


Pregnancy Best Foods
3 November 2023 న నవీకరించబడింది
మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పోషకాలపై అనేక వ్యాసాలు అందుబాటులో ఉన్నాయి. అయితే గర్భవతులు అవిసె గింజెలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ తినొచ్చా? ఈ విషయం తెలుసుకుందాం. గర్భవతులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, అందులో పోషకాలు ఉండాలని ప్రతీ ఒక్కరూ సిఫార్సు చేస్తుంటారు. అందులో సూపర్‌ఫుడ్‌గా చెప్పుకునే అవిసె గింజలు కూడా ఉంటాయి. గర్భవతులు అవిసె గింజల్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, గర్భవతిగా ఉన్నప్పుడు అవిసె గింజల్ని ఎలా తీసుకోవాలి అన్న వివరాలు తెలుసుకోండి.
అవిసె గింజల్లో ఎక్కువగా ఫైబర్, ప్రొటీన్ ఉంటాయి. అందుకే గర్భవతులు వీటిని తీసుకోవాలని చెబుతుంటారు. గర్భవతులకు ఎక్కువగా పోషకాలు అవసరం. అవిసె గింజల నుంచి అవి బాగా లభిస్తాయి. మరి గర్భవతులు అవిసె గింజల్ని తినొచ్చా అని మీరు ఆలోచిస్తున్నారా? ఆ విషయం తెలుసుకుందాం. గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. మలబద్ధకాన్ని తగ్గించడానికి అవిసె గింజెలు తీసుకోవడం మంచిది. అంతేకాదు, ఇవి కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తాయి. అంతేకాదు, అవిసె గింజలు రక్తపోటును తగ్గించడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతాయి. అయితే గర్భధారణ సమయంలో అవిసె గింజలు తీసుకోవచ్చా లేదా అని సందేహలు ఉండటంతో, వీటిని కొద్ది మొత్తంలో తీసుకోవచ్చని వైద్యులు, న్యూట్రీషియనిస్ట్స్ చెబుతున్నారు. అయితే మీ శరీరానికి అవిసె గింజలు పడతాయో లేదో తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించాలి.
ఫ్లాక్స్ ప్లాంట్ నుంచి ఫ్లాక్స్ సీడ్స్ వస్తాయి. వీటినే అవిసె గింజలు అని అంటారు. అవిసె గింజలు పుష్పించే మొక్కల నుంచి వస్తాయి. అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. వాణిజ్య అవసరాలతో పాటు, ప్రొడక్షన్ బేస్డ్ ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తారు. స్పిన్నింగ్ లైనిన్, పెయింట్ల తయారీ వాటికోసం కూడా అవిసె గింజల్ని ఉపయోగిస్తారు. అవిసె గింజల్ని అనేక రకాలుగా వినియోగిస్తారు. గింజల రూపంలో, పొడి రూపంలో, నూనెగా తయారు చేసి వాడతారు. అవిసె గింజల నూనెను లిన్‌సీడ్ ఆయిల్ అని పిలుస్తారు.
ఫ్లాక్స్ సీడ్స్ నుంచి తయారు చేసిన అవిసె గింజల నూనె మార్కెట్లో క్యాప్సూల్ రూపంలో, ద్రవ రూపంలో అందుబాటులో ఉంటుంది. బ్లడ్ షుగర్ నియంత్రించాలనుకునేవారు, కొవ్వు తగ్గించుకోవాలనుకునేవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటారు. వేడికి సంబంధించిన వ్యాధులు ఉన్నవారు అవిసె గింజల నూనె తీసుకుంటారు.
అయితే గర్భవతిగా ఉన్నప్పుడు అవిసె గింజల్ని తీసుకోవడం వల్ల కలిగే హానికర ప్రభావాలు, ప్రమాదాలపై ఎక్కువగా పరిశోధనలు, వ్యాసాలు అందుబాటులో లేవు. కానీ నూనె రూపంలో తీసుకోకూడదని న్యూట్రీషియనిస్ట్స్, నిపుణులు సూచిస్తున్నారు. వాటిని పొడి రూపంలోనే తీసుకోవాలని, అది కూడా పరిమితంగా ఉండాలని చెబుతున్నారు. అయితే మరికొందరు నిపుణులు మాత్రం అవిసె గింజలు లేదా అవిసె గింజల నూనెను గర్భవతులు తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని, అందులో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని అంటున్నారు. డెలివరీ తర్వాత మహిళలు పిల్లలకు పాలిచ్చే సమయంలో కూడా అవిసె గింజల్ని తీసుకుంటే, వారి శరీరంతో పాటు నవజాత శిశువుకు కూడా మంచిదని కొందరు నిపుణుల అభిప్రాయం.
ఇక మరికొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భధారణ సమయంలో పెద్ద మొత్తంలో అవిసె గింజల్ని తీసుకోవడంపై కొన్ని ఆందోళనలు ఉన్నాయి. మహిళ శరీరంలోని హార్మోన్ల స్థాయిపై ప్రభావం చూపిస్తుందని చెబుతుంటారు. అయితే పరిమితంగా తీసుకోవడం సురక్షితమేనని అర్థం చేసుకోవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత అంటే ఏమిటి? దీన్ని ఎలా నయం చేయాలి?
అవిసె గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది గర్భవతులకు చాలా అవసరం. ఒమెగా-3ఎస్ శిశువు మెదడు అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది. అవిసె గింజలు కాకుండా ఇతర ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పొందొచ్చు. హెర్రింగ్, సాల్మన్, ట్రౌట్ లాంటి చేపల్లో కూడా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవిసె గింజలు అతిగా తీసుకోవడం వల్ల నష్టాలు ఉన్నట్టు భావిస్తే, ఈ చేపలు తినొచ్చు. అవిసె గింజల్లో లభించే పోషకాలు చియా సీడ్స్, కనోలా ఆయిల్, సోయాబీన్ నూనె, వాల్‌నట్స్‌లో కూడా లభిస్తాయి. పోషకాల పరంగా చూస్తే, గర్భవతుల్లో షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి ఫైబర్ కోసం అవిసె గింజలు బాగా పనిచేస్తాయి. మీరు ఒకవేళ ఎక్కువగా అవిసె గింజల్ని తీసుకుంటూ ఉంటే, నీళ్లు ఎక్కువగా తాగడం మర్చిపోవద్దు. దీనివల్ల జీర్ణ వ్యవస్థకు కలిగే దుష్ప్రభావాలను తగ్గించవచ్చు.
అవిసె గింజల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలు ప్రధానంగా ఉంటాయి. అందుకే అవిసె గింజల ద్వారా వచ్చిన ఫైబర్‌ను జీర్ణం చేయడానికి కావాల్సినన్ని నీళ్లు తాగకపోతే, గర్భవతుల్లో ఈ సమస్యలు సులువుగా వస్తాయి. అదనంగా, గర్భవతులు తీసుకునే ఒమెగా-3 లాంటి సప్లిమెంట్స్, ఇతర మందులకు అడ్డు తగలడం కారణంగా బ్లీడింగ్ లాంటి సమస్యలు వస్తాయి. అందుకే అవిసె గింజల్ని తీసుకునేప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ముడి అవిసె గింజలు విషపూరితమైనవి. నేరుగా తీసుకోకూడదు.
తల్లి పాలు ఇస్తున్న సమయంలో అవిసె గింజల వినియోగిస్తే కలిగే ప్రయోజనాలు, ప్రతికూల ప్రభావాలపై ఎక్కువగా పరిశోధనలు, వ్యాసాలు అందుబాటులో లేనందున, ఫ్లాక్స్ సీడ్స్‌ని పరిమితంగా తీసుకోవడం మంచిది. మీ వ్యక్తిగత అవసరాలను గుర్తించడానికి, మీకు, నవజాత శిశువుకు అవిసె గింజలు ఎలా మేలు చేస్తాయో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Flaxseeds during pregnancy in telugu, Benefits of Flaxseeds during pregnancy in telugu, Side Effects of Flaxseed during pregnancy in telugu, Nutritional Value of Flaxseed during pregnancy in telugu, Are Flaxseed safe during pregnancy in telugu.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips


డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)