Get MYLO APP
Install Mylo app Now and unlock new features
💰 Extra 20% OFF on 1st purchase
🥗 Get Diet Chart for your little one
📈 Track your baby’s growth
👩⚕️ Get daily tips
OR
Article Continues below advertisement
Care for Baby
11 August 2023 న నవీకరించబడింది
కొత్తగా పుట్టిన పసిబిడ్డ ఒక జంట జీవితంలోకి రావడం వారి జీవితంలోనే అత్యంత సంతోషకరమైన సమయం అవుతుంది. మీరు ఆ ఆనందంలో మైమరిచి ఉన్నప్పటికీ, పసిబిడ్డ సంరక్షణ గురించి మరోపక్క ఆందోళనలో మిశ్రమ అనుభూతులని పొందుతారు. కానీ, చింతించకండి! పసిపిల్లల సంరక్షణలో మొదటి దశ కోసం, మీకోసం ప్రత్యేకంగా కూర్చిన మా 10 చిట్కాలతో మీరు సాధారణంగా వచ్చే భయాలు, ఇబ్బందులు అన్నీ అధిగమించి, తల్లిదండ్రులుగా మీ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించండి!
పసిపిల్లలకి మొదటి కొన్ని నెలలు చాలా ముఖ్యం. అప్పుడే పుట్టిన పిల్లలు తల్లిదండ్రులపై అన్నిటికీ ఆధారపడతారు కాబట్టి, వారి బాధ్యత పెరుగుతుంది. కొన్ని సరైన పసిపిల్లల సంరక్షణ విధానాలతో, మీరు త్వరగానే పసిపిల్లల సంరక్షణలో పట్టు సాధించవచ్చు. మీరు సరిగ్గా చేయవలసిన 10 విషయాలు ఇవిగో కింద ఇవ్వబడ్డాయి:
మొదటి రోజులలో, పసిపిల్లలు అదేపనిగా మరీ గంటగంటకీ పాలు తాగుతూనే ఉన్నట్లు కన్పిస్తారు! కానీ నెమ్మదిగా, వారు తల్లిపాలని తాగే విధానం స్థిరపడుతుంది, అలాగే మీరు వారికి ఎప్పుడు కావాలంటే, ఎంతసేపు కావాలంటే అంతసేపు పాలు ఇవ్వాల్సి ఉంటుంది. తొందరలోనే కొన్నే కానీ ఎక్కువ సమయం కొనసాగే సెషన్లుగా ఇవి మారతాయి. మీరు ఈ కింది సంకేతాలని ఉపయోగించి వారికి ఆకలిగా ఉందో లేదో కనిపెట్టవచ్చు:
Article continues below advertisment
మీకు ఇది కూడా నచ్చుతుంది: తల్లిపాలు పెంచుకోవడానికి దోహదం చేసే ఆహారపదార్ధాలు ఇవే!
పసిపిల్లలు చాలా సున్నితంగా ఉంటారు, వారి మెడ కండరాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండవు. అందుకని మీరు వారిని సురక్షితంగా, సరిగ్గా ముట్టుకోవాలి, పట్టుకోవాలి లేదా ఎత్తుకోవల్సి ఉంటుంది. మీరు మీ బేబీని ఎత్తుకున్నప్పుడు, వారి తలని మీ భుజంపై వాల్చి, మీ చేయి ఒకటి నెమ్మదిగా వారి మెడ, తల ప్రాంతంపై వేసి ఉంచండి. మీరు పాపాయి తలని మీ ఒక మోచేతి లోపలిభాగంవైపు ఉంచి మరొక చేత్తో వారి అడుగుభాగాన్ని కూడా పట్టుకొని ఎత్తుకోవచ్చు.
ఏడవటం ఒక్కటే పసిపిల్లల సంభాషణా మార్గం. ఒక పసిబిడ్డ సాధారణం కన్నా ఎక్కువ ఏడుస్తున్నాడంటే, అతన్ని పరిశీలించి, తనకి ఎదురవుతున్న అసౌకర్యం ఏదో అర్థం చేసుకోండి. మీ బిడ్డ ఈ కింది వాటికి ఏడవవచ్చు:
పసిపిల్లలకి తరచుగా తాజా డైపరు అవసరమవుతుంది. మీరు మీ బిడ్డని మురికైన లేదా తడి డైపర్లో ఎక్కువసేపు ఉంచకూడదు, దానివలన ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్కు ఉంటుంది. అవును, మలమూత్రాలలో ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకి, న్యాపీ రాష్ లేదా ఆ ప్రాంతంలో చర్మం నొప్పికి దారితీయవచ్చు. మంచి నాణ్యమైన పసిపిల్లల సంరక్షణ ఉత్పత్తులు అంటే గాలి తగిలే డైపర్లు, మెత్తని వైప్స్, జింక్ ఆక్సైడ్-ఆధారిత బేబీ క్రీమ్, అలాగే డైపర్ రాష్ పౌడరు ఇవన్నీ మీ బేబీని డైపర్ రాష్ల నుండి కాపాడగలవు.
అప్పుడే పుట్టిన పసిపిల్లల సంరక్షణ దినచర్యలో రోజూ స్నానం చేయించాల్సిన అవసరం రాదు. మీరు మొదటి వారాలలో జాగ్రత్తగా వారి ముఖం, మెడ, అడుగుభాగాలని శుభ్రపరిస్తే సరిపోతుంది. అప్పుడప్పుడు స్పాంజి స్నానం చేయించవచ్చు. ఒకసారి బొడ్డు తాడు ఊడిపోయి, బొడ్డు ప్రాంతం నయమైపోయాక స్పాంజి నుండి మామూలు స్నానాలకి మార్చవచ్చు.
Article continues below advertisment
పసిపిల్లలకి మసాజ్ చేయటం వలన అనేక లాభాలుంటాయి; అది వారికి విశ్రాంతినిస్తుంది, చిరాకులో ఉన్నప్పుడు ప్రశాంతతనిస్తుంది, వారి పడుకునే విధానాలని మెరుగుపరుస్తుంది, మీకు వారితో బంధం ఏర్పరుచుకునేలా చెస్తుంది. మీరు వారికి పడుకుని లేచాక, శుభ్రపరిచాక లేదా స్నానం చేయించాక 20-30 నిమిషాలు నూనెతో మర్దన చేయవచ్చు. పాపాయిలకి మసాజ్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా, సున్నితంగా మర్దన చేయటం మరిచిపోవద్దు.
మీ పసిబిడ్డకి సౌకర్యవంతమైన బట్టలు అవసరం. హుక్కులు, బటన్లు, లేదా బోలు ఉండే డ్రస్సులకి దూరంగా ఉండండి. అదనంగా, ఫ్యాన్సీ డ్రస్సులు, మెరుస్తున్న బట్టలు, అలాగే మీ బేబీ తలపై నుండి కిందకి జార్చి వేసే లేదా పైకి తీసే టీషర్టులు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. కాటన్ దుస్తులు, జబ్లా డ్రస్సులు లేదా జుబ్బాలు మీ బిడ్డకి మేటి ఆప్షన్లని అనుకోవచ్చు.
కొత్తగా అమ్మానాన్న అయినవారికి తమ బిడ్డలతో బలమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరుచుకోవటానికి చాలా మార్గాలు ఉంటాయి. మొదట్లో బంధం ఏర్పడటానికి, మీరు మూడింటిని ప్రయత్నించవచ్చు: మాట్లాడటం, కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడటం ఇంకా మీ చర్మంతో బిడ్డ చర్మాన్ని తగిలేలా చేసి ఉంచడం. మాట్లాడటం, పాలుపట్టడం, ఎత్తుకోవటం లేదా మీ చేతుల్లో ఉయ్యాలలూపడం, వారి వెన్ను తట్టడం, వారి అవసరాలకి స్పందించటం, వారి మెదడు అభివృద్ధిలో సహాయం చేయడం వంటి చర్యలన్నీ కూడా మీ బిడ్డకి మిమ్మల్ని మరింత సుపరిచితులుగా చేస్తాయి.
కొందరు పసిపిల్లలు ఒకేసారి గంటల తరబడి పడుకుంటే, మరికొందరు కొద్ది కొద్దిసేపు కునుకులు తీస్తూ ఉంటారు. కానీ, మీరు మీ బిడ్డకి 7 నుండి 8వారాల వయస్సు వచ్చినప్పటి నుండి నిర్దిష్టమైన నిద్రవేళ దినచర్యని అలవాటు చేయవచ్చు. మెరుగైన అలాగే రాత్రిపూట ఎక్కువసేపు పడుకునే రోజువారీ అలవాటు చేయటానికి, మీరు ఈ కింది చిట్కాలని పాటించి తీరాలి:
పసిపిల్లల సంరక్షణ ఉత్పత్తులని ఎంచుకునేటప్పుడు, నాణ్యత అలాగే భద్రతా ప్రమాణాలని గమనించండి. రసాయనాలు, కృత్రిమ సువాసనలు లేదా అనవసరమైన అడిటివ్స్ ఉన్న ఉత్పత్తులకి దూరంగా జరిగిపోండి. మేటి పసిపిల్లల సంరక్షణ ఉత్పత్తులే కొనటానికి ఈ కింద ఇవ్వబడిన చెక్ లిస్టుని అనుసరించండి:
Article continues below advertisment
కొత్తగా తల్లిదండ్రులు అయిన వారికి పిల్లలని పెంచటం సవాళ్లతో కూడి ఉండవచ్చు, ఎందుకంటే మీరు మీ పిల్లలకి మేటి సంరక్షణ అలాగే దినచర్యని ఎలా ఇవ్వగలరని అనుక్షణం ఆందోళన పడుతుంటారు. కానీ, గుర్తుంచుకోండి, కొత్తగా పుట్టిన బేబీ సంరక్షణ రోజులు వేగంగానే గడిచిపోతాయి. అందుకని, మేము తల్లిదండ్రులుగా మీ ఈ ప్రయాణం సంతోషకరంగా సాగాలని కోరుకుంటున్నాం!
Baby care tips in telugu, baby care products in telugu, baby care tips for new moms in telugu, 10 Useful Baby Care Tips for New Parents in English, 10 Useful Baby Care Tips for New Parents in Hindi, 10 Useful Baby Care Tips for New Parents in Tamil, 10 Useful Baby Care Tips for New Parents in Bengali.
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
చేతి వేళ్లతో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోవడం ఎలా (How to Do Pregnancy Test with Fingers in Telugu)?
(590 Views)
పసిపిల్లలతో ట్రిప్ కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా (Travelling Suggestions That You Can Keep in Mind While Traveling with Kids in Telugu)?
(20 Views)
బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్: మీరు తెలుసుకోవలసినది (Baby Brain Development: What You Should Know in Telugu)
(447 Views)
(అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) OCD లక్షణాలు ((Obsessive Compulsive Disorder) OCD Symptoms in Telugu)
(199 Views)
ఒక రోజులో రొమ్ము పాలను ఎలా పెంచాలి: కొత్త తల్లుల కోసం ఒక గైడ్ (How to Increase Breast Milk in One Day in Telugu)
(2,304 Views)
గర్భధారణ సమయంలో కొంతమంది మహిళలకు HCG ఇంజెక్షన్ ఎందుకు సిఫార్సు చేస్తారు? (Recommended HCG Injection During Pregnancy in Telugu)
(6,426 Views)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |