hamburgerIcon

Orders

login

Profile

Skin CareHair CarePreg & MomsBaby CareDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • గర్భధారణ సమయంలో బ్రౌన్​ రైస్: తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Brown Rice During Pregnancy: Benefits & Precautions in Telugu arrow

In this Article

    గర్భధారణ సమయంలో బ్రౌన్​ రైస్: తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Brown Rice During Pregnancy: Benefits & Precautions in Telugu

    గర్భధారణ సమయంలో బ్రౌన్​ రైస్: తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Brown Rice During Pregnancy: Benefits & Precautions in Telugu

    Updated on 3 November 2023

    కడుపుతో ఉన్న(తల్లి కావాలని కలలు కనే) తల్లులకు మరియు వారి కడుపులో ఉన్న పిల్లలకు గర్భం అనేది ఎంతో ముఖ్యమైనది. లోపల ఉన్న పిండం సరిగ్గా పెరిగేందుకు సరైన పోషకాలు మాత్రమే తీసుకుంటే సరిపోదు. సరైన ఆరోగ్యం, బలమైన రోగనిరోధక వ్యవస్థ కూడా అవసరం. ఇందుకోసం చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. గర్భధారణ సమయంలో బాగా తినడం గురించి తెలుసుకునేందుకు ఎక్కడ ప్రారంభించాలో చాలా కష్టంగా ఉంటుంది. ఇటీవలి రోజుల్లో బాగా ప్రాచూర్యం పొందుతున్న ఒక ఆహారం బ్రౌన్ రైస్—గర్భధారణ సమయంలో బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అది తినేటపుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ బ్లాగ్‌లో మేము మీకు పూర్తి వివరాలతో అందించేందుకు ప్రయత్నిస్తాం.

    బ్రౌన్​ రైస్: అంటే అసలేమిటి? (Brown rice: what Is It in Telugu)

    బ్రౌన్​ రైస్ అనేది ఎన్నో రకాల పోషకాలతో ఉండే ఒక తృణధాన్యం. ఇది ఫైబర్​ అధిక మోతాదులో ఉంటుంది. మెగ్నీషియం, విటమిన్లు B1, B6, మరియు విటమిన్ E కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది ఐరన్ మరియు జింక్​కు మంచి మూలం. గర్భధారణ సమయంలో బ్రౌన్​ రైస్ తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారించడం, శక్తిని అందించడం, సరైన వెయిట్​ను మెయింటేన్ చేయడంలో మీకు సహాయపడుతుంది.

    బ్రౌన్​ రైస్​లో ఉండే పోషక విలువలు (Brown rice's nutritional Value in Telugu)

    బ్రౌన్ రైస్ అనేది తృణధాన్యం. ఈ ధాన్యం బ్రాన్, జెర్మ్, మరియు ఎండోస్పెర్మ్ అనే మూడు భాగాలను కలిగి ఉంటుంది. బ్రౌన్​ రైస్​లో మెగ్నీషియం, ఫాస్పరస్, సెలేనియం, థయమిన్, నియాసిన్, విటమిన్ B6 వంటి ఫైబర్ మరియు పోషకాలను ఇది కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్షణాలతో ఉండే పెట్రోకెమికల్స్​ను కూడా కలిగి ఉంటుంది. గర్భధారణ సమయంలో బ్రౌన్ రైస్ అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. బ్రౌన్ రైస్ అనేది ఫైబర్ యొక్క మంచి మూలం. ఇది మీకు మలబద్ధకం మరియు హెమరాయిడ్ (పైల్స్) ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకం, పైల్స్ అనేవి గర్భధారణ సమయంలో ఉండే రెండు సమస్యలు. ఫైబర్ అనేది మీ రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్​ను రెగ్యులేట్ చేయడంలో మరియు గర్భధారణ మధుమేహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

    కేవలం ఫైబర్ మాత్రమే కాకుండా బ్రౌన్ రైస్ అనేది ఆరోగ్యకరమైన గర్భధారణకు అవసరమైన విటమిన్స్, పోషకాలను అందిస్తుంది. వీటిలో ఫోలేట్ (పుట్టుక లోపాలు రాకుండా సహాయం చేసే B విటమిన్), ఐరన్ (హీమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమైనది), కాల్షియం (ఎముకల అభివృద్ధి కోసం ముఖ్యమైన మూలకం) ఉంటాయి. బ్రౌన్​ రైస్​లో ప్రొటీన్, అవసరమైన కొవ్వు ఆమ్లాలు అధిక మోతాదులో ఉంటాయి. గర్భధారణ సమయంలో బ్రౌన్ రైస్ తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నప్పటికీ.. గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు.. ఇందులో ఉండే అధిక ఫైబర్ గ్యాస్ మరియు ఉబ్బరానికి కారణం అవుతుంది.

    గర్భధారణ సమయంలో బ్రౌన్​ రైస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? (What are the benefits of brown rice during pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో బ్రౌన్ రైస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఫైబర్ యొక్క మంచి మూలం. మలబద్ధకాన్ని నివారించడంలో మీకు సహాయపడుతుంది. బ్రౌన్​ రైస్​లో ఐరన్, ఫోలిక్ యాసిడ్​తో పాటుగా విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మెదడు మరియు వెన్నముకలో పుట్టుకతో వచ్చే లోపాలను అరికట్టడంలో ఫోలిక్ యాసిడ్ ప్రధానమైనది. అదనంగా బ్రౌన్​ రైస్​లో మెగ్నీషియం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణకు అవసరం. ఆరోగ్యకరమైన బ్లడ్ ప్రెషర్​ను మెయింటేన్ చేసేందుకు, అకాల ప్రసవాన్ని నివారించేందుకు మెగ్నీషియం మీకు సహాయం చేస్తుంది.

    గర్భధారణ సమయంలో బ్రౌన్​రైస్ తినడం సురక్షితమేనా? (Is brown rice safe to eat during pregnancy in Telugu)

    హెల్తీ డైట్​లో భాగంగా బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలను ఎక్కువగా తినమని గర్భవతులకు సూచిస్తారు. కానీ గర్భధారణ సమయంలో బ్రౌన్ రైస్ తినడం సురక్షితమేనా? గర్భధారణ సమయంలో బ్రౌన్ రైస్ గురించి అది తినడం సురక్షితమేనా అని తెలిపేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ దీనిని సాధారణంగా సురక్షితమైనదిగా పరిగణిస్తారు. బ్రౌన్ రైస్​లో కొంత మొత్తంలో ఆర్సెనిక్ ఉంటుంది. ఇది అధిక మోతాదులో ఉంటే హానికరం. బ్రౌన్​ రైస్​లో ఉండే ఆర్సెనిక్ మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యానికి హానికలిగించేంత మోతాదులో ఉన్నట్లు భావించబడదు. హెల్తీ డైట్​లో భాగంగా బ్రౌన్ రైస్ తినడం వల్ల మీకు మీ బిడ్డకు ఎటువంటి హాని జరగదు. ఏదేమైనా మీకు ఆందోళనలు ఉంటే హెల్త్ కేర్ ప్రొవైడర్ లేదా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

    గర్భవతిగా ఉన్నపుడు బ్రౌన్​ రైస్ తినేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Precautions to take while eating brown rice in Telugu)

    గర్భధారణలో సమయంలో బ్రౌన్​ రైస్ తినేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి:

    1. తినడానికి ముందు బ్రౌన్​ రైస్​ను పూర్తిగా ఉడికించండి.

    2. సరిగ్గా ఉడకకుండా ఉన్న పచ్చి బ్రౌన్​ రైస్​ను గర్భిణీ స్త్రీలు తినకూడదు.

    3. బ్రౌన్​ రైస్​ను వండే ముందు నీటిలో దాదాపు 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజన్​ అయ్యే ప్రమాదం తగ్గిపోతుంది.

    4. గర్భిణీ స్త్రీలు పాలిష్ చేయని, బ్రోకెన్ బ్రౌన్ రైస్ (నూకలు) తినకూడదు. ఎందుకంటే వీటిలో అధిక మోతాదులో ఆర్సెనిక్ ఉంటుంది.

    ఆర్సెనిక్ స్థాయిలు ఎంత మొత్తంలో ఉన్నాయని పరీక్షించడం, సరిగ్గా వండడం కూడా ముఖ్యం.

    చివరగా (Conclusion)

    చివరగా చెప్పొచ్చేదేంటంటే.. గర్భధారణ సమయంలో బ్రౌన్ రైస్ తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది గర్భవతులకు ఫైబర్, B విటమిన్ వంటి అవసరమైన పోషకాలను అందించడం మాత్రమే కాకుండా... రక్తంలో చెక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. గర్భధారణలో బ్రౌన్ రైస్ తినేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. మీరు సక్రమమైన పోర్షన్ సైజ్ (ఎంత మోతాదు అనేది) మరియు సేఫ్ కుకింగ్ మెథడ్స్​ను ఫాలో అయితే ఇది సులభం. ఎన్నో రకాల ప్రినేటల్ డైట్లకు అద్భుతంగా ఉండే ఇటువంటి అదనపు ఆహారాల గురించి మైలో ఫ్యామిలీని సందర్శించి తెలుసుకోండి.

    References

    1. Su LJ, Chiang TC, (2023). O'Connor SN. Arsenic in brown rice: do the benefits outweigh the risks? Front Nutr.

    2. Adamu HA, Imam MU, Ooi DJ, Esa NM, Rosli R, Ismail M. (2017). In utero exposure to germinated brown rice and its oryzanol-rich extract attenuated high fat diet-induced insulin resistance in F1 generation of rats. BMC Complement Altern Med.

    Tags

    Brown rice safe during pregnancy in Telugu, What are the nutritional value of brown rice in Telugu, Benefits of brown rice during pregnancy in Telugu, Brown Rice During Pregnancy: Benefits & Precautions in English, Brown Rice During Pregnancy: Benefits & Precautions in Hindi, Brown Rice During Pregnancy: Benefits & Precautions in Bengali, Brown Rice During Pregnancy: Benefits & Precautions in Tamil

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.