

Pregnancy
3 November 2023 న నవీకరించబడింది
అంటువ్యాధులు, ఇతర వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడానికి ల్యూకోసైట్స్ లేదా తెల్ల రక్త కణాలు (WBC) మానవ శరీరంలో బాధ్యత వహిస్తాయి. మానవుల రోగనిరోధక వ్యవస్థలో ఇవి ఓ భాగం. రక్షణలా పనిచేస్తాయి. కానీ గర్భవతుల విషయానికి వస్తే, మూత్రంలో ల్యూకోసైట్స్ కనిపించడం ఆందోళన చెందాల్సిన అంశం. గర్భవతుల మూత్రంలో ల్యూకోసైట్స్ కనిపించడానికి కారణం, ఆమె శరీరం వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుండటమే. ఇది సాధారణమే. చాలావరకు కేసుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ల్యూకోసైట్స్ స్థాయి 5 (WBS/HPF) వరకు కంగారుపడాల్సిన అవసరం లేదు. కానీ మూత్రంలో ల్యూకోసైట్స్ ఎక్కువగా ఉండటం మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. గర్భధారణ సమయంలో మూత్రంలో ల్యూకోసైట్స్ రావడానికి గల కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు శరీరం ల్యూకోసైట్స్ లేదా తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. తెల్ల రక్త కణాల్లో లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్, బాసోఫిల్స్, ఇయోసినోఫిల్స్ ఉంటాయి. వీటన్నింటితో తయారయ్యే తెల్ల రక్త కణాలు శరీరాన్ని వ్యాధుల నుంచి, ఇతర రోగాల నుంచి రక్షిస్తాయి. అయితే, వాపు లేదా మూత్రనాళాల ఇన్ఫెక్షన్స్ (UTIs) ఉన్నట్లు అయితే, గర్భవతులు మూత్రంలో ల్యూకోసైట్స్ స్థాయి తెలుసుకునేందుకు మూత్ర పరీక్ష చేయించుకోవాలి. ఇది శరీరంలో కనిపించకుండా ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా మంటను గుర్తించడానికి సాయపడుతుంది.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మూత్రాశయంలో ఇబ్బందులు లేదా డయాబెటిస్ లాంటి కొన్ని కారణాల వల్ల గర్భవతుల్లో మూత్రంలో ల్యూకోసైట్స్ కనిపిస్తాయి. గర్భధారణ సమయంలో మూత్రంలో ల్యూకోసైట్స్ కనిపించడానికి గల సాధారణ కారణాలు ఇవే:
ఇది లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల్లో ఒకటి. ట్రైకోమోనాస్ వేజినాలిస్ అనే పరాన్న జీవి వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. గర్భవతుల్లో మూత్రంలో ల్యూకోసైట్స్ కనిపించడానికి, ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకడానికి కారణం అవుతుంది.
మూత్రనాళాల ఇన్ఫెక్షన్ వల్ల కూడా తెల్ల రక్తకణాలు పెరుగుతాయి. మూత్రనాళాల ఇన్ఫెక్షన్ కారణంగా పెరిగిన తెల్ల రక్తకణాలను యూరిన్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు.
ఎలాంటి లక్షణాలు లేకుండా మూత్రంలో బ్యాక్టీరియా ఉండొచ్చు. గర్భవతుల్లో మూత్రంలో ల్యూకోసైట్స్ పెరగడానికి ఇది కారణం కావచ్చు. ఫలితంగా మూత్రనాళాల ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.
ఇది కిడ్నీలకు వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. గర్భధారణ సమయంలో మూత్రంలో ల్యూకోసైట్ కనిపించడానికి ఇది కూడా ఓ కారణం. బ్యాక్టీరియా మూత్రాశయం నుంచి కిడ్నీలకు చేరుతుంది. వాపు, ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.
గర్భధారణ సమయంలో బ్యాకీరియల్ వేజినోసిస్, వేజినైటిస్, వేజినల్ యీస్ట్ ఇన్ఫెక్షన్ లాంటి జననేంద్రియ అంటువ్యాధులు రావడం సాధారణం. హార్మోన్ల హెచ్చుతగ్గులు ఈ పరిస్థితికి మూలం. మూత్రంలో తెల్ల రక్తకణాలు కనిపించే ప్యూరియాకు ఇది కారణం అవుతుంది.
