


Health Tips
15 December 2025 న నవీకరించబడింది
సరైన విధంగా రక్తప్రసరణ జరిగేందుకు మరియు సరైన విధంగా శరీర ప్రక్రియలు సజావుగా సాగేందుకు గర్భిణీ స్త్రీలు ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీటిని తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గర్భవతిగా ఉన్న మహిళ జీవక్రియలో గోరు వెచ్చని నీరు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. మలబద్దకం అవకాశాలను తగ్గిస్తుంది. ఇంకా ఇది శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అంతే కాకుండా గర్భధారణ సమయంలో వెయిట్ మేనేజ్మెంట్లో కూడా సహాయపడుతుంది. ఈ ప్రయోజనాలతో పాటుగా గోరు వెచ్చని నీటిని తాగడం ద్వారా కొంత శక్తిని కూడా పొందుతారు. గర్భధారణ సమయంలో ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
అవును.. గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీటిని తాగడం సురక్షితమే. గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీటిని తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. కొన్ని ప్రయోజనాలు కింద పేర్కొనబడ్డాయి.
గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీరు తాగడం వలన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎటువంటి హాని జరగదు. ఒక వేళ మహిళ నోటిలో కానీ గొంతులో కానీ కాలిన గాయాలు వారు తీసుకునే పరిమాణాన్ని తగ్గించాలి. ఇది వారు ఆహారం తీసుకోవడం తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్య వల్ల గర్భిణీ స్త్రీలు తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు. ఇలా తక్కువగా ఆహారం తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీ బలహీనపడుతుంది. అప్పుడు కడుపులో ఎదుగుతున్న శిశువుకు కూడా సరైన విధంగా పోషకాలు అందవు. ఒక మహిళ తీవ్రమైన గాయాలు కలిగి ఉన్నట్లయితే ఇది అనేక అంటువ్యాధులకు దారి తీస్తుంది. దీన్ని నివారించించేందుకు కొన్ని మందులు అవసరం. ఈ మందులు పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. తల్లి ఆరోగ్యంలో ఏదైనా మార్పు సంభవిస్తే అది నేరుగా పిల్లల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది.
గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన కండరాల తిమ్మిర్లు మరియు ఏవైనా నొప్పులు ఉన్నా తగ్గుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా సహాయం చేస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని అనుకుంటున్నపుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. గర్భధారణ సమయంలో స్నానం చేసే వేడి నీరు మరీ ఎక్కువ వేడిగా లేకుండా చూసుకోవాలి. నీటి ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చూసుకోవాలి. ఒక వేళ ఉష్ణోగ్రత పైన పేర్కొన్న పరిధి దాటిపోతే రక్తపోటు (బీపీ) తీవ్రంగా పడిపోతుంది. ఇది శిశువుకు ఆక్సిజన్ సరఫరా మరియు ఇతర ముఖ్య పోషకాల సరఫరాను నిలిపివేస్తుంది. గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.
అది మాత్రమే కాకుండా గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో ఉన్నపుడు వెచ్చని నీటితో స్నానం చేయడం మానుకోవాలి. ఎందుకంటే ఇది బిడ్డకు ప్రమాదం. గర్భధారణ ప్రారంభసమయంలో తల్లి వెచ్చని నీటితో స్నానం చేస్తే వారికి పుట్టబోయే బిడ్డ స్పినా బిఫిడా వంటి శారీరక లోపాలతో బాధపడవచ్చు. తల్లి ఒక వేళ హెపర్తెర్మియా వంటి వ్యాధితో బాధపడుతూ ఉంటే.. వారి శరీరం ఎక్కువ వేడిని సంగ్రహిస్తుంది. ఇది కడుపులో ఉన్న బిడ్డకు హాని కలిగిస్తుంది. గర్భవతులు స్టీమ్ బాత్ (ఆవిరితో స్నానం) చేయకపోవడానికి గల కారణం ఇదే. కాబట్టి వెచ్చని నీటితో స్నానం చేసే ముందు ఒక తల్లి థర్మామీటర్ ఉపయోగించి ఖచ్చితంగా ఉష్ణోగ్రత కొలవాలి. గోరువెచ్చని నీరు గర్భాశయంలోకి ప్రవేశించి బిడ్డకు హాని చేస్తుందని అనుకోకూడదు. శిశువు చుట్టూ రక్షణ వలయంలా ఆమ్నియోటిక్ షాక్ ఉంటుంది. ఆ ద్రవం బ్రేక్ అయిన తర్వాత వెచ్చని నీటితో స్నానం చేయడం మానుకోవాలి.
గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ తాగే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
గర్భధారణ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు గోరువెచ్చని నీటిని తాగడం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. అయితే గర్భిణీ స్త్రీలు తమకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నీరు తాగేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి.
Drinking Warm Water During Pregnancy in telugu, Benefits of Drinking Warm Water During Pregnancy in telugu, side effects of Drinking Warm Water During Pregnancy in telugu, can pregnants drink warm water during pregnancy in telugu.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











ప్రెగ్నెన్సీ సమయంలో సాబుదాన(ఒక రకమైన ఆహారపదార్థం) ఎందుకు తీసుకోవాలి? (Why should you have Sabudana during Pregnancy in Telugu?)

గర్భధారణ సమయంలో దానిమ్మ తినవచ్చా? దీని వలన కలిగే ఫలితాలు ఏమిటి? (Pomegranate During Pregnancy : Benefits in Telugu)

గర్భంలో ఉన్న బిడ్డ జనన అవయవాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి? (When Do Sex Organs Develop During Pregnancy in Telugu?)

గర్భాశయ పరిపక్వత (సర్వికల్ రైపెనింగ్): విషయం, పద్ధతులు, లాభాలు & అపాయాలు (Cervical Ripening: Concept, Methods, Benefits & Threats in Telugu)

ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ మరియు మీ పీరియడ్స్ మధ్య తేడాను కనుగొనడం ఎలా ? | How to Differentiate Between Implantation Bleeding and Your Periods in Telugu

మీ బేబీ కి వింటర్ ఫ్యాషన్ కోసం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు!