
పిల్లలు బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు. వారు తరచూ చిన్న చిన్న వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కొంత మంది పిల్లల్లో కొన్ని రకాలైన జన్యుపరమైన వ్యాధులు కూడా సాధారణమే. అలాంటి ఒక వ్యాధే కవాసాకి వ్యాధి (ధమనుల వాపు). ఈ వ్యాధి వల్ల చిన్న పిల్లల ధమనుల్లో వాపు వస్తుంది. ఇటువంటపుడు వారు జ్వరం మరియు కవాసాకి దద్దుర్లతో బాధపడతారు. ఈ వ్యాధి వస్తే ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది సాధారణంగా ఏర్పడేదే. కొన్ని రోజులు వైద్య పర్యవేక్షణలో ఉంటే తగ్గిపోతుంది.
ఒకవేళ కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) నిర్దారణ అయి పిల్లలు బాధపడుతుంటే.. ఆ వ్యాధిబారి నుంచి పిల్లల్ని త్వరగా బయటపడేసేందుకు అసలు కవాసాకి వ్యాధి(ధమనుల వాపు) అంటే ఏమిటో ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వైద్య పరిభాషలో కవాసాకి వ్యాధి లేదా కవాసాకి సిండ్రోమ్‌ను మ్యూకోక్యుటేనియస్ లింఫ్ నోడ్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇది పిల్లల్లో ఉండే చిన్న మరియు మీడియం సైజు ఉండే రక్తనాళాల్లో వాపును కలుగజేస్తుంది.
అంతే కాక ఇది కరోనరీ ధమనుల్లో మంటకు కారణం అవుతుంది. గుండెకు ఆక్సిజన్‌తో నిండిన రక్తాన్ని ధమనులు తీసుకెళ్తాయి. ఇది గ్రంథులు మరియు శ్లేష్మపొరల్లో కూడా వాపుకు దారి తీస్తుంది.
కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) లక్షణాలు కొన్ని ఇలా ఉన్నాయి -
కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) వచ్చేందుకు నిర్ధిష్ట కారణాలేంటో ఇంకా ఎవరికీ సరైన అవగాహన లేదు. అయితే కొన్ని కారకాలు ఈ వ్యాధి రావడానికి కారణమని భావిస్తారు. ఈ కింది కొన్ని కారణాల వల్ల కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) వస్తుంది.
1. వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
దద్దుర్ల వలన ఏర్పడే కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) వంటి కొన్ని కవాసాకి లక్షణాలు వైరస్లు లేదా బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను పోలి ఉంటాయి. అయితే వైరస్ లేదా బ్యాక్టీరియా దీనికి కారణమా? కాదా? అనేది ఇంకా నిర్దారించబడలేదు.
2. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ (రోగనిరోధక వ్యవస్థలో లోపం)
ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కూడా కవాసాకి వ్యాధి (ధమనుల వాపు)కి కారణం కావొచ్చు. ఈ స్థితిలో శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ పాతోజెన్ (వ్యాధి కారకం)గా మారుతుంది. మరియు ఆరోగ్యకరమైన కణజాలాల మీద దాడి చేసి ఈ వ్యాధికి కారణం అవుతుంది.
3. జన్యువులు
ఎవరైతే తల్లిదండ్రులకు కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) ఉంటుందో వారి పిల్లలకు కూడా ఈ వ్యాధి జన్యువుల ద్వారా సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది.
కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) నిర్దారణ అనేది పిల్లలలో కనిపించే కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. గుండె మరియు రక్తం పనితీరును గమనించేందుకు కొన్ని సాధారణ టెస్టులు చేస్తారు. అవి
కవాసాకి వ్యాధి (ధమనుల వాపు)కి నోటి ద్వారా తీసుకునే కొన్ని మందులను ఉపయోగించి చికిత్స చేస్తారు. అవి-
ఒక వేళ ఈ మందులు ఎటువంటి ప్రభావం చూపకపోతే.. మూసుకుపోయిన ధమనిని తెరిచేందుకు కరోనరీ ఆర్టరీ ఆంజియోప్లాస్టీ అని పిలువబడే శస్త్రచికిత్సను చేస్తారు. అంతే కాకుండా భవిష్యత్‌లో మళ్లీ ధమని గోడ మూసుకుపోకుండా ఉండేందుకు ఒక స్టెంట్ కూడా ఉంచబడుతుంది.
కవాసాకి వ్యాధి (ధమనుల వాపు)కి సరైన విధంగా చికిత్స చేయకపోతే అది అనూరిజం వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అంతే కాకుండా ఇది పిల్లలలో గుండెపోటు లేదా అంతర్ఘత రక్తస్రావం వంటి ప్రమాదాలను పెంచుతుంది. దీని వల్ల వచ్చే ఇతర సమస్యలు
కవాసాకి సిండ్రోమ్ లేదా కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) ప్రధానంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. అబ్బాయిలకు ఈ వ్యాధి నిర్దారణ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆసియన్ లేదా పసిఫిక్ ప్రాంతాలకు చెందిన వారి పిల్లలకు కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) లక్షణాలు ఏవైనా సరే వారి పిల్లలలో కనిపించిన వెంటనే తల్లిదండ్రులు సాధారణ వైద్యుడు లేదా GP (జనరల్ ప్రాక్టీషనర్)ని కలవాలి. పిల్లల్లో జ్వరం తగ్గకుండా అలాగే ఉంటే మరియు పిల్లల చర్మంపై ఎర్రటి దద్దుర్లను తల్లిదండ్రులు గమనిస్తే ఇక ఏ మాత్రం సమయం వృథా చేయకుండా వైద్యుడిని కలవాలి. పిల్లలలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకుండా నివారించేందుకు కవాసాకి వ్యాధికి (ధమనుల వాపు) వెంటనే చికిత్స చేయాలి. సరైన చికిత్స పొందిన పిల్లలు ఆరు నుంచి ఎనిమిది వారాల్లో ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటారు. కాబట్టి కవాసాకి వ్యాధి (ధమనుల వాపు) దాని లక్షణాలకు సంబంధించిన ఈ విషయాల గురించి తల్లిదండ్రులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మరియు పైన పేర్కొన్న లక్షణాలలో ఏవైనా లక్షణాలు వారి పిల్లలలో కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స అందించాలి.
Yes
No



















Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |