


Twins & Triplets
3 November 2023 న నవీకరించబడింది
మీరు కడుపులో కవలలతో 8 వారాల గర్భవతిగా ఉన్నట్లయితే, అల్ట్రాసౌండ్ ద్వారా మీ శిశువులను మీరు ఇప్పటికే చూసి ఉంటారు (లేదా త్వరలో చూస్తారు). మార్నింగ్ సిక్నెస్, ఉబ్బరం, ఫుడ్ క్రేవింగ్స్ లేదా అయిష్టత, అలసట, రొమ్ము లో మార్పులు, తరచుగా మూత్రవిసర్జన మరియు పెరిగిన యోని ఉత్సర్గ వంటివన్నీ సాధారణ గర్భధారణ లక్షణాలు. మీ కవల శిశువులు ఎక్కువ వేగంగా పెరుగుతూ త్వరలో పిండాలు అని పిలవబడతారు . రక్తాన్ని పంప్ చేసే గుండెలు ఇప్పుడు వారిలో ఉన్నాయి మరియు పెరుగుతున్న మెదడు, వెన్నుపాము మరియు ఊపిరితిత్తులు కూడా ఏర్పడుతున్నాయి.
ఒక బిడ్డను కలిగి ఉన్నా లేదా కవలలతో గర్భంతో ఉన్నా ఎనిమిది వారాల గర్భిణికి వికారం మరియు వాంతులు (మార్నింగ్ సిక్‌నెస్ అని కూడా పిలుస్తారు) వంటి గర్భానికి సంబంధించిన లక్షణాలు వారం వారం పెరుగుతుంటాయి. ఈ అనారోగ్యానికి ప్రెగ్నెన్సీ హార్మోన్ హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ (hCG) కారణమయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి అసలు కారణం లేదా కారణాలు అస్పష్టంగానే ఉన్నాయి.
అసౌకర్యం కలిగించే ఈ అనుభూతి, కవలల గర్భధారణ సమయంలో (కానీ సాధారణంగా కాదు) మరింత తీవ్రంగా ఉండవచ్చు. ఇది ఎవరైనా అనుభవించాలి అనుకునే అనుభూతి కాదు. అయినప్పటికీ చాలా మంది కాబోయే తల్లులు తమ గర్భం బాగా అభివృద్ధి చెందుతోందనే దానికి సంకేతంగా చూస్తారు.
మీరు ఈ సమయానికి, మీరు పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా గర్భవతి అని నిర్ధారణను పొంది ఉంటారు మరియు మీరు ఇప్పటికే గర్భం యొక్క సంకేతాలను అనుభవించకపోతే మీరు గర్భధారణ సంబంధిత లక్షణాలను అనుభవించడం ప్రారంభిస్తారు. కానీ మీరు ఎటువంటి ముఖ్యమైన మార్పులను అనుభవించకపోతే చింతించకండి - కొంతమంది మహిళలు ఇతరుల లాగా బలంగా లేదా త్వరగా సైడ్ ఎఫెక్ట్స్ ను అనుభవించకపోవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: కవలలతో కూడిన ప్రెగ్నెన్సీని పొందడం ఎలా
"మార్నింగ్ సిక్‌నెస్" అని మనం తరచుగా పిలిచినప్పటికీ, గర్భిణీ స్త్రీలకు రోజులో ఏ సమయంలోనైనా వికారం అనిపించవచ్చు. ఈ వికారం సాధారణంగా గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో కనిపిస్తుంది. దీనికి తోడు వాంతులు ఉండొచ్చు లేక ఉండకపోవచ్చు. అలాగే ఈ వికారం గర్భంతో ఉన్న కాలం అంతా అనిపించవచ్చు. చాలా వరకు గర్భధారణ హార్మోన్లు HCG (హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్) మరియు ఈస్ట్రోజెన్లు మార్నింగ్ సిక్నెస్ లక్షణాలకు కారణమని చెప్పవచ్చు. మీకు వికారంగా అనిపిస్తున్నట్లయితే, క్రమం తప్పకుండా తక్కువ పరిమాణంలో తినడం మరియు తాగడం చేయండి. అలాగే మీరు నిద్రలేచిన వెంటనే ఏదైనా తినడం మరియు తక్కువ వ్యవధిలో, చప్పగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వంటివి వికారం లక్షణాలను తగ్గించడానికి లేదా నిరోధించడానికి అద్భుతమైన మార్గాలు.
ప్రెగ్నెన్సీ హార్మోన్ ప్రొజెస్టెరాన్ జీర్ణక్రియ మందగించడానికి కారణమవుతుంది, దీని వల్ల మీ గర్భం ఆరంభ మీకు ఉబ్బరంగా అనిపించవచ్చు. గర్భధారణ సమయంలో వికారం ఎక్కువ కావడంలో ఈ ఉబ్బరం కూడా పాత్ర పోషిస్తుంది.
మీరు మీ గర్భధారణ సమయంలో కొన్ని ఆహార పదార్థాలను నియంత్రించలేనంతగా కోరుకోవడం లేదా అస్యహించుకోవడం జరగవచ్చు. ఆహార పదార్థాల విషయంలో ప్రతి స్త్రీ తమ స్వంత ప్రాధాన్యతలు కలిగి ఉంటారు. అందరికి ఒకే ఆహరం ఇష్టం ఉండాలి అన్న నియమం ఏమి ఉండదు.
అలసట అనేది ఒక సాధారణ గర్భధారణ లక్షణం, ముఖ్యంగా గర్భం యొక్క ప్రారంభ దశలలో. హార్మోన్ ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరిగినప్పుడు మీకు అలసటగా అనిపించవచ్చు. కాకపోతే మీరు బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు మీ శరీర అవసరాలను తీర్చడంలో ఇది సహాయపడుతుంది కాబట్టి ఇది ప్రయోజనకరంగా కూడా ఉంటుంది.
హార్మోన్ల పెరుగుదల కారణంగా, మీరు మీ రొమ్ములలో సున్నితత్వం మరియు మృదుత్వం పెరగవచ్చు మరియు గతంతో పోలిస్తే పరిమాణం మరియు దృఢత్వం పెరగవచ్చు. అదనంగా అరోలా అని పిలువబడే మీ చనుమొన చుట్టూ ఉన్న ప్రాంతం యొక్క రంగు ముదురుగా మారవచ్చు.
ప్రెగ్నెన్సీ హార్మోన్లు మరియు మీ శరీరంలో రక్త ప్రవాహం పెరగడం వల్ల మీ గర్భధారణ సమయంలో సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక మీకు కలుగుతుంది. కాబట్టి తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి. మీ గర్భాశయం సాగటం మరియు గట్టిగా ఉండటం వలన మీ మూత్రాశయం మీద కలిగే ఒత్తిడి మూలంగా ఇది మరింత తీవ్రమవుతుంది.
గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరగడం యోని డిశ్చార్జ్ పెరిగేందుకు దారి తీస్తుంది. అయితే ఇది అసాధారణం ఏమి కాదు. కాకపోతే మీకు ఆకుపచ్చ, పసుపు లేదా చిక్కటి జున్ను వంటి డిశ్చార్జ్, దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్ లేదా మీ యోని ప్రాంతం ఎర్రగా, దురదగా లేదా చిరాకుగా ఉంటే, మీరు వెంటనే మీ డాక్టర్ ని సంప్రదించండి. ఈ సంకేతాలు లేదా లక్షణాలు అన్నీ ఇన్ఫెక్షన్ లేదా ఇతర పరిస్థితిని సూచిస్తాయి.
Twing Pregnancy in Telugu, Twin Pregnancy symptoms in telugu, Nausea and vomiting in Twin pregnancy in telugu, 8th week twin pregnancy in telugu, 8th week twin pregnancy symptoms in telugu.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips


డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)