


Scans & Tests
3 November 2023 న నవీకరించబడింది
పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకోవాలని చాలా మంది తల్లిదండ్రులకు ఆశగా ఉంటుంది. అందులో ఒక పద్ధతే అల్ట్రాసౌండ్ స్కాన్. ఇది చాలా మంది తల్లులను ఎక్సైట్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ స్కాన్‌లో వారు తమకు పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకుంటారు. అయితే ప్రెగ్నెంట్ అయి నెల మాత్రమే అయిన వారు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడం కుదరదు. అల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారా బిడ్డను క్లియర్‌గా చూసేందుకు ఆరువారాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది.
ఒక స్త్రీ తన ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకున్న తర్వాత మొదటగా గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తుంది. ప్రారంభ దశల్లో అల్ట్రాసౌండ్ లేదా సోనోగ్రఫీ స్కాన్ చేయించుకోవడం వలన స్త్రీ తన కొత్త దశల గురించి కచ్చితంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ తక్షణ ఫలితాలను, ప్రభావాలను చూపించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్త్రీ గర్భందాల్చిన తొలి ఆరు వారాల తర్వాత వైద్యులు పిండాన్ని స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ దశలో సోనోగ్రఫీ పరీక్ష చేయడం వలన వైద్యులకు ప్రెగ్నెన్సీ గురించి పూర్తి అవగాహన వస్తుంది. అందువల్లే సోనోగ్రఫీ పరీక్ష శిశువుకు సంబంధించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని అర్థం చేసుకోవాలి. నాలుగు వారాల సమయంలో కాకుండా.. మరి కొంత సమయం వేచి ఉంటే ఇంకా స్పష్టంగా వివరాలు తెలుస్తాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.
సోనోగ్రఫీ పరీక్ష 6వ వారం నుంచి 9వ వారం మధ్యలో ఏ సమయంలోనైనా శిశువు పరిస్థితిని గుర్తించడంలో సహాయపడుతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ ఏ గర్భధారణ దశలో ఉన్నారో వెల్లడిస్తుంది. ప్రారంభ ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ స్కాన్‌లో నాలుగు దశలు ఉన్నాయి.
ఈ దశలో అల్ట్రాసౌండ్ స్కాన్ ఫలదీకరణ చెందిన అండంతో గర్భాశయం ఇంటరాక్షన్‌ను చూపుతుంది. నిజానికి రుతు చక్రానికి సమీపంలోని ఏదైనా రోజులో ఇది జరుగుతుంది. ఈ స్కాన్‌లో గర్భాశయ పొర మందంగా అవుతుండటం కూడా కనిపిస్తుంది.
చివరి పీరియడ్ పూర్తయిన ఐదు వారాల తర్వాత ఈ స్కాన్ ఫ్ఫ్లూయిడ్స్ ఉన్న గర్భాశయ లైనింగ్‌ను చూపుతుంది. ఇది గర్భధారణ సంచి అభివృద్ధిని సూచిస్తుంది.
చివరి పీరియడ్ తర్వాత 6వ వారంలో గర్భధారణ సంచి అభివృద్ధి చెందుతుంది. అంతే కాకుండా గర్భధారణ సంచిలో 3mm నుంచి 5mm వరకు ఉండే ఒక పచ్చని సొనను కూడా వైద్యులు గుర్తించ గలరు.
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఆరు వారాల తర్వాత గైనకాలజిస్ట్ సోనోగ్రఫీ పరీక్షలో ఫెటల్ (పిండం) పోల్‌ను గుర్తించగలరు. పిండం పెరుగుదలను సూచించే ప్రారంభ దశలలో ఇది ఒకటి.
గర్భిణులు అందరూ ఒకే ప్రెగ్నెన్సీ టైమ్‌లైన్ ద్వారా ప్రోగ్రెస్ కారని గుర్తించాలి. సాధారణంగా స్త్రీ రుతుచక్రంతో సంబంధం ఉండటం వలన అండం ఫలదీకరణం చెందేందుకు టైమ్‌లైన్ కూడా మారుతూ ఉంటుంది. చివరికి అల్ట్రాసౌండ్ సమయంలో వైద్యుడు ఏ అంశాలను గ్రహిస్తున్నారు.. అనే విషయం కూడా ఆ మార్పులకు లోబడి ఉంటుంది. అందువల్ల పరిస్థితిపై మెరుగైన క్లారిటీ కోసం ట్రాన్స్వాజినాల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ అల్ట్రా సౌండ్ నివేదికను ఎలా చదవాలి
ప్రెగ్నెన్సీ ఏ దశలో ఉన్నా సరే.. గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది మహిళలు గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో గర్భస్రావం ఎదుర్కోవచ్చు. సోనోగ్రఫీ పరీక్ష సమయంలో శిశువు పొడవు 7mm లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, పిండానికి సంబంధించిన సంకేతాలు లభించకపోతే గర్భస్రావం జరిగే ప్రారంభ దశలో సంకేతాలుగా భావించాలి.
Sonography during Pregnancy in telugu, Ultrasound during pregnancy in telugu, result of sonography in telugu, ultrasound scan results in telugu, what is the need of ultra sound in telugu
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)