
గర్భధారణ సమయంలో గ్యాస్ అనేది అత్యంత సాధారణమైన ప్రీనాటల్ లక్షణం. ఇది సాధారణంగా గర్భం యొక్క పదకొండవ వారంలో ప్రారంభమవుతుంది, ప్రసవం అయ్యేంత వరకు ఉంటుంది.
గర్భధారణ జరిగినప్పుడు మీరు గమనించే ఉబ్బరానికి కారణం ప్రొజెస్టెరోన్ అనే ప్రెగ్నెన్సీ హార్మోన్. ఆరోగ్యకరమైన గర్భిణికి ప్రొజెస్టెరోన్ తగిన మోతాదులో ఉండటం అవసరం. అయితే గర్భిణికి చాలా అనుకూలమైన హార్మోన్ కనుక, ప్రొజెస్టెరోన్ వల్ల ఏర్పడే ఉబ్బరం, త్రేణుపులు, గ్యాస్ విడుదల ఇవన్నీ భరించగలిగే లక్షణాలు అనిపిస్తాయి. మీరు తినే ఆహారం నుండి మీ శిశువుకు అన్ని పోషకాలు అందేందుకు మీ జీర్ణక్రియ మందగిస్తుంది. అది నిజానికి మంచి విషయం. కానీ దురదృష్టవశాత్తు జీర్ణక్రియ మందగించటమే ఉబ్బరానికి, నొప్పికి దారితీస్తుంది. మీ గర్భాశయం పరిమాణం పెరిగేకొద్దీ, మీ పురీషనాళంపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కండరాల నియంత్రణ సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల గాలి ఉత్పత్తి అవుతుంది.
మీ గర్భాశయం పెరగడం వల్ల మీ కడుపుపై, ప్రేగులపై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉంది. అధికంగా ఆహారం తీసుకుంటున్నట్లు మీకు అనిపిస్తుంది. ఇది మీకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ, మీ కడుపులో ఉన్న బిడ్డకు మీరు ఎదుర్కొంటున్న గ్యాస్, వికారం లాంటి అసౌకర్యాల గురించి తెలియదు, కనుక మీరు కంగారు పడక్కరలేదు.
గర్భధారణ సమయంలోనే కాక మామూలుగా కూడా, క్రమం తప్పకుండా మలమూత్ర విసర్జన సవ్యంగా జరిగేలా చూసుకోవటం వలన ఉబ్బరం నుంచి, అది కలిగించే అసౌకర్యం నుంచి తప్పించుకోవచ్చు. అందుకు కొన్ని సూచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
గర్భధారణ సమయంలో మలబద్ధకాన్ని నివారించడానికి మరొక మార్గం, ఆకుకూరలు, చిక్కుడు జాతి కూరలు, తృణధాన్యాలు, పండ్ల వంటి పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం. పీచుపదార్థాలను క్రమం తప్పకుండా తీసుకొనే అలవాటు మీకు లేకపోతే, నెమ్మదిగా ప్రారంభించటం మంచిది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో టాపియోకా(కర్రపెండలం పిండి) వల్ల కలిగే ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్
ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే, ఎక్కువ గ్యాస్ ను విడుదల చేసే అవకాశం ఉంటుంది. మీ బిడ్డకు మంచి ఆహారం అందించడం కోసం మీ పోషక స్థాయిలను స్థిరంగా ఉంచుకోవడంతో పాటు, ఆరుసార్లు తక్కువ మోతాదులో భుజించటం లేదా మూడుసార్లు మితంగా భుజించి, దానికి తోడు రోజుకు రెండు లేదా మూడుసార్లు చిరుతిళ్ళు తినటం పాటిస్తే, జీర్ణవ్యవస్థపై అధిక భారం పడకుండా ఉంటుంది. గర్భిణీసమయంలో వచ్చే కడుపు ఉబ్బరాన్ని, గుండెల్లో మంటని ఇది నియంత్రిస్తుంది.
ఐదు నిమిషాల్లో గబగబా భోజనం చేసేస్తే, భోజనంతో పాటుగా చాలా గాలి మింగబడుతుంది. మీ కడుపులో గాలి స్థిరపడటం వలన మీరు గ్యాస్ బుడగలు మరియు ఉబ్బరంతో ఇబ్బంది పడతారు. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, గర్భిణీ సమయమంతా నెమ్మదిగా తినడానికి ప్రయత్నించండి. మీ పొత్తికడుపులో నొప్పి చాలా వరకు తగ్గుతుంది, మీకు ఎంతో అవసరమైన విశ్రాంతి కూడా మీకు దొరుకుతుంది.
