This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో పాలు: మీకు ఏ రకమైన పాలు మంచివి? | Milk During Pregnancy: Which Milk is Good for Pregnancy in Telugu

Diet & Nutrition
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Dec 26, 2025
గర్భధారణ సమయంలో పాలు: మీకు ఏ రకమైన పాలు మంచివి? | Milk During Pregnancy: Which Milk is Good for Pregnancy in Telugu
Read time7 min

గర్భవతులకు గర్భధారణ సమయంలో కావలసిన అన్ని పోషకాలు పాలలో ఉంటాయి. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలతో పాటు, గర్భవతులు రోజూ ఒక గ్లాసు పాలు తాగడం మంచిది. అయితే గర్భధారణ సమయంలో పాలు మంచివా? అవి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇంకా పాలు ఏ రకంగా తీసుకోవాలో తెలుసుకోవడానికి ఇది చదవడం కొనసాగించండి.

గర్భధారణ సమయంలో పాలు తీసుకోవడం సురక్షితమా? (Is it safe to drink milk during pregnancy in Telugu)

అవును, గర్భధారణలో పాలు తీసుకోవడం సురక్షితమే. గర్భధారణలో పాలు తీసుకోవడం వల్ల, అది వారికి కావలసిన కాల్షియం, ప్రోటీన్ ఇంకా విటమిన్ డి అందించే మంచి వనరు పాలు అని చెప్పవచ్చు, ఇవి ఆరోగ్యకరమైన గర్భానికి ఇంకా శిశువు ఎదుగుదలకు ఎంతో ముఖ్యమైనవి

గర్భిణీ స్త్రీ రోజూ ఎంత మొత్తంలో పాలను తీసుకోవాలి (What amount of milk a pregnant woman should consume daily in Telugu)

కాబోయే తల్లులు పాలు ఇంకా ఇతర పాల ఉత్పత్తులను మితంగా తీసుకోవాలి, లేకుంటే అది కడుపు ఉబ్బరం ఇంకా ఇతర జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. గర్భధారణ సమయంలో, గర్భవతులు మూడు కప్పుల పాలు తీసుకోవడం వల్ల తమకు అవసరమైన అన్ని పోషకాలను పాల నుండి పొందవచ్చు. అయితే, అది ఆవు పాలు కాకపోతే, వారు ఇతర పాలలోని పోషకాల మొత్తాన్ని లెక్కించాల్సి ఉంటుంది ఇంకా తదనుగుణంగా పాలను తీసుకోవడం ద్వారా వాటిని సర్దుబాటు చేసుకోవాలి.

గర్భధారణ సమయంలో పాల ప్రయోజనాలు (Benefits of milk in pregnancy in Telugu)

1. గర్భిణీ స్త్రీలకు కాల్షియం ఇంకా విటమిన్ డి అందించే ముఖ్యమైన వనరు పాలు. అంతేకాక, కాబోయే తల్లులులకు తగినంత విటమిన్ డి లభించడం వల్ల పుట్టే బిడ్డకు అలెర్జీలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది, ఇంకా పాలు తీసుకోవడం వల్ల కాబోయే తల్లికి ఆవశ్యకమైన కాల్షియం దాని నుండి లభిస్తుంది.

2. అంతేకాకుండా, గర్భవతిగా ఉన్నప్పుడు పాలు తాగడం వల్ల పిండం పెరుగుదల వంటి మంచి ప్రయోజనాలు ఉన్నాయని తేలింది, దీని ఫలితంగా పుట్టబోయే శిశువు మంచి బరువు ఇంకా పొడువుతో పుట్టే అవకాశముంది. శిశువు రక్తంలోని అధిక ఇన్సులిన్ స్థాయిల వల్ల, వారికి యుక్తవయస్సు చివరిలో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా అది తగ్గించవచ్చు.

3. పాలలో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు ఇంకా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి శిశువు నాడీ వ్యవస్థ ఎదుగుదలకి అవసరం. పాలలో ఉండే కాల్షియం మరియు ఐరన్ కారణంగా అవి శిశువులో ఎముకల ఎదుగుదలకు దోహదపడుతుంది ఇంకా శిశువు శరీరానికి తగినంత ఆక్సిజన్ అందేలా సహాయపడుతుంది. గర్భంలో ఎదుగుతున్న శిశువుకు ఆవశ్యకమైన అన్ని విటమిన్లు ఎ, బి ఇంకా డి పాలలో ఉన్నాయి.

4. గర్భధారణ సమయంలో తరచుగా సంభవించే గుండెల్లో మంట ఇంకా ఇతర కడుపు సమస్యలకు పాలు తన చక్కని యాంటాసిడ్‌ లక్షణాలతో వాటిని తగ్గించేందుకు సహాయపడుతుంది.

5. పాలలోని అయోడిన్ పిండం మెదడు అభివృద్ధికి సహాయపడుతుందని దానివల్ల పిల్లల ఐక్యూని పెరుగుతుందని తేలింది.

6. గర్భధారణ సమయంలో పాలు తాగడం వల్ల బోలు ఎముకల వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇంకా నియోనాటల్ రికెట్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

ఏది సురక్షితమైనది: పచ్చి పాలు లేదా పాశ్చరైజ్డ్ పాలా? (What is safer: raw milk or pasteurized milk in Telugu)

1. గర్భధారణ సమయంలో, పచ్చి (పాశ్చరైజ్ చేయని) పాలను తాగడం లేదా పచ్చి పాలతో చేసిన ఏదైనా పదార్థాలు, అంటే పెరుగు, మెత్తని చీజ్ మరియు ఐస్ క్రీం లాంటివి తినడం అంత సురక్షితం కాదు, ఆవులు, గొర్రెలు మరియు మేకలతో సహా వేటి నుండి తీసిన పాలకైనా ఇది వర్తిస్తుంది.

2. పాశ్చరైజేషన్ సమయంలో, ప్రమాదకరమైన సూక్ష్మజీవులను చంపడానికి పాలను అధిక ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. అయితే, పచ్చి పాలు ఈ పద్ధతిలో శుభ్రపరచబడదు, దానివల్ల ఇది E. కోలి, సాల్మోనెల్లా ఇంకా టాక్సోప్లాస్మా వంటి ప్రమాదకరమైన వ్యాధికారక క్రిములను కలిగి ఉంటుంది. వాటిలో లిస్టిరియా అనేది చాలా ప్రమాదకరమైనది, ఇది లిస్టెరియోసిస్, ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.

3. ముఖ్యంగా గర్భవతులు ఈ లిస్టెరియాకు గురవుతారు, ఇది ప్రాణాంతక విషాహార వ్యాధులకు ప్రధాన కారణం. అంతేకాక, నెలలు నిండకుండానే జరిగే ప్రసవం, మృత శిశుజననం ఇంకా లిస్టెరియోసిస్ లాంటివన్నీ నవజాత శిశువులకు ప్రాణాంతకం అవుతాయి.

గర్భధారణ సమయంలో ఎలాంటి పాలు తీసుకోవడం మంచిది? (What kind of milk is best to drink during pregnancy in Telugu)

గర్భవతిగా ఉన్నప్పుడు ఆవు పాలు తీసుకోవడం మంచిదని ఎంతో మంది నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక అనువైన పోషక లక్షణాలను కలిగివున్నది అంటారు, అంతేకాక కాల్షియం ఇంకా విటమిన్ డి వంటి విటమిన్లు మరియు ఖనిజాల విస్తృత శ్రేణిని పాలు కలిగి ఉంది.

గర్భధారణ సమయంలో పాలు త్రాగడానికి సురక్షితమైన మార్గాలు (Safe ways to drink milk during pregnancy in Telugu)

1. పాలలో నీటిని 2:1 నిష్పత్తిలో కలపాలి. దీనిని మిల్క్‌షేక్‌లు లేదా టీలో చేర్చుకోవచ్చు

2. పాలను ఒకేసారి మొత్తంగా తాగకుండా, గోరువెచ్చని పాలను నిదానంగా తీసుకోవాలి.

3. భోజనం తర్వాత వెంటనే పాలు తాగకూడదు

4. మూడు గ్లాసుల వరకు పాలు తీసుకోవాలి

పాటించవలసిన మార్గదర్శకాలు మరియు జాగ్రత్తలు (Guidelines and precautions in Telugu)

· పెరుగు వంటి పోషకాలతో కూడిన పాల పదార్థాలను మధ్యాహ్నం అల్పాహారంగా తీసుకోవచ్చు. అయితే, గర్భధారణ సమయంలో అధిక చక్కెర స్థాయిలు ప్రమాదకరం కాబట్టి, వాటిలోని చక్కెర స్థాయిలను గమనిస్తూ ఉండాలి.

1. అల్పాహారం కోసం కార్న్‌ఫ్లేక్స్, ఓట్స్ ఇంకా బార్లీ వంటి తృణధాన్యాలను పాలను కలపాలి. అందువల్ల గర్భవతులు తమ ఆహారాన్ని కార్బోహైడ్రేట్ ఇంకా ప్రోటీన్ పోషకాలతో సమతుల్యం చేసుకోగలుగుతారు.

2. రాత్రి భోజనం తర్వాత ఒక కప్పు స్కిమ్డ్ మిల్క్(వెన్నతీసిన పాలు) తీసుకోవాలి.

3. పాశ్చరైజ్ చేయని పాలు ఇంకా బూజు పట్టిన చీజ్‌లతో తయారుచేసిన పదార్థాల జోలికి పోకపోవడమే మంచిది. ఇలాంటి చీజ్‌లను తినడం వల్ల గర్భవతులకు బ్యాక్టీరియా కలుషితాల కారణంగా లిస్టెరియోసిస్ వచ్చే ప్రమాదం ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ's)

1. గర్భధారణలో పాలు తాగాలని ఎందుకనిపిస్తుంది? (Why do I crave milk in pregnancy?)

మానవ శరీరాలకు ఆవశ్యకమైన పోషకాల సహజ అవసరం ఉంటుంది. కాబట్టి, గర్భవతులకు పాలు తాగాలనిపిస్తే, వారికి తగినంత కాల్షియం, ప్రోటీన్ లేదా కొవ్వు లభించడం లేదని దాని అర్థం. గర్భధారణలో పాలు తీసుకోవడం మంచిది, ఇంకా అది కాబోయే తల్లికి, పుట్టబోయే బిడ్డకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అంతేకాక, పాలను క్రమం తప్పకుండా తాగడం వలన వారి పాలను తాగాలనే కోరికను నెరవేర్చేలా అది సహాయపడుతుంది.

2. గర్భధారణ సమయంలో పాలు తాగడం ఎప్పుడు ప్రారంభించాలి? (When should I start drinking milk during pregnancy?)

గర్భధారణలోని మొదటి త్రైమాసికంలో గర్భవతులు పాలను తీసుకోవడం ప్రారంభించవచ్చు. అంతేకాక, మొదటి త్రైమాసికంలో పాలు తాగడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

3. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో పాలు తీసుకుంటే ఏమి జరుగుతుంది? (What will happen if I consume excessive amounts of milk during pregnancy?)

గర్భధారణ సమయంలో పాలను ఎక్కువగా తీసుకుంటే, అది వికారం, వాంతులు ఇంకా కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కలిగించే అవకాశం ఉంది.

References

1. Achón M, Úbeda N, García-González Á, Partearroyo T, Varela-Moreiras G. (2019). Effects of Milk and Dairy Product Consumption on Pregnancy and Lactation Outcomes: A Systematic Review. Adv Nutr.

2. Melnik BC, John SM, Schmitz G. (2015). Milk consumption during pregnancy increases birth weight. J Transl Med.

Tags

Milk During Pregnancy in Telugu, Is it safe to drink Milk During Pregnancy in Telugu, Benefits of drinking Milk During Pregnancy in Telugu, Milk During Pregnancy in English, Milk During Pregnancy in Hindi, Milk During Pregnancy in Tamil, ⁠Milk During Pregnancy in Bengali

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Kakarla Sirisha
Kakarla Sirisha

Related Articles

Questions about this article

  • Asked by 28 weeks pregnant

    Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

  • Asked when 35 weeks pregnant

    Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

  • Asked when 39 weeks pregnant

    Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

  • Asked when 34 weeks pregnant

    Hii 34 weeks how many months

  • Asked when 14 weeks pregnant

    Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.