గర్భవతికి సిస్టైటిస్ ఉంటే, ఆమె మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో నొప్పి లేదా మంటగా అనిపించవచ్చు. సిస్టైటిస్ కారణంగా మూత్రంలో తెల్లరక్తకణాలు పెరుగుతాయి.
గర్భధారణ సమయంలో ల్యూకోసైట్స్ లక్షణాలు, అందుకు గల కనిపించని కారణాలపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా కనిపించే కారణాలు ఇవి:
గర్భధారణ సమయంలో మూత్రంలో ల్యూకోసైట్స్‌ని మూత్ర పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. మూత్రంలో ల్యూకోసైట్స్ గుర్తించడానికి సాధారణంగా ఉపయోగించే మార్గాలు:
ఈ పరీక్షలో చిన్న పేపర్‌ను మూత్రంలో ముంచుతారు. మూత్రంలో ల్యూకోసైట్స్ ఉంటే, పేపర్‌పై ఉన్న కెమికల్స్ కారణంగా పేపర్ స్ట్రిప్ రంగు మారుతుంది.
ఒకవేళ పేపర్ స్ట్రిప్స్ రంగు మారకపోతే, మూత్రంలో ల్యూకోసైట్స్ లేవని అర్థం చేసుకోవచ్చు.
ఒకవేళ 30 సెకండ్ల నుంచి 2 నిమిషాల్లో (బ్రాండ్‌ని బట్టి) పేపర్ స్ట్రిప్ కలర్ మారితే, మూత్రంలో ల్యూకోసైట్స్ ఉన్నట్టు.
ఈ టెస్ట్ కూడా యూరిన్ డిప్‌స్టిక్ టెస్ట్ లాగానే చేస్తారు. ఇందులో మూత్రంలో ల్యూకోసైట్ ఎస్టేరేస్‌ను కొలుస్తారు.
మూత్రం శాంపిల్ తీసుకొని, ల్యూకోసైట్స్ ఉన్నాయో లేదో పరీక్షిస్తారు. ఈ పరీక్ష ద్వారా శరీరంలో కనిపించకుండా ఇన్ఫెక్షన్‌ని లేదా మంటను గుర్తించవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మూత్రంలో ఎపిథీలియల్ కణాలు
గర్భధారణ సమయంలో మూత్రంలో ల్యూకోసైట్స్ ఉంటే ఈ కింది ప్రమాదాలు రావొచ్చు:
ఈ పరిస్థితి వల్ల గర్భంలోని పిండం కూడా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అవేంటంటే:
గర్భవతిగా ఉన్నప్పుడు మూత్రంలో ల్యూకోసైట్స్ పెరగకుండా పాటించాల్సిన నివారణ మార్గాలు:
ఇన్ఫెక్షన్ లేదా మూత్రంలో ల్యూకోసైట్స్ పెరుగుతున్నట్టు ఏవైనా లక్షణాలు ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి. ముందుగానే ఈ సమస్యను నిర్ధారించడం, సరైన చికిత్స అందించడం ద్వారా గర్భధారణలో ఏర్పడే సమస్యల్ని నివారించవచ్చు.
1. Dockree S, Shine B, Pavord S, Impey L, Vatish M. (2021). White blood cells in pregnancy: reference intervals for before and after delivery. EBioMedicine.
2. Wu K, Gong W, Ke HH, Hu H, Chen L. (2022). Impact of elevated first and second trimester white blood cells on prevalence of late-onset preeclampsia. Heliyon.
3. Mårdh PA, Novikova N, Niklasson O, Bekassy Z, Skude L. (2003). Leukocyte esterase activity in vaginal fluid of pregnant and non-pregnant women with vaginitis/vaginosis and in controls. NCBI
Tags
What is leukocytes in Telugu, What are the cause of leukocytes in Telugu, What are the symptoms of leukocytes in urine in Telugu, What is White Blood Cells in urine in Telugu, What are the treatments of leukocytes in Telugu, WBC Count in Pregnancy in English, Leukocytes In Urine During Pregnancy in Hindi, Leukocytes In Urine During Pregnancy in Tamil, Leukocytes In Urine During Pregnancy in Bengali
Yes
No

Written by
Sri Lakshmi
Get baby's diet chart, and growth tips






డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)