Lowest price Ever for Children's Day! Use Code: FIRST10
Sex Life
4 April 2023 న నవీకరించబడింది
నిజం చెప్పాలంటే.. తల్లిదండ్రులుగా మారడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. నూతనంగా తల్లిదండ్రులు కాబోతున్నామని తెలిసిన క్షణంలో ఆ ఆనందం మరింత ఎక్కువగా ఉంటుంది. మీరు గర్భవతి కావాలని ప్రయత్నిస్తూ కాన్సెప్షన్ సెక్స్ (గర్భధారణ సెక్స్) చేసే సమయంలో గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. సాధారణంగా చాలా మంది అడిగే ప్రశ్నలపై మరింత అవగాహనను పెంపొందించుకోవడానికి ఈ FAQలను చదవడం కొనసాగించండి.
మీరు ‘‘ఫర్టైల్ విండో”(ఒవొల్యూషన్ టైమ్) సమయంలో ఉన్నపుడు సెక్స్ చేయడం ద్వారా గర్భందాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విండో మీ అండోత్సర్గానికి ముందు రోజులను కూడా కలిగి ఉంటుంది. అండోత్సర్గం సమయంలో మీ అండాశయాలు ఫెలోపియన్ ట్యూబ్ గుండా ప్రయాణిస్తూ అండాలను విడుదల చేస్తాయి. ఆ అండాలు ఒక రోజు వరకు జీవించే అవకాశం ఉంటుంది.
స్పెర్మ్ అనేది పునరుత్పత్తి మార్గంలో ఒక వారం వరకు జీవించలదు కావున అండోత్సర్గానికి ఒక రోజు ముందు గర్భధారణ కోసం సెక్స్ చేయవచ్చు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. ఐదు రోజుల పాటు జీవించి(ఐదు రోజుల క్రితం స్పెర్మ్) ఉన్న స్పెర్మ్ కూడా అప్పుడే కొన్ని సెకన్ల ముందు విడుదలయిన గుడ్డును ఫలదీకరణం చేసే శక్తిని కలిగి ఉంటుంది.
అది మాత్రమే కాకుండా మీ పీరియడ్ డేట్స్ మరియు మీ ఒవల్యూషన్ (అండోత్సర్గం) తేదీలను ట్రాక్ చేసేందుకు నేడు అనేక అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ప్రకారం మీరు ఫెర్టైల్ విండోలో సెక్స్ చేసేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ట్రాకర్లు ఖచ్చితమైనవి కావు కేవలం అప్రాక్సిమేట్ రిజల్ట్‌ను మాత్రమే అందిస్తాయి.
ఋతుచక్రం అనేది ప్రతి నెలా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొందరికి అండోత్సర్గం అనేది ప్రతి నెలా ఒకే తేదీన జరుగుతుంది. కొందరికి మాత్రం ఇలా జరగదు. అయినప్పటికీ మీకు పీరియడ్ వచ్చిన 14 రోజుల తర్వాత అండోత్సర్గము సంభవిస్తుందని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు.
కొంత మంది వ్యక్తులు అండోత్సర్గం లక్షణాలను కూడా అనుభవిస్తారు. గుడ్డు సొన మాదిరిగా తెల్లగా ఉండే యోని ఉత్సర్గాన్ని మీరు గమనించి ఉండవచ్చు. సాధారణంగ అండోత్సర్గానికి ముందు ఈ లక్షణాలను కొంత మంది తప్పకుండా ఎదుర్కొంటారు. కానీ చాలా మంది మహిళలు తమకు సాధారణంగా జరిగే యోని ఉత్సర్గనే అండోత్సర్గం యొక్క లక్షణమని తప్పుగా భావిస్తారు.
