hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Postnatal Care arrow
  • గర్భధారణ తర్వాత ఆర్థరైటిస్(కీళ్లవాపు): కారణాలు మరియు చికిత్స arrow

In this Article

    గర్భధారణ తర్వాత ఆర్థరైటిస్(కీళ్లవాపు): కారణాలు మరియు చికిత్స

    Postnatal Care

    గర్భధారణ తర్వాత ఆర్థరైటిస్(కీళ్లవాపు): కారణాలు మరియు చికిత్స

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భధారణ తర్వాత చాలా మంది మహిళలు ప్రసవానంతర ఆర్థరైటిస్ అని పిలువబడే కీళ్ల నొప్పులను అనుభవిస్తారు. గర్భధారణ సమయంలో సంభవించే హార్మోన్ల మార్పుల వల్ల ఈ పరిస్థితి సంభవిస్తుంది. ఇది కీళ్లనొప్పులు, స్టిఫ్​నెస్ (ఎటూ కదిలించరాకపోవడం), మరియు మంటలకు దారి తీస్తుంది. ప్రసవానంతరం వచ్చే ఆర్థరైటిస్ అంత ప్రమాదకరం కానప్పటికీ ఇది నొప్పి మరియు బాధను కలగజేస్తుంది. ఈ కథనం ప్రసవానంతర ఆర్థరైటిస్​కు గల కారణాలను అన్వేషిస్తుంది. మరియు కొన్ని చికిత్సలను సూచిస్తుంది.

    ప్రసవానంతర ఆర్థరైటిస్ అంటే ఏమిటి?

    ప్రసవానంతర ఆర్థరైటిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది గర్భధారణ తర్వాత మీలో డెవలప్ అవుతుంది. 40 ఏళ్లు పైబడిన మహిళల్లో ఇది చాలా సాధారణం. ఇది వరకే ఆర్థరైటిస్​ను కలిగి ఉండడం, అధిక బరువు, కొన్ని ఆరోగ్య పరిస్థితుల (డయాబెటిస్ వంటివి) వలన ప్రసవానంతర ఆర్థరైటిస్ వస్తుంది.

    ఎవరికైనా కీళ్లనొప్పులు వచ్చే ప్రాంతాలు :

    గర్భందాల్చిన తర్వాత కీళ్లనొప్పులను కలిగించే కామన్ టైప్స్ ఈ విధంగా ఉన్నాయి.

    1. ఆస్టియో ఆర్థరైటిస్: ఇది ఆర్థరైటిస్ యొక్క అత్యంత సాధారణ రకం. ఇది సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిని ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ గర్భధారణ తర్వాత ఇది ఏ వయసులోనైనా రావొచ్చు. కీళ్లపై ఉండే మృదులాస్థి అరిగిపోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. సాధారణంగా వయసు మీద పడటం, గాయాలు, కీళ్లకు ఎక్కువ శ్రమ వల్ల సంభవించవచ్చు. ఈ నొప్పి వచ్చిన జాయింట్స్​లో నొప్పి, స్టిఫ్​నెస్ (కదలకుండా ఉండడం), వాపు వంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి.

    2. రుమటాయిడ్ ఆర్థరైటిస్: రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటోఇమ్యూన్ (మన రక్షణ వ్యవస్థ మనమీదే దాడి చేయడం) వలన కలిగే వ్యాధి. ఇది కీళ్ల వాపుకు కారణం అవుతుంది. ఇది సాధారణంగా 40 నుంచి 60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. కానీ ఏ వయస్సులో ఉన్నవారికైనా గర్భధారణ తర్వాత వచ్చే అవకాశం ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది పురుషుల కంటే స్త్రీలలో వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువ. ఇది ఎందుకు వస్తుందో ఇప్పటి వరకు సరైన కారణం తెలియదు. కానీ పర్యావరణ కారణాలు, జన్యువుల కారణంగా వస్తుందని నమ్ముతారు.

    3. ప్రసవానంతర తుంటి నొప్పి : ప్రసవించిన తర్వాత చాలా మంది మహిళలు తుంటి నొప్పిని ఎదుర్కొంటారు. శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల ఇది సంభవిస్తుంది. తుంటి చుట్టూ ఉన్న కండరాల్లో ఇది అస్థిరతను కలగజేస్తుంది. ఇది మీకు నొప్పిని కలుగజేస్తుంది. గర్భధారణ సమయంలో అదనంగా బరువు పెరగడం తుంటిపై ఒత్తిడిని కలుగజేస్తుంది. ఇది కూడా నొప్పికి దారి తీస్తుంది.

    4. డెలివరీ తర్వాత జాయింట్ పెయిన్ (కీళ్ల నొప్పి): ఆర్థరైటిస్ వచ్చినపుడు కీళ్ల నొప్పులు అనేవి సహజంగా వస్తాయి. కీళ్ల నొప్పులు ఆర్థరైటిస్ యొక్క సాధారణ లక్షణం. ఇది శరీరం యొక్క ఏదైనా జాయింట్​లో సంభవించవచ్చు. కానీ మోకాళ్లు, తొంటి, చేతుల్లో సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. తేలికపాటి కీళ్ల నొప్పుల నుంచి భరించలేనంతగా ఉంటాయి. స్టిఫ్​నెస్​(ఎటూ కదిలించరాకపోవడం), వాపు మరియు ఎరుపుగా మారడం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.

    5. డెలివరీ తర్వాత మోకాళ్ల నొప్పులు : ప్రసవం తర్వాత స్త్రీలకు మోకాళ్ల నొప్పులు రావడం సహజం. గర్భధారణ సమయంలో అతిగా బరువు పెరగడం, మోకాళ్ల మీద అదనపు ఒత్తిడి వంటి కారణాల వల్ల ఇది సంభవిస్తుంది. అంతే కాకుండా లిగమెంట్స్ (ఎముకలన్నీ అతుక్కుని ఉండే ప్రాంతం) మరియు జాయింట్స్ విశ్రాంతి తీసుకునేందుకు గర్భధారణ సమయంలో రిలీజ్ అయ్యే రిలాక్సిన్ అనే హార్మోన్ కూడా డెలివరీ తర్వాత నొప్పికి కారణం అవుతుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గ్రోయింగ్ పెయిన్స్: అర్థం, కారణాలు, లక్షణాలు, చికిత్స మార్గాలు

    ప్రసవానంతర ఆర్థరైటిస్​కు కారణాలు ఏమిటి?

    ప్రసవానంతరం వచ్చే ఆర్థరైటిస్​కు అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనది ఎక్కువ మందిలో కనిపించేది ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పు. ఇది లిగమెంట్స్​ను మరియు జాయింట్స్​ను లాక్స్​(నిర్లక్ష్యం)గా మార్చవచ్చు. ఇది కీళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. మరియు వాపుకు దారితీస్తుంది. బరువు పెరగడం, చేసే పనులలో మార్పులు రావడం, జాయింట్ ట్రామా(గాయం) వంటివి ఇతర కారణాలుగా ఉన్నాయి.

    ప్రసవానంతరం వచ్చే ఆర్థరైటిస్ ఎంతకాలం ఉంటుంది

    మీరు గర్భవతిగా ఉన్న సమయంలో మీ శరీరం రిలాక్సిన్ అనే హార్మోన్​ను విడుదల చేస్తుంది. ఇది మీ జాయింట్స్​ను వదులుగా చేస్తుంది. మరియు పెల్విస్​ను విస్తరింపజేస్తుంది. మీకు శిశువు పుట్టే సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రసవానంతరం ఇది మీ శరీరంలో ఆరు వారాల వరకు ఉంటుంది. ప్రసవానంతర ఆర్థరైటిస్​కు చికిత్స చేసే సమయంలో మందులతో పాటుగా ఫిజికల్ థెరపీ కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జాయింట్ పెయిన్ సమస్యను పరిష్కరించేందుకు సర్జరీ కూడా అవసరం పడుతుంది.

    డెలివరీ తర్వాత ఆర్థరైటిస్​ను ఎలా మేనేజ్ చేయాలి?

    ప్రసవం తర్వాత ప్రసవానంతర అర్థరైటిస్​ను మేనేజ్ చేసేందుకు ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి.

    1. వ్యాయామం: కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేసేందుకు వాటి చలన పరిధిని మెరుగుపరిచేందుకు వ్యాయామం సహాయపడుతుంది. వ్యాయామాలను నెమ్మదిగా ప్రారంభించడం మరియు క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం. వ్యాయామాన్ని ప్రారంభించే ముందు ఫిజికల్ థెరపిస్ట్ లేదా వైద్యుడితో మాట్లాడండి.

    2. నొప్పి నుంచి ఉపశమనం: ఓవర్ ది కౌంటర్​ (ప్రిస్క్రిప్షన్ అవసరం లేని) మందులైన ఎఫిటమినోఫెన్ లేదా ఇబుప్రోఫెన్ వంటి వాటితో నొప్పి మరియు వాపు నుంచి ఉపశమనం పొందొచ్చు. ప్యాకేజ్ మీద ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా పాటించండి.

    3. హీట్ మరియు కోల్డ్ థెరపీ: కీళ్లు నొప్పిగా ఉన్న ప్రదేశంలో చల్లని లేదా వేడివస్తువులను అప్లై చేయడం ద్వారా కూడా మంటను నొప్పిని తగ్గించే అవకాశం ఉంటుంది. హీటింగ్ ప్యాడ్ లేదా ఐస్ ప్యాక్​ను 15-20 నిమిషాల పాటు నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచడం ద్వారా కాస్త రిలీఫ్ ఉంటుంది. రోజులో చాలా సార్లు ఇలా చేయాలి.

    4. వెయిట్ మేనేజ్​మెంట్: కీళ్ల మీద ఒత్తిడిని తగ్గించేందుకు ఆరోగ్యకరమైన వెయిట్ మెయింటేన్ చేయడం చాలా ముఖ్యం. ఎవరైనా అధిక బరువుతో ఉంటే కొంత బరువును కోల్పోవడం కూడా ఎంతో రిలీఫ్​ను ఇస్తుంది.

    5. సహాయ పరికరాలు చేతికర్ర లేదా వాకింగ్ స్టిక్ వంటి సహాయ పరికరాలను ఉపయోగించడం ద్వారా కీళ్ల మీద ఒత్తిడిని తగ్గించి తద్వారా నొప్పిని తగ్గించవచ్చు.

    చివరగా..

    గర్భం దాల్చిన తర్వాత ఎవరైనా ఆర్థరైటిస్​ను ఎదుర్కొంటుంటే వారు ఒంటరిగా లేరని తెలుసుకోవాలి. ఈ పరిస్థితి చాలా సాధారణం. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. శుభవార్త ఏమిటంటే.. ఈ పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటపడేసే చికిత్సలు ఉన్నాయి. మీరు జీవితాన్ని ఆనందంగా జీవించొచ్చు. ఉత్తమ ఎంపిక కోసం వైద్యుడితో మాట్లాడాలని నిర్దారించుకోండి. మరియు మీకు అవసరం అయితే సహాయం గురించి అడిగేందుకు కూడా వెనుకాడొద్దు. గర్భానికి సంబంధించిన మరిన్ని బ్లాగులను గురించి చదివేందుకు మయిలో ఫ్యామిలీ వెబ్​సైట్​ను సందర్శించండి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.