

Updated on 3 November 2023
80% మంది మహిళలు తప్పు బ్రా సైజ్ ధరిస్తారు. 70% మంది మహిళలు వారికి చాలా చిన్నగా ఉండే బ్రాలను ధరిస్తారు. 10% మంది మహిళలు చాలా పెద్ద సైజు బ్రాలను ధరిస్తారు. ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. హార్మోన్ల హెచ్చుతగ్గుల ప్రభావం పడుతుంది. పక్కటెముకలు విస్తరిస్తాయి. మీరు బరువు పెరుగుతారు. అలాగే మీ క్షీర గ్రంథుల్లో పాల ఉత్పత్తి వల్ల వక్షోజాలు పరిమాణం పెరుగుతుంది. గర్భం దాల్చిన మూడో నెలలో లేదా రెండో త్రైమాసికంలో మీ సాధారణంగా ధరించే బ్రా బిగుతుగా కావడాన్ని మీరు గమనించవచ్చు. అంటే మీ వక్షోజాలు పరిమాణం పెరిగిందని, అలాగే మీరు ప్రస్తుతం ధరిస్తున్న బ్రా సైజును మార్చుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవాలి. బిగుతుగా ఉండే బ్రాలు ధరించడం వల్ల మీ వక్షోజాల్లోని పాల నాళాలు కుంచించుకుపోతాయి. ఇది మీ వక్షోజాల్లో ఇన్ఫెక్షన్ లేదా మాస్టిటిస్ కు కారణం కావచ్చు. అందువల్ల గర్భిణీ స్త్రీలు లేదా బాలింతలు సరైన మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రా సైజును ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రా ధరించడం వల్ల మీరు ఎంచుకున్న బ్రా డిజైన్ మరియు ఫీచర్లను పూర్తిగా అనుకూల పరుచుకోవడంలో మీకు దోహదపడుతుంది.
మీ ప్రెగ్నెన్సీ సమయంలో పలు దశల్లో రెండు సెట్ల మెటర్నిటీ బ్రాలు కొనుగోలు చేయాలని మేము సిఫారసు చేస్తాం. 2వ త్రైమాసికంలో మొదటి సెట్ మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రాలను కొనాలి. ఈ సమయంలో మీకు సరైన బ్రా సైజ్ లెక్కించేందుకు మీరు ధరిస్తున్న ప్రెగ్నెన్సీకి ముందు బ్రా సైజులో ఒక కప్ సైజు మరియు ఒక బ్యాక్ సైజును కలపండి. ఉదాహరణకు, మీ ప్రస్తుత బ్రా సైజు 32C (ఇక్కడ 32 బ్యాక్ సైజు మరియు ‘C’ కప్ పరిమాణం) అయితే, మీ కొత్త బ్రా పరిమాణం 34Dగా ఉంటుంది. మీ గర్భం చివరి వారాల్లో రెండో సెట్ మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రాలు కొనుక్కోండి. మీ బిడ్డ కోసం పాలు మీ వక్షోజాల్లోకి రావడం ప్రారంభం అవుతాయి, కాబట్టి మీ బ్రా సైజు మరోసారి పెరిగి ఉండొచ్చు. ఈ సమయంలో సరైన బ్రా సైజ్ లెక్కించేందుకు, మీ ప్రెగ్నెన్సీ బ్రా సైజ్‌కు ఒక కప్ సైజు జోడించి, మీ ప్రెగ్నెన్సీ బ్రా సైజ్ నుంచి ఒక బ్యాక్ సైజును తీసేయండి. అంటే 2వ త్రైమాసికం తర్వాత మీ బ్రా పరిమాణం 34D అయితే, గర్భం చివరి వారాల్లో మీ బ్రా సైజు 32Dగా ఉంటుంది. అయితే, పైన చెప్పిన విషయాల ఆధారంగా మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రాలను కొనుగోలు చేసే ముందు, సరైన సైజు ఉన్న మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రాను ఎంచుకోవడానికి కింది ఐదు సలహాలు మీకు సహాయపడతాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మెటర్నిటీ వేర్ గురించి ప్రతి గర్భిణీ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
లోదుస్తుల దుకాణాల నుంచి మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రాలు కొనడానికి మీరు వెళ్ళినప్పుడు, సరైన సైజులో మరియు మీకు సరిపోయేలా మీకు సహకరించాలని అక్కడి సిబ్బందిని అడగడానికి మొహమాటపడకండి. లింగరీస్ స్టోర్స్ లో సుశిక్షితులైన, పరిజ్ఞానం ఉన్న సిబ్బంది ఉంటారు. మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రాలలో మీకు బాగా సరిపోయే మరియు సరైన పరిమాణంలో కొనడంలో సరైన నిర్ణయం తీసుకునేందుకు వారు మీకు సహాయపడుతారు. వివిధ రకాల మెటర్నిటీ బ్రాలను ట్రై చేసేందుకు కాస్త సమయం వెచ్చించండి. ఆ తర్వాతే ఒక రకమైన మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రాలు కొనండి. ఇలా చేయడం వల్ల మీ వక్షోజాలు మీరు ఎంచుకున్న మెటర్నిటీ బ్రా లేదా నర్సింగ్ బ్రా స్టైల్ అందించే స్టైల్ కంఫర్ట్‌కు అలవాటు పడేలా చేస్తుంది.
బ్రా పట్టీలు
మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రా ధరించినప్పుడు మీ భుజాలపై సుఖంగా మరియు సౌకర్యవంతంగా ఉండాలి. బ్రా పట్టీలు మీ భుజాలను అదిమిపట్టినట్టు ఉన్నా లేదా మీ భుజాల నుంచి జారిపోతుంటే, ఆ మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రా మీకు సరైన సైజ్ కాదు.
బ్రా కప్స్
సరైన మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రా మీ వక్షోజాలు కప్స్ లోపల సౌకర్యంగా ఉండేలా చేస్తుంది. కప్ ల మధ్య ఖాళీలు ఉండకూడదు. అలాగే మీ వక్షోజాలు బ్రా పై నుంచి లేదా పక్కల నుంచి బయటకు రాకూడదు. బ్రాను ధరించినప్పుడు, మీ చనుమొనలు ముందుకు ఉండేలా చూసుకోండి. బ్రా కప్స్ వాటిని కిందకు లేదా పైకి నొక్కకుండా చూసుకోండి.
బ్రా మధ్య ముందరి భాగం
బ్రా కప్స్ జాయింట్ లేదా బ్రా ముందు మధ్య భాగం మీ ఛాతిపై సరిగ్గా కూర్చోవాలి. మధ్య భాగం మీ రొమ్ములను అదిమినట్టు లేదా ఛాతి కన్నా ఎక్కువ ఎత్తు ఉన్నట్టు మీరు భావిస్తే, అది తప్పు మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రా అన్నట్టు లెక్క.
బ్రా బ్యాండ్
మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రాలో బ్యాండ్ చాలా ముఖ్యమైన అంశాల్లో ఒకటి. ఎందుకంటే బ్రా మీ వక్షోజాలకు ఇచ్చే సపోర్టు లో 80% బ్యాండ్ అందిస్తుంది. బ్రా బ్యాండ్ మీ శరీరంపై సరిగ్గా కూర్చుని ఛాతి చుట్టూ ఇమడాలి. ఇది మీ చర్మంపై ఫ్లాట్‌గా ఉండాలి. బ్రా బ్యాండ్ పైకి వెళ్తుంటే మీరు తప్పు మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రా సైజ్ ధరించినట్టు అర్థం .
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ము పాలు కారకుండా ఎలా ఆపాలి?
మీ కోసం సరైన మెటర్నిటీ బ్రా లేదా నర్సింగ్ బ్రాను నిర్ణయించుకున్న తర్వాత మీకు నచ్చిన స్టైల్ లో మీ సైజులో దొరకడం కొన్నిసార్లు కష్టం కావచ్చు. అందుకే మయిలోస్ మెటర్నిటీ/నర్సింగ్ మౌల్డెడ్ కప్ స్పేసర్ బ్రా అనేక సైజుల్లో వస్తుంది. మయిలోస్ మెటర్నిటీ స్పేసర్ బ్రాలో మీరు ఖచ్చితంగా మీ సైజు లభిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా తేలికైన, మల్టీ డైమెన్షనల్ 3డీ వస్త్రంతో తయారైన మయిలోస్ మెటర్నిటీ స్పేసర్ బ్రా రోజంతా మరియు రాత్రంతా ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది. ఛాతి ప్రాంతంలో తేమ ఏర్పడకుండా నిరోధించడానికి గాలి మీ వక్షోజాలకు మరియు బయటికి ప్రసరించేలా మెటర్నిటీ బ్రా చేస్తుంది. మెటర్నిటీ స్పేసర్ బ్రా అందించిన వెంటిలేషన్ మరియు ఉష్ణోగ్రత నియంత్రణ ఛాతి ప్రాంతం నుంచి వేడి, చెమటను బయటకు పంపడానికి సాయపడుతుంది. మెటర్నిటీ లేదా నర్సింగ్ స్పేసర్ బ్రా యొక్క సర్దుబాటు చేసుకోగల భుజం పట్టీలు నర్సింగ్ క్లాస్ప్ లను కలిగి ఉంటాయి, వీటిని ఎప్పుడంటే అప్పడు సులభంగా తెరవొచ్చు మరియు మూసేయొచ్చు. పూర్తి డ్రాప్-డౌన్ స్పేసర్ ఫాబ్రిక్ కప్స్ తో జత చేసినప్పుడు, మయిలోస్ మెటర్నిటీ స్పేసర్ బ్రా మీ బిడ్డకు సులభంగా ఆహారం అందించడానికి మరియు అవసరమైనప్పుడు మీ పాలను ఇవ్వడానికి మీకు దోహదపడుతుంది. నాన్-ప్యాడెడ్ మరియు నాన్-వైర్డ్, మెటర్నిటీ స్పేసర్ బ్రాలో అచ్చు కప్స్ ఉంటాయి, ఇవి అతుకులు లేని రూపాన్ని ఇస్తాయి. ఇది ఎలాంటి అదనపు వాల్యూమ్‌ను వక్షోజాలకు సరైన ఆకృతి ఇవ్వడమే కాకుండా, పాలు బయటకు వచ్చినా గుర్తించడంలో సహాయపడుతుంది. మెటర్నిటీ స్పేసర్ బ్రాలోని సైడ్‌స్టిచ్‌లు మీ పెరుగుతున్న వక్షోజాలకు అదనమైన అలాగే అవసరమైన సపోర్టు అందిస్తాయి. పై అన్నింటినీ కలిగి ఉన్న ఒక బ్రా ఉందంటే అది మయిలోస్ మెటర్నిటీ/నర్సింగ్ మోల్డ్ స్పేసర్ కప్ బ్రా అన్నట్టు! కాబట్టి ముందడుగు వేయండి. ఈ సౌకర్యవంతమైన మరియు ఫంక్షనల్ మెటర్నిటీ నర్సింగ్ బ్రాను ఈరోజే తెచ్చుకోండి!
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips







গর্ভাবস্থায় আলুবোখরা: উপকারিতা ও ঝুঁকি | Prunes During Pregnancy: Benefits & Risks in Bengali

স্তনের উপর সাদা দাগ: লক্ষণ, কারণ এবং চিকিৎসা | White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Bengali

গর্ভাবস্থায় মাছ: উপকারিতা এবং ঝুঁকি | Fish In Pregnancy: Benefits and Risks in Bengali

গর্ভাবস্থায় রেড ওয়াইন: পার্শ্ব প্রতিক্রিয়া এবং নির্দেশিকা | Red Wine During Pregnancy: Side Effects & Guidelines in Bengali

ইনার থাই চ্যাফিং: কারণ, উপসর্গ এবং চিকিৎসা | Inner Thigh Chafing: Causes, Symptoms & Treatment in Bengali

গর্ভাবস্থায় ব্রাউন রাইস: উপকারিতা ও সতর্কতা | Brown Rice During Pregnancy: Benefits & Precautions in Bengali