


Food Cravings
3 November 2023 న నవీకరించబడింది
చికెన్ అనేది రుచికరమైన ఆహారం. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. గర్భవతిగా ఉన్న స్త్రీ తనకోసం మరియు తన కడుపులో ఉన్న బిడ్డ కోసం తింటున్నందున అధిక మొత్తంలో ప్రొటీన్ అవసరం. చికెన్ ప్రెగ్నెన్సీకి మంచిదా? కాదా? అని ఆలోచిస్తున్నారా? సాధారణంగా గర్భధారణ సమయంలో చికెన్ వంటి పౌల్ట్రీ వస్తువులను తీసుకోవడం మంచిదే. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే.. బాగా క్లీన్ చేసి కడిగిన చికెన్, బాగా వండిన, వేడివేడిగా ఉన్న చికెన్నే తినాలి. గర్భధారణ సమయంలో చికెన్ గురించి తెలుసుకోవాల్సిన అన్ని విషయాలను గురించి తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో చికెన్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలు ఏవైనా ఉంటే అవి కూడా తెలుసుకుందాం.
గర్భవతిగా ఉన్నపుడు చికెన్ మంచిదనడంలో ఎటువంటి సందేహం లేదు. చికెన్‌లో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రొటీన్స్ ఉంటాయి. ఆశించే తల్లులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఒక సింగిల్ సర్వింగ్ లీన్ చికెన్(100గ్రాములు)లో 3.5 డెయిలీ సర్వింగ్స్ ప్రొటీన్ ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే.. చాలా సార్లు చికెన్‌ను వేడిగా వడ్డించకపోవచ్చు. లేదా సరిగ్గా ఉడికించి వండకపోవచ్చు. గర్భధారణ సమయంలో ఇటువంటి చికెన్ తీసుకోవడం సమస్యగా మారుతుంది. ఎందుకంటే వండని లేదా పచ్చి చికెన్‌లో హానికరమైన బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఉంది.
వండని లేదా పచ్చి చికెన్‌ను తినడం వల్ల మాంసం అనేది సాల్మొనెల్లాకు వాహకంగా పని చేయొచ్చు. ఇది గర్భిణీ స్త్రీకి ఉబ్బరం, వాంతులు, వికారం, తిమ్మిర్లు, జ్వరం మరియు తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. ప్రభావం అధికంగా ఉన్న సందర్భంలో ఇది గర్భస్రావానికి కూడా దారి తీయొచ్చు. అందుకోసమే చికెన్‌ను కనీసం 71 డిగ్రీల వరకైనా ఉడికించాలి. ప్రత్యేకించి చికెన్‌లో ఉండే మందభాగాలను తప్పకుండా ఎక్కువగా ఉడికించాలి. ఇలా చేయడం వల్ల చికెన్‌లో ఉన్న హానికర బ్యాక్టీరియా లేదా కీటకాలు తొలగిపోతాయి. ఇప్పుడు గర్భిణీ స్త్రీ తినడం చాలా మంచిది.
ఫ్రిడ్జ్‌లో ఉన్న రాత్రి మిగిలిపోయిన చికెన్ సంగతేంటి? ఒకసారి వండిన తర్వాత చికెన్‌ను 24 గంటల వరకు ఫ్రిడ్జ్‌లో ఉంచవచ్చు. మీరు గర్భవతిగా ఉన్నపుడు చికెన్ తినే ముందు చికెన్ వేడిగా ఉన్నా కానీ మరోసారి పొయ్యి మీద పెట్టి వేడిచేయాలి. చికెన్ మీద ఏదైనా బ్యాక్టీరియా ఉంటే ఇలా చేయడం వల్ల చనిపోతుంది. ప్రస్తుతం మరియు ఆ తర్వాత గర్భవతిగా ఉన్నపుడు చికెన్ తినడాన్ని సురక్షితం చేస్తుంది. గర్భధారణ సమయంలో డెలిస్ (ప్రాసెస్ చేయబడిన ఆహారాలు ఉండే స్టోర్) నుంచి ప్రాసెస్ చేయబడిన మాంసాలు తినొచ్చా? అని ఆశ్చర్యపోతున్నారా.. డెలి కౌంటర్లలో (స్టోర్లలో) ప్రాసెస్ చేసిన కోడి మాంసం ముక్కలుగా ఉంటుంది. ఇక్కడ మరో బ్యాడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ ఆహారాల మీద కూడా సాల్మోనియా, లిస్టెరియా ఉండే ప్రమాదం ఉంది. కావున మీరు గర్భవతిగా ఉన్నపుడు ఇటువంటి ముక్కలను తీసుకోకపోవడమే ఉత్తమం. ఆ ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారో మీరు సరిగ్గా చెప్పలేరు. మీరు ప్రాసెస్ చేసిన కోడి మాంసాన్ని తినకుండా ఉండలేకపోతే.. చికెన్ బాగా ఉడికిందని నిర్దారించుకోండి. వేడి వేడిదే తినేందుకు ప్రయత్నించండి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: 7 వారాల గర్భధారణ సమయంలో మీ ఆహారములో చేర్చాల్సిన ముఖ్యమైన 5 ఆహార పదార్థాలు
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)