గర్భిణీ స్త్రీలు హడావిడిగా ఆహారం తినటం వల్ల గర్భధారణ సమయంలో ఉబ్బరం, గాలిని మ్రింగటం జరుగుతుంది. అంటే, ఏదైనా రిపోర్ట్ తయారుచేస్తూ భోజనం చేయటం, అమ్మతో ఫోన్లో గొడవపడుతూ భోజనం చేయటం ఇలాంటి హడావిడులు పనికిరావు. భోజనం చేస్తున్నంతసేపూ ఉచ్చ్వాస నిశ్వాసల మీద ధ్యాస పెడుతూ ఉంటే, నిదానంగా, శ్రద్ధగా తినటం కుదురుతుంది. భోజన సమయంలో విరామం ఉన్నది పని నుంచి విరామం తీసుకోవటానికే అని గుర్తించండి.
గర్భధారణ సమయంలో ఈ కృత్రిమ స్వీటెనర్లను వాడటం సురక్షితమే అయినప్పటికీ, అవి గ్యాస్ ను పెంచి, కడుపులో బాధను కలిగిస్తాయి. అందువల్ల, ఈ ఉత్పత్తులను కొనేముందు ప్యాక్ పై లేబుల్‌ని చదివి అప్పుడు కొనాలో లేదో నిర్ధారించుకోండి.
పెరుగు, పుల్లని రొట్టె వంటి ప్రోబయోటిక్ ఘనంగా ఉండే ఆహారం తినడం ద్వారా మీ కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి. ప్రీబయోటిక్ సప్లిమెంట్‌ను ఉపయోగించే ముందు, మీ ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి.
గర్భధారణ సమయంలో ఉబ్బరాన్ని, గ్యాస్ ను నివారించాలంటే, 10 నిముషాలైనా బయట నడవటం మంచిది.
ఒక కప్పు కమొమైల్ టీ గానీ ఒక గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని గానీ తాగితే, గర్భధారణ సమయంలో వివిధ జీర్ణాశయ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
గర్భసమయంలోని మొదటి త్రైమాసంలో మీ కడుపు మీ ప్రేగులను నొక్కనంతవరకే ఈ సలహా వర్తిస్తుంది. గర్భధారణ ప్రారంభంలో కడుపు ఉబ్బరాన్ని తగ్గించటానికి సున్నితంగా పొత్తికడుపును మసాజ్ చేయటం ఉపయోగపడుతుంది. పక్కటెముకల మీదుగా మసాజ్ చేస్తూ, కుడి వైపుకు పోనిచ్చి, కిందకి ఎడమ వైపుకు మసాజ్ చేస్తూ, బొడ్డు మీదుగా మసాజ్ చేయవచ్చు. ఈ ప్రక్రియ మొత్తానికి కనీసం రెండు మూడు నిముషాలు కేటాయించటం మంచిది. గర్భధారణ సమయంలో మొదటి త్రైమాసంలో వచ్చే ఉబ్బరం కోసం ఇంచుమించు పది నిమిషాలు ఇలా చేయవచ్చు.
మీరు తల్లి కాబోతుంటే, ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయని సిద్ధంగా ఉండండి. అయితే గ్యాస్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న వస్తువులను తగ్గించడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు. అపానవాయువుకు కారణమయ్యే పదార్థాలను, అంటే పిండి పదార్ధాలను కూడా, తగ్గించినట్లయితే, గర్భధారణ కోసం సమతుల్యమైన ఆహారం కానేరదు.
మొట్టమొదట గర్భధారణ సమయంలో కడుపులో గ్యాస్ ను, ఉబ్బరాన్ని కలిగించే పదార్థాలను నివారించాలి. ఉపశమనం దొరికాక, నివారించబడిన పదార్థాల్లో ఒకొక్కదాన్ని ఒకొక్కసారీ మళ్లీ భోజనానికి కలిపి చూడవచ్చు. అప్పుడు నిజంగా చేటు చేసిన పదార్థం ఏదో కనిపెట్టటం సులభం అవుతుంది. మీరు నిత్యం తినే ఆహారాన్ని ఒక పట్టికలా రాసుకుంటూ ఉండటం, ఏ ఆహారం గ్యాస్ ను కలిగిస్తోందో తెలుసుకోవటానికి సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో రెండవ త్రైమాసికంలో కనిపించే కడుపుబ్బరం సాధారణంగా అసౌకర్యం కలిగిస్తుంది కానీ, అసౌకర్యానికి ఏకైక కారణం ఇదే కాదు. వివిధ రకాల అనారోగ్యాల వల్ల కలిగే ఇబ్బందికి, గ్యాస్ వల్ల కలిగే ఇబ్బందికి తేడా కనిపెట్టగలగటం కష్టం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, బ్రాక్స్‌టన్ హిక్స్ సంకోచాలు, ప్రసవ వేదన కూడా ఇటువంటి లక్షణాలను కనపరచవచ్చు. కొన్ని ఇబ్బందులకు, గర్భానికి అసలు సంబంధం కూడా ఉండకపోవచ్చు. అపెండిసైటిస్, పిత్తాశయంలో రాళ్ళు, ఇరిటెబుల్ బవెల్ సిండ్రోమ్ కొన్ని సాధారణ ఉదాహరణలు. నొప్పి తగ్గకపోయినా, పెరిగినా, తీవ్రమైన వికారం, వాంతులు ఉంటే, విరోచన సమయంలో మీ మలంలో రక్తం కనిపిస్తే, మీ వైద్యుడిని సంప్రదించండి. మీకు ప్రసవ సమయం వచ్చిందని అనుకుంటే, మీ డాక్టర్ ను సంప్రదించాలి.
గర్భిణీ సమయంలో చివరి దశకు చేరుతున్న కొద్దీ, ప్రసవ నొప్పులకు, గ్యాస్ కు తేడా తెలియక అయోమయంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా తెలుసుకోవటానికి ఒక విధానం ఏమిటంటే, మీరు ఎంత బాధ ఎలా పడుతున్నారో గమనించటం. ప్రసవ వేదన అయితే, నొప్పికి, నొప్పికి మధ్య నొప్పి లేని కొంత సమయం ఉంటుంది. ఒకసారి వచ్చిన నొప్పి కంటే తర్వాత వచ్చే నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది, ఇంకా ఇంకా త్వరగా వస్తాయి. అందుకు భిన్నంగా, గ్యాస్ నొప్పి అయితే మనకి అంతు చిక్కని పంథాలో వస్తుంది. గంటలు లేదా రోజులు కూడా కొనసాగవచ్చు. బహిశ్ఠు సమయంలో వచ్చే నొప్పుల లాంటి నొప్పులు వస్తాయి ప్రసవ సమయం దగ్గర పడుతుంటే. గ్యాస్, ఉబ్బరం నొప్పి అయితే, సాధారణ కడుపు నొప్పి లాగా, పోటు పొడుస్తున్నట్టు వస్తూ పోతూ ఉంటుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవాన్ని వేగవంతం చేయడానికి, సురక్షితమైన ప్రసవం జరగడానికి 10 ప్రభావవంతమైన వ్యాయామాలు
ప్రతి ఒక్కరూ వారి జీవితంలో గర్భధారణ సమయంలో తొలి దశలో ఉబ్బరం, గ్యాస్ సమస్యలను అనుభవిస్తారు, కానీ కొంతమంది వ్యక్తులు ఇతరులకన్నా ఎక్కువగా గ్యాస్ తో బాధపడతారు. గ్యాస్ పెరగటం, ఉబ్బరం, శరీరంలో జరిగే ఇతర మార్పులు గర్భధారణ సమయంలో సాధారణం. గ్యాస్ విసుగు కలిగించే విషయం అయినప్పటికీ, అది మీకు లేదా మీ పుట్టబోయే బిడ్డకు హాని కలిగించదు. దానిని నివారించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేసినప్పటికీ, మీ గర్భిణీ సమయమంతా కొంత గ్యాస్ ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటారు.
శుభవార్త ఏమిటంటే, గర్భిణీ తొలిదశ లోనూ, ప్రసవించిన మొదటి కొన్ని రోజులలోనూ ఎదురయ్యే ఉబ్బరం సమస్యకు సురక్షితంగాను, ప్రభావవంతంగాను చికిత్స చేయవచ్చు. గ్యాస్ వల్ల సంభవించినట్లు అనిపించే లక్షణాలను ఎదుర్కొంటుంటే, వాటి గురించి మీ వైద్యునితో మాట్లాడండి. కలుగుతున్న ఇబ్బంది, అసౌకర్యం ఇంకేదో తీవ్రమైన ఆరోగ్య సమస్య వల్ల కాదని, గ్యాస్ వల్లనే ఏర్పడిందని తెలుసుకోవడం ఉత్తమం. ఉత్తమ ఫలితాల కోసం గర్భధారణ సమయంలో ఉబ్బరం నివారణకై టిప్స్ ని పాటించవచ్చు.
Yes
No














Potta ubbaramga vundatam valana food teskolekapothunnanu eam cheyali
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |