hamburgerIcon

Orders

login

Profile

STORE
Preg & NewSkin CareHair CareBaby CareDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Diet & Nutrition arrow
  • ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu arrow

In this Article

    ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

    Diet & Nutrition

    ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

    3 November 2023 న నవీకరించబడింది

    బేబీ ఫుడ్ చార్ట్ అనేది కొత్తగా తల్లులైన వారికి మొదటి కొన్ని నెలలు వారి బిడ్డలకు మంచి పోషకాహారం అందించే విషయంలో సహాయపడే ఎంతో ఉపయోగకరమైన గైడ్. పిల్లల ఎదిగే ఈ కీలకమైన సమయంలో, కొత్తగా తల్లైన వారితో లేదా సంరక్షకులతో శిశువుని ఆహారం విషయంలో అనుసంధానించేందుకు ఈ బేబీ డైట్ ప్లాన్ సరైన సాధనం.

    శిశువుకు ఎంత ఆహారం ఇవ్వాలి? (How Much Should A Baby Be Fed in Telugu)

    శిశువుల కోసం సిఫార్సు చేయబడిన లేక నిర్ణీతమైన డైట్ ప్లాన్‌లు ఉన్నాయి. అయితే అసలు ఎలాంటి ఆహారం ఎంత పాళ్లలో అందించాలో నిర్ణయించే విషయంలో, అది పిల్లల సంరక్షకుల ఇష్టానుసారంగా ఉండనివ్వాలి. ఇది బరువు పెరిగేందుకు, ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మరియు శోషణ క్రియ వంటి పలురకాల అంశాలపై ఆధారపడి ఇవ్వవలసి ఉంటుంది. అందుకే బేబీ డైట్ చార్ట్‌లు ఒక్కొక్క శిశువు అవసరానికి తగ్గట్టుగా ఒక్కోరకంగా మారుతూ ఉంటాయి. కానీ పిల్లల సంరక్షకులు తమ బిడ్డల ఆకలిని పసిగట్టే తమదైన పద్దతులు తెలుసుకొని ఉంటారని మనం అనుకోవచ్చు.

    శిశువులకు సూచించే ఆహారాలు| 6 నుండి 9 నెలల వయస్సు వరకు (Meal Ideas for Baby | 6 to 9 Months Old in Telugu)

    6 నుండి 9 నెలల మధ్య ఉన్న శిశువుల కోసం ఒక నమూనా డైట్ చార్ట్ కింది విధంగా ఉంటుంది

    1. తెల్లవారుజామున, ఇంకా ఉదయపు ఆహారంగా తల్లి పాలు లేదా ఫార్ములా పాలు.

    2. దీని తర్వాత మధ్యాహ్నం అల్పాహారం కోసం తల్లి పాలు లేదా ( ఫార్ములా ) తల్లి పాలకు ప్రత్యామ్నాయంగా శిశువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాల పొడితో చేసిన పాలను పట్టించవచ్చు.

    3. మధ్యాహ్నపు ఆహారంగా, ఉడకబెట్టిన కూరగాయలు మెదిపి లేదా చక్కగా ఉడకబెట్టిన గుడ్లను చిన్న ముక్కలుగా మెదిపి తల్లి పాలతో లేదా ఫార్ములా పాలతో చేర్చి తినిపించవచ్చు.

    4. రాత్రి ఆహారం కోసం పైన చెప్పిన వాటినే మరలా చేసి తినిపించవచ్చు.

    5. నిద్రించే ముందు బిడ్డ ఆకలితో ఉన్నట్లయితే, తల్లి పాలు లేదా ఫార్ములా పాలు మళ్లీ పట్టవచ్చు

    శిశువులకు సూచించే ఆహారాలు | 9 నుండి 12 నెలల వయసున్న వారి కోసం (Meal Ideas for Baby | 9 to 12 Months Old in Telugu)

    9 నుండి 12 నెలల మధ్య ఉన్నబేబీ డైట్ చార్ట్ ఈ విధానాన్ని అనుసరించవచ్చు-

    1. అల్పాహారం కోసం, హోమోజినైజ్డ్ హోల్ మిల్క్ (పరిపూర్ణ పాలను) తల్లి పాలు లేదా ఫార్ములా పాలకి చేర్చవచ్చు.

    2. దీని తర్వాత ఫార్ములా పాలు లేదా తల్లి పాలతో పాటు అల్పాహారం కోసం శిశువుకి తృణధాన్యాలు ఇంకా మెత్తని పండ్లను తినిపించవచ్చు.

    3. మధ్యాహ్న భోజన సమయానికి ముందు శిశువు ఆకలితో ఉన్నట్లయితే, చపాతీ లేదా తురిమిన యాపిల్స్ ముక్కలను తినిపించవచ్చు.

    4. మధ్యాహ్న ఆహారం కోసం, బాగా వండిన అన్నం ఇంకా చాలా చిన్న చికెన్‌ ముక్కలని తల్లి పాలు లేదా ఫార్ములా పాలతో చేర్చవచ్చు. రాత్రి భోజనం కోసం మధ్యాహ్న ఆహారంలో పెట్టిన వాటినే మళ్ళీ చేసి తినిపించవచ్చు.

    శిశు ఆహార చార్ట్‌లో కరకరలాడే పెలుసుగా ఉన్న బిస్కెట్ల లాంటివి లేదా చిన్న చీజ్ ముక్కలను స్నాక్స్‌గా చేర్చడం మొదలుపెట్టండి.

    పిల్లల కోసం ఆరోగ్యకరమైన డైట్ చార్ట్ | 2 నుండి 5 సంవత్సరాల వయస్సు (Healthy Diet Chart for Kids | 2 to 5 Years Old in Telugu)

    బేబీ డైట్ ప్లాన్ వలె, 2 నుండి 5 సంవత్సరాల పిల్లలకు ఆరోగ్యకరమైన డైట్ చార్ట్ తెలిసి ఉండటం కూడా అంతే ముఖ్యం. పోషకాహారాలను తెలుసుకొనేందుకు ఒక నమూనా డైట్ ప్లాన్ క్రింద ఇవ్వబడింది -

    ఉదయం

    తేనె ఇంకా ఎండిన పండ్లతో చేర్చిన పాలు

    ఉదయపు అల్పాహారం

    రవ్వ ఉప్మా లేదా పోహా

    ఉదయపు స్నాక్‌

    ఒక పండుతో పాటు సూప్

    మధ్యాహ్న భోజనం

    పప్పు ఇంకా గుడ్లతో లేదా చికెన్/చేపలతో అన్నం

    సాయంత్రపు స్నాక్‌

    శాండ్‌విచ్‌లు

    రాతి భోజనం

    పప్పు లేదా చికెన్‌తో తేలికపాటి పరాటా లేదా చపాతీ

    పిల్లలకు తినిపించేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యాంశాలు (Key Points While Feeding Babies in Telugu)

    డైట్ చార్ట్ అనేది పిల్లల ఎదుగుదలకి తగిన పోషకాహారాన్ని పిల్లలకి అందిచేందుకు ఉపయోగపడే సమాచారాన్ని ఇస్తుంది. కానీ తప్పనిసరిగా శిశు డైట్ చార్ట్‌ని అనుసరించడమే కాకుండా గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యవిషయాలు కూడా ఉన్నాయి. శిశు సంరక్షకులు ఈ క్రింది ముఖ్య అంశాలను గుర్తుంచుకోవాలి:

    1. ఫార్ములా పాలు లేదా తల్లి పాలను ఉపయోగించడం కొనసాగించాలి (Continue to use formula or breast milk)

    తల్లిపాలను అవసరానికి అనుగుణంగా కొనసాగించాలి. తల్లిపాలు లేదా ఫార్ములా పాలు పట్టే సమయాల మధ్యలో శిశువుల ఆహార ప్రణాళికలో ఘనపదార్థ ఆహారాన్ని కూడా అలవాటు చేయడం మొదలుపెట్టాలి.

    2. అవసరమైనంత మేరకు శిశువుకు ఆహారం అందివ్వాలి (Feed the infant as needed)

    రెండుసార్లు లేదా మూడుసార్లు ఆహారం ఇవ్వడంతో మొదలుపెట్టి క్రమంగా రోజుకు 3 నుండి 5 సార్లు వరకు పెంచుకుంటూ వెళ్ళాలి.

    3. విటమిన్ డి సప్లిమెంట్లను ఇవ్వడం అవసరమని గుర్తుంచుకోవాలి (Consider Vitamin D supplements)

    అవసరమైతే విటమిన్ డి చుక్కలను ఫార్ములా పాలు లేదా తల్లి పాలలో చేర్చవచ్చు.

    4. శిశువు తినే సరళిలో వైవిధ్యాలను గమనించవచ్చని భావించాలి (Expect variations in the infant's eating patterns)

    చేపలు మరియు మాంసం లేదా గుడ్లు వంటి ఇనుము కలిగి ఉన్న ఆహారాలు పాలు పట్టిన తర్వాత తినిపించే మొదటి పదార్థాలై ఉండాలి. కూరగాయలు, పెరుగు లేదా జున్ను వీటి తరువాత తినిపించడం మొదలుపెట్టవచ్చు. వేరు వేరు ఆహార పదార్థాలను పరిచయం చేయడం అనేది 9 నెలలకు లోపే చేయాలి.

    5. శిశువు ప్రవర్తించే తీరుపై, ఇంకా మీపై మీకు నమ్మకం కలిగి ఉండాలి (Trust self and baby's instincts)

    శిశువులకు కొద్ది మొత్తంలో ఆహారం ఇవ్వాలి అయితే శిశువు కోరుకున్నప్పుడు మాత్రమే కాస్త ఎక్కువగా పెట్టొచ్చు. చిదిమి మెత్తగా లేదా చిన్న ముక్కలుగా చేసిన పదార్థాలు మాత్రమే బేబీ డైట్ చార్ట్‌కు అనువైనవి.

    నవజాత శిశువుకు మీరు తినిపించే ప్రతిసారీ వారికి మీతో అనుబంధం బలపడుతుందని తెలుసుకోవాలి

    వెక్కిళ్ళు లేదా వాంతులు కాకుండ ఉండేందుకు శిశువు తినిపించేటప్పుడు లేదా ఆహారం అందిస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించడం ఎంతో అవసరం.

    6. తిండి పదార్థాలను తరచుగా మార్చకుండా అలాగే కొనసాగించాలి(Keep feedings consistent)

    పిల్లల సంరక్షకులు ఒకేసారి అన్నీ రకాల కొత్త ఆహార పదార్థాలను తినిపించకుండా, ఒక్కసారికి ఒకే కొత్త పదార్థాన్ని తినిపించాలి, అన్నీ కలిపి ఒకేసారి ఇవ్వకూడదు. ఇనుముతో కూడిన ఆహారాన్ని ఇచ్చిన తర్వాత మాత్రమే హోమోజినైజ్డ్ హోల్ మిల్క్ (పరిపూర్ణ పాలు) ఇవ్వడం మొదలుపెట్టాలి. శిశువుకి ఒక సంవత్సరం నిండే సమయానికి, వారు శిశువుల డైట్ చార్టులో సిఫార్సు చేయబడిన ఎక్కువ రకాల ఆహారాలను తినాలి.

    7. సహాయం ఎప్పుడు కోరాలో తెలుసుకోవాలి(Know when to ask for help)

    శిశువు తనకు అవసరమైన రోజువారీ పోషకాహారం కొరకు తన సంరక్షకులపై ఆధారపడుతుందనే విషయం గుర్తుంచుకోండి. శిశువైద్యునిచే పూర్తి ఆరోగ్య పరీక్షలు జరిపించి వారి అభిప్రాయం పొందటంతో పాటు బిడ్డ పోషకాహార అవసరాలకు తగ్గటుగా పిల్లల ఆహార చార్టుకు మార్పులు చేర్పులు చేయించుకోవడం కూడా ఎంతో అవసరం.

    References

    1. Borowitz SM. (2021) First Bites-Why, When, and What Solid Foods to Feed Infants. Front Pediatr.

    2. Hauta-Alus HH, Korkalo L, Holmlund-Suila EM, Rosendahl J, Valkama SM, Enlund-Cerullo M, Helve OM, Hytinantti TK, Mäkitie OM, Andersson S, Viljakainen HT.(2017) Food and Nutrient Intake and Nutrient Sources in 1-Year-Old Infants in Finland: A Cross-Sectional Analysis. Nutrients.

    Tags

    Food chart for baby 6-12 months, Ideal food chart for baby's in English , Ideal food chart for baby's in Hindi, Ideal food chart for baby's in Bengali, Ideal food chart for baby's in Tamil

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Image related to Breast Changes

    Breast Changes

    డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

    Image related to Diapering

    Diapering

    ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu

    Image related to Care for Baby

    Care for Baby

    మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu

    Image related to Care for Baby

    Care for Baby

    మీ బేబీ డైట్​కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

    Image related to Teething

    Teething

    When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?

    Image related to Breast Pain

    Breast Pain

    చనుమొనల పగుళ్లతో బాధపడుతున్నారా? ఇక్కడ 5 ఉపయోగపడే చికిత్సలు ఉన్నాయి (Suffering From Cracked Nipples? Here are 5 Effective Remedies in Telugu)

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.