలువలను చదివి అర్థం చేసుకోవాలి. గర్భధారణ సమయంలో చియా విత్తనాలను తీసుకొనే ముందు ఎదురయ్యే ప్రమాదాలేవనేవి తెలుసుకోవాలి.
చియా విత్తనాలు మంచి పోషక విలువలను కలిగి ఉంటాయి, అంతేకాక అవి శిశువు వికాసానికి అవసరమైన వివిధ పోషకాలను కలిగి ఉంటాయి
1. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ - గర్భధారణ సమయంలో శిశువు మెదడు చక్కగా వృద్ధి చెందేందుకు ఇవి దోహదపడతాయి. వీటిలోని కొవ్వు ఆమ్లాలు తల్లులకు డిప్రెషన్ ఇంకా అనాసక్తుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్న సముద్ర ఆహారాలు తినలేని గర్భిణీ స్త్రీలు చియా విత్తనాలను వాటికి బదులుగా తీసుకోవచ్చు.
2. కాల్షియం - శిశువులో ఎముకలు ఇంకా దంతాలు సరిగ్గా పెరిగేందుకు కాల్షియం అవసరం. ఒక టేబుల్ స్పూను చియా గింజలలో 75 mg కాల్షియం ఉంటుంది.
3. యాంటీ-ఆక్సిడెంట్లు - చియా గింజలు జింక్, సెలీనియం మరియు మాంగనీస్ వంటి ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు, ఇవి గర్భధారణ సమయమలో ఎదురయ్యే కింద చూపినటువంటి అనేక సమస్యలను ఆపడంలో సహాయపడతాయి
గర్భధారణ సమయంలో మహిళలు చియా సీడ్స్ తీసుకోవడం వారికి ఉపకరిస్తుంది. గర్భవతులు చియా గింజలను వారి ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు
1. ఆకలిని తగ్గిస్తుంది - చియా గింజల్లో పీచుపదార్థాలు ఎక్కువ ఉండటం వలన ఎక్కువ సమయం కడుపు నిండినట్లుండేలా చేస్తుంది. ఇది గర్భధారణలో అతిగా తినాలనే కోరికలను ఇంకా అనవసరంగా కేలరీలను పెంచుకొనే అవసరం రాకుండా చేస్తుంది.
2. రక్తంలో చక్కెర నియంత్రణ - హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల, చాలా మంది గర్భిణీ స్త్రీలకు గర్భధారణ వేళల్లో మధుమేహం పొడచూపుతుంది. చియా గింజలు తినడం వల్ల గ్లూకోజ్ శోషణ నియంత్రణలోకి తేవడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించుకోవచ్చు.
3. మలబద్ధకం నుండి ఉపశమనం - చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో మలబద్ధకంతో బాధపడుతుంటారు. చియా గింజలు అధిక పీచుపదార్థాన్ని కలిగి ఉంటాయి, అవి జీర్ణ ప్రక్రియను సాఫీగా జరిగేలా చేయడం వల్ల మలబద్ధకాన్ని నివారించడంలో దోహదపడతాయి.
గర్భివతులు రోజుకు కేవలం 28 గ్రాముల చియా విత్తనాలను మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చియా విత్తనాలను ఎక్కువగా తీసుకొంటే, అది ఈ క్రింద చూపినటువంటి దుష్ప్రభావాలకు దారితీయవచ్చు
1. డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం)
2. అతిసారం
3. చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోవడం
చియా విత్తనాలు ప్రసవం తర్వాత కూడా మేలు చేస్తాయి, ఎందుకంటే అవి పాలిచ్చే తల్లులకు ఎంతగానో ఉపకరిస్తాయి.
1. పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తి సజావుగా జరిగేందుకు రోజుకు కనీసం 500 కేలరీలు ఎక్కువ అవసరామౌతాయి. చియా విత్తనాలు కేలరీలు అందించే భాండాగారాలు, ఎందుకంటే 28 గ్రాముల గింజలలో 138 కేలరీలు లభిస్తాయి. ఆరోగ్యవంతంమైన రీతిలో క్యాలరీలు పొందేందుకు ఈ విత్తనాలను తల్లైనా వారి ఆహారంలో చేర్చవచ్చు.
2. చియా గింజల్లో మంచి పోషకాలు ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, అవి తల్లిపాల ద్వారా బిడ్డకు అందించబడతాయి.
3. ఎందరో నిపుణుల చెప్పిన దాని ప్రకారం, చియా గింజలు తల్లి పాలలో DHA పరిమాణాన్ని పెంచడంలో దోహదపడతాయి. శిశువులో మెదడు చక్కగా వృద్ధి చెందడానికి ఇది ఎంతో అవసరం.
చియా విత్తనాలకు రుచి ఉండదు, అందువల్ల అదనపు పోషకాల కోసం ఎలాంటి వంటకాలలోనైనా చేర్చుకోవచ్చు. కొంతమంది గర్భవతులు చియా గింజల కనిపించే తీరును ఇష్టపడరు. అటువంటి సందర్భాలలో, వీటిని పొడి చేసి వివిధ వంటకాలలో వాడుకోవచ్చు.
వివిధ రకాల వంటలను వండేటప్పుడు చియా విత్తనాలు లేదా పొడిని వాటికి ఎలా జతచేయవచ్చో ఇక్కడ చూపబడ్డాయి.
1. చిక్కబరిచే పదార్థంగా - చియా గింజలను చిక్కబరిచే పదార్థంగా ఉపయోగించే కార్న్‌ఫ్లోర్‌కు బదులుగా ఉపయోగించవచ్చు. చియా గింజలు నీటిని పీల్చుకుంటాయి కాబట్టి, అవి సూప్‌లు, పప్పులు ఇంకా కూరలు చాలా కాలం పాడవకుండా చేస్తాయి ఇంకా వాటిని చిక్కబరుస్తాయి.
2. జ్యూస్/స్మూతీస్ - చియా గింజలను వివిధ పండ్లు లేదా కూరగాయలతో కలిపి జ్యూస్ లేదా స్మూతీస్ లాంటివి తయారు చేసుకోవచ్చు. కొంతమంది టీ కాచేటప్పుడు చియా గింజల పొడిని కూడా కలుపుతారు, ఎందుకంటే దీనివల్ల టీ రుచిలో ఎలాంటి మార్పు రాదు.
3. గుడ్డుకి ప్రత్యామ్నాయం - ఈ గింజలు గుడ్లకు మంచి ప్రత్యామ్నాయాలు ఇంకా బేకింగ్‌లో గుడ్లకు బదులుగా వీటిని వాడవచ్చు. కుకీలు, బ్రెడ్, కేకులు మరియు రస్క్‌లు వంటి బేకింగ్ వంటకాలలో చియా విత్తనాలు గుడ్లకు బదులుగా వాడితే చక్కగా వాటిలానే పనిచేస్తాయి.
4. అల్పాహారం వంటకాలు - చియా గింజలను తృణధాన్యాలు ఇంకా ఓట్స్ వంటి అల్పాహార వంటకాలకు జోడించడం ఎక్కువగా జరుగుతోంది. ఆరోగ్యకరమైన భారతీయ అల్పాహార వంటకాలు చేసేందుకు చియా గింజల పొడిని చపాతీ పిండి, దోస మరియు ఇడ్లీ పిండి వంటి వాటికి కూడా కలపవచ్చు.
5. మధ్యాహ్న/రాత్రి భోజనాలకు - వంట చేసే సమయంలో బియ్యానికి లేదా క్వినోవాలో చియా గింజలను కలపడం వల్ల వాటి పోషక విలువలను చక్కగా పెంచుకోవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో అవిసె గింజలు: గర్భవతులు తినడం సురక్షితమేనా?
గర్భధారణ సమయంలో స్త్రీలకు ఉపయోగపడే మంచి పోషక విలువలను చియా విత్తనాలు కలిగి ఉంటాయి. కానీ అన్ని ఆహారాల లాగానే, వారు తమ ఆరోగ్యానికి హాని జరగకుండా ఉండేందుకు చియా విత్తనాలను మితంగా తీసుకోవాలి. గర్భవతులు గర్భధారణ వేళల్లో, వారి ఆహారంలో కొత్త పదార్థాలను జోడించే ముందు చాలా అప్రమత్తంగా ఉండాలి. చియా విత్తనాలు ఇంకా వాటి ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, మైలో యాప్‌ని దర్శించండి.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)