అటువంటి సందర్భాల్లో OPK లేదా ఒవొల్యూషన్ (అండోత్సర్గం) ప్రెడిక్టర్ కలిగి ఉండడం ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ కిట్ లూటినైజింగ్ హార్మోన్ యొక్క అధిక స్థాయిని గుర్తిస్తుంది. మీ అండోత్సర్గముకు ముందు ఈ హార్మోన్ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అందువల్ల ఇది సులభంగా అండోత్సర్గాన్ని గుర్తిస్తుంది. మీ ఫెర్టైల్ విండో ప్రారంభం అయిందని మీకు సూచిస్తుంది. అంతే కాకుండా మీ బేసల్ బాడీ టెంపరేచర్‌ను ట్రాక్ చేయడం వలన కూడా మీరు కొంత వరకు మీ ఫెర్టైల్ విండో ప్రారంభ సమయాన్ని గుర్తించేందుకు సహాయపడుతుంది.
కాన్సెప్షన్ సెక్స్ (గర్భధారణ సెక్స్) ఇన్ని సార్లు మాత్రమే చేయాలనే సంఖ్య ఉండదు. గర్భం దాల్చేందుకు సెక్స్ యొక్క ఫ్రీక్వెన్సీ (ఎన్నిసార్లు చేశారు) కంటే కూడా ఎంత సమయం సెక్స్ చేశారనేది చాలా ముఖ్యం. ఇంకా మీరు ఎన్ని సార్లు సెక్స్‌లో పాల్గొంటే మీ భాగస్వామి గర్భం ధరించే అవకాశాలు అంతలా పెరుగుతాయి.
స్పెర్మ్‌ను కాపాడుకునేందుకు సెక్స్‌కు దూరంగా ఉండాలని అనేక అపోహలు ఉన్నాయి. ఏదేమైనా సెక్స్‌కు దూరంగా ఉండడం వలన మహిళ గర్భం ధరించడం మరింత కష్టమవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. కొద్ది కాలం శృంగారానికి దూరంగా ఉండడం వలన స్పెర్మ్ యొక్క కౌంట్ పెరిగినప్పటికీ అది స్పెర్మ్ చలనశీలతను మాత్రం ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
ఒవొల్యూషన్ (అండోత్సర్గం) సమయంలో గర్భధారణ కోసం సెక్స్ చేయాలని కొంత మంది భావించి, ఫెర్టైల్ విండోలో సెక్స్ చేయడం మర్చిపోతారు. నిజం చెప్పాలంటే.. చాలా మంది తమకు అండోత్సర్గము జరుగుతుందని అనుకుంటారు. కానీ అలా కాదు. అటువంటి సందర్భాల్లో సెక్స్‌కు దూరంగా ఉండడం వలన మీరు గర్భవతి కావడం మరింత కష్టం అవుతుంది.
అందుకోసమే నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారమే నడుచుకోవాలని మీకు మీరు బలవంతం చేసుకోకూడదు. మీకు సౌకర్యంగా మరియు సంతోషంగా అనిపించినన్ని సార్లు సెక్స్ చేసేందుకు మొగ్గు చూపండి. మీ ఒవొల్యూషన్ (అండోత్సర్గం) సమయాన్ని కరెక్టుగా ట్రాక్ చేయడం వలన మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు సెక్స్ చేసేందుకు వీలుంటుంది.
కాన్సెప్షన్ సెక్స్‌ను ఎక్కువ సార్లు చేయడం అనేక సమస్యలకు దారి తీస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వాస్తవానికి రోజులో అనేక సార్లు సెక్స్‌లో పాల్గొనడం వల్ల అది ‘బర్న్అవుట్’కు(లైంగిక కోరికలు తగ్గిపోవడం) దారితీస్తుంది. అలా జరిగినపుడు జంటలు కాన్సెప్షన్ సెక్స్‌ను సాన్నిహిత్యంలా కాకుండా ఒక పనిలా చూస్తారు.
మీరు మీ ఫెర్టైల్ విండో పీరియడ్‌కు చేరుకునే సమయానికి మరోసారి సెక్స్ చేసేందుకు మీరు లేదా మీ భాగస్వామి ఆసక్తిగా లేదా సౌకర్యంగా ఉండకపోవచ్చు. అందువల్ల మీరు ఈ కాలంలో గర్భం దాల్చే అవకాశాన్ని కోల్పోవచ్చు. రెండు లేదా మూడు రోజుల పాటు శృంగారానికి దూరంగా ఉండడం వలన నాణ్యమైన స్పెర్మ్ కౌంట్ మెరుగుపడుతుందని ఈ విషయం మీద నిర్వహించిన అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే కొన్ని రోజుల పాటు సెక్స్ చేయకుండా బ్రేక్ తీసుకోవడం కూడా అవసరం.
ఉదయం పూట సెక్స్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే రాత్రంతా మంచి విశ్రాంతి తర్వాత మీకు శక్తి వస్తుంది. అది మాత్రమే కాకుండా మీరు మరియు మీ భాగస్వామి మంచి సాన్నిహిత్యంతో రోజుని ప్రారంభించవచ్చు. అది రోజంతా మిమ్మల్ని చాలా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.
నిద్రపోతున్నపుడు మగవారి స్పెర్మ్ కౌంట్ రీజెనరేట్ అవుతుంది. వసంత ఋతువులో(మార్చి మధ్య నుంచి జూన్ మధ్య వరకు) ఉత్తమ నాణ్యత గల వీర్యం ఉంటుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అంతే కాకుండా కాన్సెప్షన్ సెక్స్‌కు ఉదయం అనువైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది గైనకాలజిస్టులు సాధారణంగా ఉదయం 7:30లోపు సెక్స్ చేయమని సిఫారసు చేస్తారు.
డీపర్ పెనట్రేషన్ (లోతుగా చొచ్చుకుపోవడం) యొక్క ఏదైనా పొజిషన్లో సెక్స్ చేసినా కూడా గర్భం దాల్చేందుకు గరిష్ట అవకాశాలు ఉంటాయి. కొన్ని ఉత్తమ సెక్స్ పొజిషన్లలో మిషనరీ మరియు వెనక నుంచి సెక్స్ కూడా ఉన్నాయి. మీరు ఏ సెక్స్ పొజిషన్‌ను ఎంచుకున్నా కానీ మీ భాగస్వామి స్కలనం చేసిన వెంటనే మీ గర్భాశయ కెనాల్(సర్వికల్ కెనాల్) లో వీర్యకణాలు ఉంటాయి.
నిజం చెప్పాలంటే మీరు గర్భం దాల్చేందుకు మీకు అసౌకర్యంగా ఉండే సెక్స్ పొజిషన్లను ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఉత్తమ అనుభవం పొందేందుకు ఉత్తమ సెక్స్ పొజిషన్ల గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు ఏ పొజిషన్ చాలా సుఖంగా మరియు సౌకర్యంగా ఉంటుందో వాటి మీద కాన్సంట్రేట్ చేయండి.
తమ భాగస్వామి స్కలనం చేసిన తర్వాత తొడలను పైకి ఎత్తిపెట్టడం వల్ల గర్భం దాల్చుతామని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ నమ్మకానికి ఎటువంటి సాలీడ్ సైంటిఫికల్ ప్రూఫ్ లేదు. కోయిటల్ పొజిషన్(రతి క్రీడలో ఒక పద్ధతి) తో సంబంధం లేకుండా మీ భాగస్వామి స్పెర్మ్ (వీర్యకణాలు) స్ఖలనం తర్వాత ఫెలోపియన్ ట్యూబ్‌కు ప్రయాణిస్తాయి. నిజం చెప్పాలంటే ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. మీ రెప్పపాటులో వీర్యకణాలు ఫెలోపియన్ ట్యూబ్‌కు చేరుకుంటాయి. సెక్స్ చేసిన తర్వాత వీర్యకణాలు లోపలికి వెళ్లే వరకు మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎంచక్కా విశ్రాంతి తీసుకోవచ్చు. వీర్యకణాలు మీరు ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఫెలోపియన్ ట్యూబ్‌కు చేరుకుంటాయి.
మీ సైకిల్ మరియు మీరు సెక్స్ చేసిన సమయాన్ని అనుసరించి (పీరియడ్ తర్వాత ఎన్ని రోజులకు సెక్స్ చేశారనేది) ఆరు నుంచి ఏడురోజులల ఫలదీకరణ ప్రక్రియ ప్రారంభం కావొచ్చు. ఈ సమయంలోనే గుడ్డు(అండం) గర్భాశయంలోకి చేరి లైనింగ్లో అమర్చబడుతుంది. అప్పుడే గర్భధారణ కాలం ప్రారంభం అవుతుంది. మీరు త్వరలోనే గర్భం దాల్చిన భావనను మరియు లక్షణాలను పొందుతారు.
అదే ఇంప్లాంటేషన్ (పిండం గర్భాశయం యొక్క ఎండోమెట్రియల్ ఉపరితలానికి జత చేయబడే ప్రక్రియ) విషయానికి వస్తే అది మీ చివరి సెక్స్ తర్వాత రెండు వారాలకు మొదలవుతుంది. ఇంప్లాంటేషన్ యొక్క కామన్ లక్షణాలలో తిమ్మిర్లు, అంతే కాకుండా తేలికపాటి మచ్చలు కూడా ఉన్నాయి. అయినా కానీ చాలా మంది వ్యక్తులు ఇంప్లాంటేషన్ లక్షణాలను అనుభవించరు. గర్భం దాల్చేందుకు ప్రయత్నించే చాలా మంది వ్యక్తులు ఏడాదిలోపలే తమ లక్ష్యాలను సాధిస్తారు.
లాలాజలం వీర్యాన్ని చంపుతుంది అని చాలా మంది విశ్వసిస్తారు. ఇది ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న ఒక మూఢనమ్మకం. కానీ చాలా లాలాజలం వీర్యం చలనానికి ఆటంకం కలిగిస్తుందని చివరికి వాటి పురోగతిలో తగ్గుదలకు అది దారి తీస్తుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. నేటిరోజుల్లో చాలా మంది జంటలు తక్కువ స్పెర్మ్ కౌంట్ వంటి ఇన్ఫెర్టిలిటీ (వంధ్యత్వం) సమస్యలను ఎదుర్కొంటున్నారు.
మరో విషయం ఏమిటంటే.. ఓరల్ సెక్స్ అనేది మీకు గొప్ప మూడ్‌ని అందిస్తే.. ఎటువంటి రెండో ఆలోచన లేకుండా ఓరల్ సెక్స్ చేయాలి. మీ భాగస్వామి కనుక తక్కువ స్పెర్మ్ కౌంట్‌తో బాధపడుతూ ఉంటే మీరు గర్భం దాల్చేందుకు సహాయం చేయడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. లాలాజలం మరియు నోటి సెక్స్‌కు సంబంధించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా కానీ మీరు ఈ అంశాన్ని విస్మరించొచ్చు. మీ సాధారణ సెక్స్‌ను కొనసాగించవచ్చు
ఉద్వేగం అనేది గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుందని చాలా మంది రీసెర్చర్స్ నమ్ముతారు. ఇది స్పెర్మ్‌ను నేరుగా గర్భాశయంలోకి ప్రవేశింపజేస్తుంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. మీరు ఉద్వేగానికి లోనైన తర్వాత ఆక్సిటోసిన్ సెన్సేషన్ వలన మీకు మరింత రిలాక్స్‌గా అనిపిస్తుంది. అంతే కాదు.. ఉద్వేగం అనేది గర్భం దాల్చేందుకు అతిపెద్ద అవరోధం. ఉద్వేగం అంటే మరేమిటో కాదు ఒత్తిడే.
శృంగారంలో మీరు ఎంత మెరుగ్గా ఉంటే.. గర్భం దాల్చడానికి అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. నిజం చెప్పాలంటే.. పూర్తిగా స్టిములేట్ (ప్రేరణ)(ఫుల్ ఖుష్) అయిన పురుషులు ఇతరుల కంటే 50 శాతం వరకు ఎక్కువగా స్ఖలనం చేయవచ్చు. అందువల్ల మీరు సెక్స్‌లో పాల్గొన్నపుడు మీ భాగస్వామి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తమ సమయం గడిపేందుకు నిర్ణయించుకోండి. అలాంటపుడు మీ భాగస్వామి మీలో మెరుగైన వీర్యాన్ని స్ఖలనం చేస్తారు.
ఫెర్టిలైజ్ (ఎటువంటి పునరుత్పత్తి సమస్య లేని వారు) జంటలు కూడా గర్భవతి కావడానికి కొన్ని కొన్ని సార్లు ఎక్కువ సమయం పడుతుందనే విషయాన్ని మీరు గ్రహించాలి. మీరు 35 సంవత్సరాల కంటే తక్కువగా ఉండి.. పీరియడ్స్ సమస్య మరియు ఇతర ఏ వ్యాధులు లేకుండా ఉంటే మీరు ఒక సంవత్సరం లోపు గర్భవతి కావొచ్చు. బేబీ కోసం ప్రయత్నిస్తున్నపుడు ఒక వ్యక్తి ఎక్కువగా చిరాకు చెందడం సహజం. అందువల్ల గర్భధారణ కోసం సెక్స్ చేస్తున్నపుడు ఎలాగైనా సరే శిశువును కనాలనే లక్ష్యంతో సెక్స్ చేయడం మానేయండి. కానీ మీ భాగస్వామితో సరదాగా ఉంటూ బంధాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టండి. మీరు మీ వైద్యుడిని సంప్రదించకుండానే సంతానోత్పత్తిని పెంచుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మీ బరువు గురించి కూడా మీరు ఆలోచించినట్లయితే మీరు తినే విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. మీ ఒత్తిడి స్థాయిలను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించండి. అంతే కాకుండా మీ శరీరం మీద దుష్ప్రభావాలు చూపే హానికర టాక్సిన్స్ (విష పదార్థాలు) కు దూరంగా ఉండండి.
జంటలు తమ సంతానోత్పత్తి వైద్యుడిని(ఫెర్టిలిటీ డాక్టర్) కలిసే ముందు ఒక సంవత్సరం వేచి ఉండాలి. ఏదేమైనా అపాయింట్మెంట్ త్వరగా బుక్ చేసుకోవడం ఉత్తమం. గర్భం దాల్చేందుకు సాధారణంగా ప్రయత్నించిన ఆరునెలల తర్వాత ఫెర్టిలిటీ డాక్టర్‌ను కలవాలని చాలా మంది నిపుణులు చెబుతారు. మరీ ముఖ్యంగా మీకు 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంటే.. మీకు 35 సంవత్సరాల వయసు లేకపోయినా కానీ క్రమరహిత పీరియడ్స్, STIs, ఎండోమెట్రియాసిస్ వంటి ఇతర అనారోగ్యాల చరిత్రను కలిగి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని అనుకోవచ్చు. అప్పుడు మీకు డాక్టర్ గర్భవతి అయ్యేందుకు వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణలో ఆలస్యంగా గర్భం దాల్చడం : కారణాలు మరియు లక్షణాలు
గర్భం ధరించేందుకు చూసే చాలా మంది జంటలు తమ జనరల్ హెల్త్ కంటే ఎక్కువగా పునరుత్పత్తి ఆరోగ్యంపైనే ఎక్కువ దృష్టి పెడతారు. వాస్తవానికి ఈ జంటలు గర్భాశయ శ్లేష్మం(సర్వికల్ మ్యూకస్), వీర్య కణాల లెక్క (స్పెర్మ్ కౌంట్) లేదా అసౌకర్యంగా సెక్స్ చేసిన ఘటనల గురించి మాత్రమే బాధపడతారు. బరువు, ఒత్తిడి, మందులు వంటి ఇతర కారణాలు మీ సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. సాధారణంగా మ ఈ మొత్తం ఆరోగ్యంపై దృష్టి సారించడం మంచిది.
