
టైఫాయిడ్ అనేది గర్భధారణ సమయంలో వచ్చే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, గర్భిణీ స్త్రీలు దాని లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోవాలి. ఈ శీర్షికలో, గర్భధారణ సమయంలో టైఫాయిడ్ లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్స, నివారణ గురించి మేము వివరిస్తాం.
టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటూ వ్యాధి. ఇది కలుషితమైన ఆహారం, నీరు ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. టైఫాయిడ్ యొక్క లక్షణాలు జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, మలబద్దకం లేదా అతిసారం. తీవ్రమైన సందర్భాల్లో, టైఫాయిడ్ శరీరం లోపల రక్తస్రావం, పేగులు పాడవడం వంటి సంక్లిష్టమైన సమస్యలకు దారితీయొచ్చు.
గర్భధారణ సమయంలో టైఫాయిడ్ ముఖ్యంగా కలుషితమైన ఆహారం, నీరు ద్వారా వ్యాపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశుధ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి టైఫాయిడ్ సర్వ సాధారణం. ఈ వ్యాధి ఒకరికొకరు దగ్గరగా ఉండటం వల్ల త్వరగా వ్యాపిస్తుంది, అంటే చుట్టుపక్కల ఎవరికైనా టైఫాయిడ్ ఉంటే తొందరగా ఇంకొకరికి వచ్చే ప్రమాదం ఉంటుంది.
గర్భధారణ సమయంలో టైఫాయిడ్ లక్షణాలు గర్భిణీ స్త్రీలకు, మామూలు స్త్రీలకు ఒకేలా ఉంటాయి. వీటితో పాటు:
ఇది టైఫాయిడ్ యొక్క సాధారణ లక్షణం. అధిక జ్వరం 104 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు రావచ్చు.
టైఫాయిడ్‌తో బాధపడుతున్న చాలా మందికి తలనొప్పి కూడా వస్తుంది.
టైఫాయిడ్ వల్ల కడుపు నొప్పి వస్తుంది, పొత్తి కడుపులో ఎక్కువగా వస్తుంది.
చాలా మందికి టైఫాయిడ్ వచ్చినప్పుడు మలబద్ధకం మరి కొందరికీ అతిసారం వస్తుంది.
టైఫాయిడ్ యొక్క ఇతర లక్షణాలు నీరసం, ఆకలి వేయకపోవడం, ఛాతి లేదా పొట్ట మీద దద్దుర్లు రావడం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో మలేరియా: కారణాలు, ప్రభావాలు & చికిత్స
గర్భధారణ సమయంలో టైఫాయిడ్‌ను కనుగొనడానికి వైద్యులు శారీరక పరీక్ష చేసి రోగి యొక్క వైద్య చరిత్ర లక్షణాలు అడిగి తెలుసుకుంటారు. రోగ నిర్ధారణ కోసం వైద్యులు రోగికి రక్తపరీక్ష, మలం నమూనా పరీక్షకు పంపమని చెప్పొచ్చు.
గర్భధారణ సమయంలో టైఫాయిడ్ చికిత్సకు యాంటీబయాటిక్స్ వాడతారు. వీటిని నోటి ద్వారా గానీ ఇంట్రావీనస్ ద్వారా గానీ ఇవ్వచ్చు. రోగి పరిస్థితి, రోగ తీవ్రత బట్టి నిర్దిష్ట యాంటీబయాటిక్ వాడతారు. ఇన్ఫెక్షన్‌ను పూర్తిగా నిర్మూలించడానికి చికిత్సను పూర్తి చేయడం అవసరం.
గర్భధారణ సమయంలో టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఎక్కువ వ్యాప్తి చెందదు. ఏదేమైనా, గర్భం దాల్చిన స్త్రీలకి టైఫాయిడ్ వల్ల కలిగే ఇబ్బందులు ఎక్కువ ఉండొచ్చు. గర్భధారణ సమయంలో వచ్చే శారీరక మార్పుల వల్ల శరీరంలో నీరు తగ్గుతుంది, దీని వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.
చాలా సందర్బాల్లో, టైఫాయిడ్ వల్ల గర్భిణీలకు గానీ, పుట్టబోయే బిడ్డ గానీ ఎక్కువ సమస్యలు కలిగించదు. అయినప్పటికీ, గర్భిణీ స్త్రీలు టైఫాయిడ్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైతే, వ్యాధి గర్భంపై ప్రభావం చూపించగలదు. టైఫాయిడ్‌తో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకి శరీరంలో నీరు తగ్గడం, నెలలు నిండకుండానే ప్రసవం అవ్వడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాంటప్పుడు గర్భిణీ స్త్రీలు టైఫాయిడ్‌కి సురక్షితమైన తక్షణ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
గర్భధారణ సమయంలో టైఫాయిడ్‌ని నివారించడానికి మంచి పరిశుభ్రతను పాటించాలి. కలుషిత ఆహారం, నీరు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా టైఫాయిడ్ వ్యాక్సిన్‌తో పాటు ఇతర వ్యాక్సిన్లు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు టైఫాయిడ్ వ్యాక్సిన్ సురక్షితమైంది, ఇంకా వ్యాధి సంక్రమణ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
టైఫాయిడ్ చికిత్సకు ఉపయోగించే యాంటీబయాటిక్స్ చాలా వరకు గర్భధారణ సమయంలో వేసుకోవడం సురక్షితమే. అయిన సరే, వాటి వల్ల జరిగే హాని, ఉపయోగాలు గురించి వైద్యులను సంప్రదించిన తర్వాతే మందులు వాడడం మొదలుపెట్టాలి.
కొన్ని సందర్భాల్లో, చికిత్స తీసుకున్న తర్వాత కూడా టైఫాయిడ్ వస్తుంది. టైఫాయిడ్ పూర్తిగా నిర్మూలించబడనప్పుడు లేదా మళ్లీ బ్యాక్టీరియాకి గురైనప్పుడు ఇన్‌ఫెక్షన్ మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది. టైఫాయిడ్ మళ్ళి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి వైద్యులు ఇచ్చిన మందులు పూర్తిగా వాడాలి. తిరిగి బ్యాక్టీరియాకి గురవకుండా మంచి పరిశుభ్రతను పాటించాలి.
గర్భిణీ స్త్రీలు మంచి పరిశుభ్రతను పాటించాలి, కలుషితమైన ఆహారం, నీరు తీసుకోకూడదు. టైఫాయిడ్ రాకుండా నివారించడానికి వ్యాక్సిన్ తీసుకోవాలి. తీవ్రమైన సందర్భాల్లో, టైఫాయిడ్ వల్ల అంతర్గత రక్త స్రావం, ప్రేగు పాడటం వంటి సమస్యలు ప్రాణాంతకం కావచ్చు. గర్భిణీ స్త్రీలో టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తే, సరైన రోగ నిర్ధారణ, చికిత్స కోసం వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం. టైఫాయిడ్ చికిత్సకు వాడే యాంటీబయాటిక్స్ గర్భధారణ సమయంలో సురక్షితమే. అయిన సరే, వాటి వల్ల జరిగే హాని, ఉపయోగాలు గురించి వైద్యులను సంప్రదించిన తర్వాతే మందులు వాడడం మొదలుపెట్టాలి.
1. Touchan F, Hall JD, Lee RV. (2009). Typhoid fever during pregnancy: case report and review. Obstet Med.
2. Buongiorno R, Schiraldi O. (1984). Treatment of typhoid fever in pregnancy. Chemioterapia.
3. Seoud M, Saade G, Uwaydah M, Azoury R. (1988). Typhoid fever in pregnancy. Obstet Gynecol.
Tags
Typhoid in Pregnancy in Telugu, What are the symptoms of Typhoid in Pregnancy in Telugu, Can Typhoid affect the pregnancy in Telugu, Treatment of typhoid in pregnancy in Telugu, Typhoid in Pregnancy in English, Typhoid in Pregnancy in Hindi, Typhoid in Pregnancy in Tamil, Typhoid in Pregnancy in Bengali
Yes
No

















Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |