hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • ఉల్లిపాయ నూనెతో సహజమైన జుట్టు సంరక్షణ విధానాన్ని రూపొందించడానికి, తద్వారా మీ జుట్టుకు మెరుపును జోడించడానికి 3 సూత్రాలు arrow

In this Article

    ఉల్లిపాయ నూనెతో సహజమైన జుట్టు సంరక్షణ విధానాన్ని  రూపొందించడానికి, తద్వారా మీ జుట్టుకు మెరుపును జోడించడానికి 3 సూత్రాలు

    Pregnancy

    ఉల్లిపాయ నూనెతో సహజమైన జుట్టు సంరక్షణ విధానాన్ని రూపొందించడానికి, తద్వారా మీ జుట్టుకు మెరుపును జోడించడానికి 3 సూత్రాలు

    3 November 2023 న నవీకరించబడింది

    ]\===]జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారా? లేదా మీ జుట్టు నిస్తేజంగా లేదా చిక్కులతో ఉండటాన్ని చూసి మీరు అలసిపోయారా? వివిధ కారణాల వల్ల మీరు అనేక జుట్టు మరియు స్కాల్ప్ సమస్యలను ఎదుర్కోవడం చాలా సాధారణం. అయితే మీరు ఖచ్చితంగా ఇకపై చింతించాల్సిన అవసరం లేదు. జుట్టు పెరుగుదల లేదా ఇతర స్కాల్ప్ సమస్యలను పరిష్కరించడంలో ఉల్లిపాయ జుట్టు సంరక్షణ నూనె.. అనూహ్యంగా ప్రయోజనకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. వాస్తవానికి నూనెలో ఉండే పోషకాలు మీ హెయిర్ ఫోలికల్స్‌ను బలంగా చేస్తాయి. తద్వారా మెరుపు, జుట్టుకు మెరుగైన బలాన్ని అందించడమే కాకుండా మొత్తం జుట్టు వాల్యూమ్‌ను పెంచుతుంది.

    ఉల్లిపాయ నూనె మీ జుట్టుకు ఎందుకు ప్రయోజనకారిగా మారుతుంది?

    ఉల్లిపాయ నూనె యొక్క అత్యంత ఉత్తేజకరమైన అంశం ఏమిటంటే.. జుట్టు చిట్లకుండా, జుట్టు పల్చబడడాన్ని నిరోధించే పోషకాహారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఉల్లిపాయ నూనెతో మీ జుట్టును కండిషనింగ్ చేయడం కూడా కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు సంరక్షణ కోసం ఉల్లిపాయ నూనెను ప్రయోజనకరంగా ఉంటుందని పరిగణించడానికి కారణం ఉల్లిపాయలో సల్ఫర్ ఖనిజం ఉండటమే. ఇది శరీరంలోని వివిధ ప్రోటీన్లు, ఎంజైమ్‌ల ఉత్పత్తి ప్రక్రియకు చాలా ముఖ్యమైనది. మీ జుట్టు యొక్క భాగాలు కెరాటిన్‌తో రూపొందించబడ్డాయి. అంతే కాకుండా కెరాటిన్‌లో సల్ఫర్‌ను కూడా కనుగొనవచ్చు. మీ జుట్టు పెరగడానికి చాలా పోషణ అవసరం కాబట్టి, సల్ఫర్ అందుకు అవసరమైన పోషణను అందిస్తుంది. అంతేకాకుండా ఇది మీ జుట్టు పెరుగుదల దశను విస్తరిస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ నూనెలో ఉన్న మరొక అంశం ఏమిటంటే.. ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. ఇది వివిధ స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. /ఉల్లిపాయ నూనెలో అవసరమైన యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా నిరోధించగలవు. మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడితే.. అవి వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు దోహదం చేస్తాయి. ఉదాహరణకు ఈ ఫ్రీ రాడికల్స్ హెయిర్ ఫోలికల్స్‌కు హాని కలిగించడం ద్వారా మీ జుట్టు విపరీతంగా సన్నబడటానికి కారణం అయ్యే ప్రమాదం ఉంది.

    3 దశల్లో ఇంట్లో ఉల్లిపాయ నూనె తయారీ విధానం

    మీరు స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌లు లేదా ఇతర జుట్టు సమస్యలతో బాధపడుతుంటే.. ఉల్లిపాయ హెయిర్ ఆయిల్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది! ఉదాహరణకు ఉల్లిపాయ మీ జుట్టు పోగులను వేరు నుండి పోషించడంలో సహాయపడుతుంది. తద్వారా చిక్కుబడిన జుట్టు, పొడి జుట్టుతో పాటు జుట్టు దెబ్బతినడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. నిజానికి ఈ నూనెను ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు ఇంట్లో స్వంతంగా ఉల్లిపాయ నూనెను తయారు ]చేసు\కోవాలనుకుంటున్నారా? అయితే క్రింద ఇవ్వబడిన 3-దశల ఉల్లిపాయ నూనె రెసిపీని చదివేయండి.

    1. కొన్ని ఉల్లిపాయలను తీసుకొని వాటిని ఎక్స్‌ట్రాక్టర్‌లో వేసి రుబ్బుకోవాలి. అలా చేస్తే చివరికి మీరు ఉల్లిపాయ రసం పొందగలుగుతారు. మిగిలిపోయిన ఉల్లిపాయలతో, ఉల్లిపాయల పేస్ట్‌‌ను‌ చేయండి.

    2. ఒక గిన్నెలో నువ్వుల నూనెతో పాటు కొబ్బరినూనె కలపాలి. ఆ మిశ్రమంలో మీ ఉల్లిపాయ పేస్ట్ మరియు ఉల్లిపాయ రసం జోడించండి. గిన్నెలోని ఉన్న వాటిని బాగా కలపండి.

    3. గిన్నెలో మిశ్రమం బాగా ఉడికే వరకు స్టవ్ మీద సన్నని మంటపై వేడిచేయ్యండి. గిన్నెలోని మిశ్రమాలను తరచుగా కలపండి. మిశ్రమం ఉడికిన తర్వాత గ్యాస్‌ను ఆపివేసి, మిశ్రమాన్ని ఒక గుడ్డతో వడకట్టండి. మీ తాజా ఉల్లిపాయ నూనె ఇప్పుడు సిద్ధంగా ఉంది! గాలి చొరబడని వస్తువులో నూనెను భద్రపరచుకోండి.

    ఉల్లిపాయ నూనె వాడటం మొదలుపెట్టినప్పుడు, స్పష్టమైన ఫలితాన్ని చూడటానికి మీరు ప్రతిరోజూ దీన్ని ఉప్రయోగించవచ్చు. ఉల్లిపాయ నూనెను అప్లై చేసిన తర్వాత.. మీ జుట్టుపై అరగంట పాటు ఉంచండి. ఆ తర్వాత మీరు తేలికపాటి కండీషనర్ లేదా షాంపూతో శుభ్రం చేసుకోవచ్చు. ఉల్లిపాయ నూనెతో మీరు ప్రారంభించే ఏ కొత్త చికిత్సలో నైనా ఫలితం చూడటానికి మీరు దీన్ని క్రమంగా ఉపయోగించాలి.

    ఇది కూడా మీకు నచ్చుతుంది: ఉల్లిపాయ హెయిర్ సీరమ్‌ను ఎంత తరచుగా ఉపయోగించవచ్చు?

    ఉల్లిపాయ నూనెతో ఎటువంటి ఫలితాలు కనిపించకపోతే ఏమి చేయాలి?

    మీరు చాలా కాలంగా ఉల్లిపాయ నూనెను ఉపయోగించినా మీకు స్పష్టమైన ఫలితాలు కనిపించకపోతే.. మీరు మీ వైద్యుడిని సంప్రదించాల్సిన సమయం వచ్చిందని అర్థం. మీ సమస్యకు అనేక కారణాలు ఉండొచ్చు. మీ జుట్టు కోసం ఓవర్-ది-కౌంటర్ మందులు అవసరం కావచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల లేదా వారి జీవనశైలి వల్ల చాలా మందికి జుట్టు రాలిపోతుంటుంది. మీ హెయిర్‌కేర్ ప్రొవైడర్ మీ జుట్టు సమస్యలను రివర్స్ చేయడానికి మీరు తీసుకోవలసిన తదుపరి చర్యలను మీకు తెలియజేస్తారు. మీరు మంచి నాణ్యమైన ఆనియన్ ఆయిల్ హెయిర్ కేర్ కిట్‌ని కొనుగోలు చేయడాన్ని కూడా పరిగణించవచ్చు.

    మీరు మీ జుట్టుకు ఉల్లిపాయ నూనెను అప్లై చేసినప్పుడు.. మీ జుట్టు చాలా అసహ్యకరమైన వాసన వస్తుంది. కాకపోతే ఎక్కువ సేపు ఉండదు. సాధారణంగా జుట్టు శుభ్రం చేసుకున్నాక వెళ్ళిపోతుంది. ఉల్లిపాయ నూనెను రాసేటప్పుడు, మీ తలపై ఎక్కువ ఉండకుండా చూసుకోండి. ఇది విపరీతమైన జుట్టు రాలడం, పొడిబారడంతో పాటు దురదకు దారితీస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ నూనె జుట్టు సంరక్షణ కాంబో ఆఫర్‌ల క్రింద అనేక ఉత్పత్తులు లభిస్తున్నాయి.

    ముగింపు

    ఉల్లిపాయ నూనె సహాయంతో జుట్టు సంరక్షణ దినచర్యను ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఈరోజే దీనిని ప్రయత్నించి చూడండి. మీరు ఉత్తమ ఫలితాలను చూడడానికి కనీసం మూడు నెలలు పట్టవచ్చు. కాకపోతే వేచి ఉండటం కూడా విలువైనదే. మీరు ఇప్పటికే వైద్యం అవసరమయ్యే జుట్టు సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఆనియన్ ఆయిల్ హెయిర్ ట్రీట్‌మెంట్‌ను ప్రారంభించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.