


Pregnancy Best Foods
3 November 2023 న నవీకరించబడింది
ప్రతీ మహిళ జీవితంలో గర్భవతి అయిన సందర్భం ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అయితే కొన్ని రకాల భయాలు, ఆందోళనలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రయాణంలో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకే ప్రెగ్నెన్సీ కాలం బహుముఖంగా ఉంటుంది. నిత్యం అప్రమత్తంగా ఉండటం అవసరం. గర్భవతి ఇంట్లో ఉన్నప్పుడు సాధారణ విషయాలు, అంశాలనూ పరిశీలనగా గమనించాల్సి ఉంటుంది. తినే ఆహారపదార్థాల్లో ప్రతీదానిపైనా దృష్టి అవసరం. అప్పుడే గర్భధారణ కాలం సంతోషంగా, ఆరోగ్యకరంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. భారతీయ వంటశాలల్లో సాధారణంగా కనిపించే పసుపు ఉపయోగాలు, ప్రయోజనాలు, ప్రభావాలపై ఈ వ్యాసంలో క్షుణ్ణంగా చర్చిస్తాం. గర్భధారణ సమయంలో పసుపు ప్రభావం ఎలా ఉంటుందో వివరిస్తాం.
గర్భవతిగా ఉన్నప్పుడు పసుపు వాడితే లాభమా, నష్టమా అనేదానిపై పరిశోధనలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే గర్భధారణ సమయంలో ఎండబెట్టిన లేదా తాజా పసుపు తీసుకోవడం సురక్షితమే అన్న ఏకాభిప్రాయం ఉంది. భోజనంలో కొంత పసుపు ఉండటం కాబోయే తల్లులకు మంచిదే. ఇక కొన్ని వండిన కూరగాయల్లో కూడా పసుపు ఉంటుంది.
అయితే, ముందస్తు ప్రసవం లేదా గర్భస్రావం జరగడం లాంటి వాటికి పసుపు తీసుకోవడానికి లింక్ ఉందని అనుకోకూడదు. కానీ గర్భవతులు పసుపుతో కూడిన క్యాప్సూల్స్, సప్లిమెంట్స్‌కి దూరంగా ఉండాలని చెబుతుంటారు. గర్భవతిగా ఉన్నప్పుడు పసుపును అధిక మొత్తంలో తీసుకుంటే శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలో మార్పులు చేస్తుందని అధ్యయనం చెబుతోంది. ఇది గర్భాశయ సంకోచాలకు, రక్తస్రావానికి దారితీయొచ్చు.
టేబుల్ స్పూన్ (15 గ్రాముల) పసుపులో ఉండే పోషక విలువల వివరాలు-
|
కేలరీలు |
42 కిలో కేలరీలు
|
|
కార్బోహైడ్రేట్స్
|
7.38 గ్రాములు
|
|
ప్రొటీన్స్
|
1 గ్రామ్ |
|
కొవ్వు
|
1 గ్రామ్ |
|
పీచుపదార్థం |
3.21 గ్రాములు
|
|
సోడియం
|
3 మిల్లీ గ్రాములు |
|
క్యాల్షియం
|
18.3 మిల్లీ గ్రాములు |
|
ఐరన్
|
6.9 మిల్లీ గ్రాములు |
గర్భధారణ సమయంలో పసుపు వాడకం వల్ల కలిగే ప్రభావాలు, ప్రయోజనాలకు సంబంధించి ఎక్కువగా సమాచారం అందుబాటులో లేదు. కాబట్టి గర్భవతులు తక్కువ మొత్తంలో పసుపు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. పసుపును పాలల్లో కొద్దిగా కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే-
గర్భధారణ సమయంలో రెండో నెల నుంచి ఎనిమిదో నెల మధ్య, ప్రొజెస్టెరాన్ హార్మోన్ గర్భవతుల్లో దంత సమస్యలకు కారణమవుతుంది. వీటిలో చిగురువాపు సమస్య కూడా ఒకటి. ఇది చిగుళ్ల వాపు, రక్తస్రావానికి సంబంధించిన సమస్య. గర్భవతుల్లో 30 నుంచి 100 శాతం మంది మహిళలు చిగురువాపు సమస్యతో బాధపడుతుంటారని గణాంకాలు చెబుతున్నాయి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి భోజనం సమయంలో, కూరల్లో, మసాలాల్లో తీసుకోవడం వల్ల చిగురువాపు సమస్య తగ్గుతుంది.
ఇంకా, గర్భవతులు కాని మహిళలు పసుపుతో చేసిన మౌత్‌వాష్ ప్రామాణికంగా వాడే యాంటీమైక్రోబయల్ లాగా ప్రభావవంతంగా ఉంటుందని ఓ అధ్యయనంలో చెప్పారు. ఇది చిగురువాపును, గారపట్టడాన్ని నివారించడంలో ఉపయోగపడుతుంది. అయితే గర్భధారణ సమయంలో పసుపుతో చేసిన మౌత్‌వాష్ వాడాలనుకుంటే వైద్యుల్ని లేదా డెంటిస్ట్‌ను సంప్రదించాలి. అంతేకాదు, ఆ ప్రొడక్ట్‌లో పసుపు తక్కువగా ఉండాలి.
ప్రీక్లాంప్సియా కేవలం గర్భవతుల్ని మాత్రమే వేధించే సమస్య. గర్భధారణలో 20వ వారం తర్వాత ఈ సమస్య వస్తుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రం లేదా మూత్రపిండాలలో ప్రోటీన్ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ప్రీఎక్లంప్సియా కాలేయ సమస్యలకు కూడా కారణం కావచ్చు. గర్భవతుల్లో 8 శాతం మంది మహిళలకు ఈ పరిస్థితి వస్తుంది. దీనికి చికిత్స ఉంది. ప్రీఎక్లంప్సియాతో బాధపడుతున్న మహిళలు ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిస్తారు.
ప్రతికూలతల విషయానికి వస్తే, ప్రీఎక్లంప్సియా కొన్ని అరుదైన పరిస్థితులకు దారితీయవచ్చు. ఇది తల్లి లేదా శిశు వైకల్యానికి, మరణానికి కూడా దారితీయవచ్చు. ఈ పరిస్థితి రావడానికి గల ఖచ్చితమైన కారణాలేంటో తెలియదు. కానీ వాపు ప్రధాన కారణం కావచ్చని భావిస్తారు. కర్కుమిన్ అంటే పసుపు పొడి మహిళల్లో ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను తగ్గిస్తాయని ఓ ప్రత్యేకమైన అధ్యయనం వివరించింది. ఇది ప్రీఎక్లంప్సియాను కూడా నివారించడానికి సాయపడుతుంది. ఈ అధ్యయన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నా, అధ్యయనం పరిమితం మాత్రమే. ప్రీఎక్లంప్సియా నివారణలో పసుపు ఎంత వరకు ప్రయోజనాలు కల్పిస్తుంది అన్నదానిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది.
గర్భధారణ సమయంలో పసుపు పాలు తాగడం సురక్షితమే. అయితే పరిమాణం తక్కువగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి. పాలలో, కూరగాయల్లో కొద్దిగా పసుపు కలిపి తీసుకుంటే గర్భవతులకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తీసుకుంటేనే ఇది వర్తిస్తుంది. అయితే, గర్భవతులు పసుపును అధిక మొత్తంలో తీసుకోకూడదని చాలామంది నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే, అతిగా పసుపు తీసుకుంటే ముందస్తు ప్రసవం లేదా గర్భం కోల్పోవడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
గర్భవతులకు మేలు కలిగేలా పసుపు పాలను ఎలా తీసుకోవాలో తెలుసుకోండి-
అయితే, పసుపు లేదా పసుపుతో తయారు చేసిన ఉత్పత్తుల్ని వాడేముందు గైనకాలజీ డాక్టర్‌ను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.
జవాబు: గర్భవతిగా ఉన్నప్పుడు కొద్ది మొత్తంలో పసుపు తీసుకోవడం సురక్షితమే. కూరలు వండేప్పుడు మసాలాలతో కలిపి తీసుకోవచ్చు. పాలు లేదా టీతో పాటు తీసుకోవచ్చు.
జవాబు: గర్భంపై పసుపు ప్రభావం చూపిస్తుందన్నదానిపై ఎలాంటి అధ్యయనాలు, ఆధారాలు లేవు. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ స్థాయిలో పసుపు తీసుకోవడం మంచిది కాదు.
1. Tossetta G, Fantone S, Giannubilo SR, Marzioni D. (2021). The Multifaced Actions of Curcumin in Pregnancy Outcome. Antioxidants (Basel).
2. Filardi T, Varì R, Ferretti E, Zicari A, Morano S, Santangelo C. (2020). Curcumin: Could This Compound Be Useful in Pregnancy and Pregnancy-Related Complications? Nutrients.
Tags
Is turmeric safe during pregnancy in Telugu, Turmeric milk during pregnancy in Telugu, Is turmeric milk safe during pregnancy in Telugu, Benefits of turmeric milk during pregnancy in Telugu, Turmeric milk during pregnancy in English, Turmeric milk during pregnancy in Hindi, Turmeric milk during pregnancy in Tamil, Turmeric milk during pregnancy in Bengali
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)