This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

అసిస్టెడ్ రీప్రొడక్షన్ గురించి మీరు తెలుసుకోవలసినవి అన్నీ (All about Assisted Reproduction in Telugu)

Reproductive health
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Jan 23, 2026
అసిస్టెడ్ రీప్రొడక్షన్ గురించి మీరు తెలుసుకోవలసినవి అన్నీ (All about Assisted Reproduction in Telugu)
Read time6 min

అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్‌ను నిర్వచించడం (ART): Determining Assisted Reproductive Techniques in Telugu

aఅసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అనేవి సంతానోత్పత్తి చర్యలు. పిల్లలను కనడంలో ఇబ్బందికి లేదా వంధ్యత్వానికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కొందరు వ్యక్తులు వంధ్యత్వ సమస్యల కారణంగా ARTని ఎంచుకుంటారు. మరికొందరు జన్యుపరమైన పరిస్థితుల కారణంగా లేదా సంక్లిష్టమైన గర్భాలను నివారించడానికి దీన్ని ఎంచుకుంటారు. ఇవి సంక్లిష్టమైన చికిత్సలు. వీటిని ఈ రంగంలో ధృవీకరించబడిన నిపుణుడు మాత్రమే నిర్వహించగలడు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యొక్క ప్రధాన లక్ష్యం గుడ్లు, స్పెర్మ్ లేదా పిండాలను మానిప్యులేట్ చెయ్యడం ద్వారా విజయవంతమైన గర్భం యొక్క అవకాశాలను పెంచడం. ART అనేది గర్భం దాల్చడానికి మరియు ఆరోగ్యకరమైన శిశువులను ప్రసవించడానికి బాగా పరిశోధించబడిన, గుర్తించబడిన మార్గం.

మానవులకు సహాయక పునరుత్పత్తి సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయి? (How Are Assisted Reproductive Technologies Helpful To Humans in Telugu?)

ఈ రోజుల్లో పురుషులు మరియు మహిళలు ఇరువురిలోను వంధ్యత్వం గురించి ఆందోళన పెరుగుతోంది. ఈ సమస్య ప్రాంతాలు, జనాభా మరియు లింగాల యొక్క అన్ని హద్దులను దాటింది. మన జీవనశైలిలో మార్పులు చేయడం, అనారోగ్యకరమైన అలవాట్ల వైపు వెళ్లడం వల్ల మనకు వంధ్యత్వ సమస్య వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సహాయక పునరుత్పత్తిని ఉపయోగించడం ఎక్కువ అవసరం అవుతుంది. తల్లిదండ్రుల నుండి పిల్లలకి అవాంఛిత జన్యుపరమైన పరిస్థితులు లేదా వైకల్యాలను నివారించడంలో సహాయపడటం అనేది దీని వల్ల ఉన్న ఇతర ప్రయోజనాలు.

అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్‌లోని రకాలు (Types Of Assisted Reproductive Technology in Telugu)

ఆయా వ్యక్తుల యొక్క అవసరాలకు అనుగుణంగా వివిధ సహాయక పద్ధతులు ఉపయోగించబడతాయి. వారి పరిస్థితులకు సరిపోయే సరైన ప్రణాళికను రూపొందించడం అనేది ఆరోగ్యకరమైన గర్భం మరియు ప్రసవానికి దారితీసే చికిత్సలో ఉత్తమంగా పని చేస్తుంది.

1. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF): (In Vitro Fertilization)

ఈ ప్రక్రియలో వైద్యుడు ఒక గర్భాశయం నుండి గుడ్లను వెలికితీసి ప్రత్యేక ప్రయోగశాలలో స్పెర్మ్‌తో ఫలదీకరణం చేస్తాడు. గుడ్డు ఫలదీకరణం చేయబడిన తర్వాత ప్రత్యేక పద్ధతులను ఉపయోగించి స్త్రీ గర్భాశయానికి తిరిగి బదిలీ చేయబడుతుంది. IVF విధానంతో గర్భం దాల్చడానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించాల్సి రావచ్చు. ఈ సహాయక పునరుత్పత్తి సాంకేతికత యొక్క కొన్ని లోపాలు ఏంటంటే బహుళ గర్భాలు, ఎక్టోపిక్ గర్భం లేదా అండాశయ హైపర్‌స్టిమ్యులేషన్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఉండటం.

2. ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్ఫర్: (Intra fallopian transfer)

ఈ టెక్నిక్‌లో గేమేట్స్, జైగోట్‌లు లేదా ఫలదీకరణ చెందిన గుడ్డును స్త్రీ యొక్క ఫెలోపియన్ ట్యూబ్‌లోకి బదిలీ చేయడం జరుగుతుంది.

• గేమేట్ ఇంట్రాఫాలోపియన్ బదిలీ (గిఫ్ట్); ఫలదీకరణం సహజంగా జరగడానికి గుడ్లు మరియు స్పెర్మ్ ఫెలోపియన్ ట్యూబ్ లోపల ఉంచబడతాయి. ఒక వ్యక్తి ఏ పిండాన్ని బదిలీ చేయాలో ఎంచుకోలేడు.

• జైగోట్ ఇంట్రాఫాలోపియన్ బదిలీ (ZIFT); IVF మరియు GIFT కలయిక. ఫలదీకరణ చెందిన గుడ్లు లేదా జైగోట్‌లు ఫెలోపియన్ ట్యూబ్‌కు బదిలీ చేయబడతాయి. ఇది దెబ్బతిన్న ఫెలోపియన్ ట్యూబ్స్ మరియు తీవ్రమైన వంధ్యత్వ సమస్యలతో బాధ పడుతున్న వారికి సహాయపడుతుంది.

• ప్రొన్యూక్లియర్ స్టేజ్ ట్యూబల్ ట్రాన్స్‌ఫర్ (PROST); ZIFTని పోలి ఉంటుంది కానీ ఫలదీకరణం చేసిన గుడ్డు విభజించబడటానికి ముందు దానిని బదిలీ చేస్తారు.

3. ఘనీభవించిన పిండం బదిలీ (Frozen Embryo Transfer):

గతంలో ఫలదీకరణం చేయబడిన ఘనీభవించిన పిండాలను కరిగించి తర్వాత గర్భాశయంలో ఉంచేవారు. ఈ టెక్నిక్ పెద్ద వయసు ఉన్న జంటలకు సాధారణ మరియు ఆరోగ్యకరమైన పిల్లలను కలిగేలా సహాయపడుతుంది. ఈ సాంకేతికత యొక్క ప్రతికూలత ఏమిటంటే.. అన్ని ఘనీభవించిన పిండాలు బ్రతకలేవు. జీవించి ఉన్న వాటితో కూడా ప్రీ టర్మ్ బర్త్ కలిగే అవకాశం ఉండొచ్చు.

4. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (Intracytoplasmic sperm injection):

ఒక పిండోత్పత్తి నిపుణుడు ఒక చిన్న సూదిని ఉపయోగించి గుడ్డులోకి ఒక స్పెర్మ్‌ను ఇంజెక్ట్ చేస్తాడు. పిండ నిపుణుడు ప్రక్రియను కొనసాగించే ముందు నిర్దిష్టమైన స్పెర్మ్ మరియు గుడ్డును ఎంచుకోవచ్చు. ఈ సహాయక పునరుత్పత్తి సాంకేతికత యొక్క విజయం రేటు IVF మాదిరిగానే ఉంటుంది. ప్రతికూలత ఏమిటంటే ఇది IVF కంటే ఖరీదైనది. అంతే కాకుండా ఈ ప్రక్రియ వల్ల గుడ్లు దెబ్బతినే మరియు శిశువు వైకల్యాలతో జన్మించే ప్రమాదాలు ఉంటాయి.

5. థర్డ్ పార్టీ ART: (Third Party ART)

ఈ పునరుత్పత్తి సాంకేతికత ఆరోగ్యకరమైన గుడ్డు లేదా స్పెర్మ్‌ను ఉత్పత్తి చేయలేని లేదా పూర్తి-కాల గర్భాన్ని పొందలేని వ్యక్తులకు ఉపయోగించబడతాయి. సర్రోగేట్లు లేదా గర్భధారణ కారియర్స్ గర్భం యొక్క మొత్తం కాలంలో శిశువును పెంచడంలో సహాయపడతారు. దంపతులు కాకుండా ఇతర వ్యక్తులు, గర్భం దాల్చడానికి గుడ్లు లేదా స్పెర్మ్‌ను దానం చేస్తారు. ఒక జంటకు పదేపదే IVF విఫలమైనప్పుడు లేదా ప్రమాదకరమైన జన్యు పరిస్థితిని కలిగి ఉన్నప్పుడు ఈ పునరుత్పత్తి సాంకేతికత అద్భుతాలు చేస్తుంది. ఈ సాంకేతికత యొక్క ఖర్చు చాలా ఎక్కువ.

పైన పేర్కొన్న అన్ని సహాయక పునరుత్పత్తి పద్ధతులు వాటి వాటి అనుకూలతలు మరియు ప్రతికూలతలను కలిగి ఉంటాయి. ART కారణంగా కొన్ని సమస్యలు కూడా సంభవించవచ్చు. వీటి వల్ల చాలా తరచుగా వచ్చే సమస్య బహుళ గర్భాలు. కాకపోతే.. ఒక వ్యక్తికి ఒక పద్ధతి పని చేయవచ్చు కానీ ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపకపోవచ్చు. అందుకే ఒక ఆరోగ్యకరమైన గర్భం మరియు జనన ప్రణాళిక కోసం వృత్తిపరమైన మార్గదర్శకత్వం అవసరం.

సిద్ధం కావడం (Preparation):

ART చికిత్స కోసం మిమ్మల్ని సిద్ధం చేయడానికి అనుసరించదగ్గ చెక్‌లిస్ట్ ఉన్నాయి. ఆహారంలో మార్పులు, వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం అనేవి వీటిలో ప్రాధమిక అంశాలు. కెఫిన్, ఆల్కహాల్ మరియు నికోటిన్‌లను తగ్గించడం వలన సహాయక పునరుత్పత్తి సాంకేతికత విజయవంతంగా పని చేసే అవకాశాలను మెరుగుపరుస్తుంది. సూచించిన సప్లిమెంట్లను తీసుకోవడం మరియు ప్రొఫెషనల్ యొక్క ప్లాన్‌ను అనుసరించడం అనేది సహాయక పునరుత్పత్తి సాంకేతికతల నుండి ప్రయోజనం పొందేందుకు ఉత్తమ అవకాశాన్ని మీకు అందిస్తుంది.

ముగింపు (Conclusion)

అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ అనేది పిల్లలనుకనే పద్ధతులు. వంధ్యత్వం లేదా హానికరమైన జన్యుపరమైన పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు మరియు జంటలు ప్రత్యేకమైన పునరుత్పత్తి పద్ధతుల ద్వారా పిల్లలను కలిగి ఉండటానికి ART సహాయ పడుతుంది. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్, ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్‌ఫర్, థర్డ్-పార్టీ టెక్నిక్స్ మొదలైనవి విస్తృతంగా ఉపయోగించే కొన్ని ART. పునరుత్పత్తి సాంకేతికతలను విజయవంతంగా అమలు చేయడానికి, గర్భం, ప్రసవానికి సంబంధించిన తయారీ, ప్రక్రియ మరియు ఫలితాల కోసం ఒక ఇంటర్ డిసిప్లినరీ బృందం అవసరం. ఖర్చులు, ప్రయోజనాలు, నష్టాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత చరిత్రలు మరియు ప్రాధాన్యతల ప్రకారం చికిత్స ప్రణాళికలు చార్ట్ చేయబడతాయి.

Tags:

Assisted Reproduction in telugu, Things you need to know about Assisted Reproduction in telugu, what is Assisted Reproduction in telugu, what are positive aspects of Assisted Reproduction in telugu, Benefits of Assisted Reproduction in telugu.

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Sarada Ayyala
Sarada Ayyala

Related Articles

Questions about this article

  • Asked by 28 weeks pregnant

    Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

  • Asked when 35 weeks pregnant

    Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

  • Asked when 39 weeks pregnant

    Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

  • Asked when 34 weeks pregnant

    Hii 34 weeks how many months

  • Asked when 14 weeks pregnant

    Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.