శిశువు కోసం ప్రయత్నిస్తున్నపుడు మీ మరియు మీ భాగస్వామి యొక్క పునరుత్పత్తి ఆరోగ్యం గురించి సరిచూసుకోవడం ఉత్తమం. ఈ సమస్య గురించి మీరు మరింత లోతుగా ఈ సమస్య గురించి తెలుసుకోవాలని అనుకుంటే.. మీ కుటుంబంలో సంతానోత్పత్తి సమస్యల యొక్క మునుపటి చరిత్రను కూడా చర్చించాలి. సాధారణంగా చాలా మంది మహిళలు గర్భం దాల్చడానికి ముందు ఫోలేట్ అధికంగా ఉండే ప్రినేటల్ విటమిన్లు తీసుకోవడం లేదా తినే ఆహారంలో మార్పులు చేయడం వంటివి చేస్తారు. పిండానికి హాని కలిగించే ప్రమాదాన్ని నివారించేందుకు మీరు ధూమపానాన్ని, మద్యపానాన్ని పూర్తిగా వదిలేయాలని కూడా అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా మీరు ఇంకా గర్భం ధరించడంలో సమస్యలను ఎదుర్కుంటూ ఉంటే.. మీరు వైద్యుడిని సంప్రదించాలని అనుకోవచ్చు. గర్భం దాల్చేందుకు సరోగసీ, IVF, IUI వంటి ఎన్నో ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: IUI (ఇంట్రా యుటెరైన్ ఇన్ సెమినేషన్) పిల్లలు సాధారణంగా ఉంటారా?
ఆరోగ్యం మరియు గర్భధారణ సెక్స్ గురించి మీకు ఉన్న సందేహాలు తీరిపోయాయని మేము విశ్వసిస్తున్నాం. పైన పేర్కొన్న ప్రశ్నలతో మీకు సంబంధం ఉంటే.. అందుకు తదనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి. మీ బిడ్డ రాక కోసం అంతా సిద్ధం చేసుకోండి. అయినా గర్భం ధరించాలని చూసే ముందు ఫుల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం ఉత్తమం. మీకు పైన పేర్కొన్న ప్రశ్నలతో అసలు సంబంధమనే లేని సమస్యలు ఉంటే (ప్రశ్నలు మీ మెదడుని తొలుస్తుంటే) మీరు మీ స్పెషలిస్ట్‌లతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సాధారణంగా గర్భం ధరించేందుకు ఎటువంటి ఒత్తిడి లేకుండా సెక్స్‌లో పాల్గొనడం మంచిది. మీ భాగస్వామితో మాట్లాడడం ద్వారా లేదా పోర్ ప్లే (సంభోగానికి ముందు చేసేది) చేయడం ద్వారా మీ మూడ్‌ని సెట్ చేసుకోండి.
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
గర్భధారణ సమయంలో పిండం పెరుగుదల మరియు అభివృద్ధి
గర్భధారణలో బరువు తగ్గడం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి?
గర్భధారణ సమయంలో హైడ్రోక్సీప్రొజెస్టెరోన్ ఇంజెక్షన్: మీరు తెలుసుకోవలసిన విషయాలేంటి?
గర్భధారణ సమయంలో UTIలను ఎలా ఎదుర్కోవాలి: నివారణ, చికిత్సలు మరియు చిట్కాలు
గర్భిణీ స్త్రీ ఫోలిక్ యాసిడ్ ఎప్పుడు తీసుకోవాలి?
గర్భధారణ సమయంలో సపోటా తినడం సురక్షితమేనా?
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |