


Conception
23 December 2025 న నవీకరించబడింది
శుక్రకణాల సంఖ్య అనేది వీర్యం నమూనాలో ఉన్న శుక్ర కణాల సగటు సంఖ్యను సూచిస్తుంది. చాలామంది వైద్య నిపుణులు మరియు సంతానోత్పత్తి నిపుణులు సాధారణ వీర్యం అనాలిసిస్ సమయంలో శుక్రకణాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఇది సంతానోత్పత్తి విషయంలో చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం శుక్రకణాల సంఖ్య ఒక మిల్లీలీటర్ కు (మి.లీ) 15 మిలియన్ శుక్ర కణాలు లేదా ప్రతి స్కలనానికి కనీసం 39 మిలియన్లు కలిగి ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క.
అనేక అంశాలు మనుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. ఇది పురుషుల్లో శుక్రకణాల సంఖ్యమరియు సంతానోత్పత్తిపై అత్యంత ప్రధానమైన ప్రభావం చూపుతాయి. టెస్టోస్టిరాన్ స్థాయితో పాటు, వారసత్వంగా వచ్చే జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు మరియు ట్యూమర్లు సహా కొన్ని వైద్యపరమైన సమస్యలు కూడా శుక్ర కణాల సంఖ్యపై ప్రభావం చూపుతాయి.
అయితే, కొన్ని ఇంటి చిట్కాలు మరియు మందులను వాడటం వల్ల శుక్ర కణాల ఉత్పత్తి స్థాయిలను నియంత్రించే హార్మోన్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి మీ శుక్ర కణాలు బలంగా అవుతాయి. కాబట్టి ఈ ఆర్టికల్ లో సహజంగా గర్భం దాల్చేందుకు శుక్రకణాలను ఎలా బలంగా మార్చుకోవాలో, మీ శుక్ర కణాల సంఖ్యను పెంచే కొన్ని ఇంటి చిట్కాల గురించి మరియు గర్భధారణ కోసం మీ శుక్ర కణాలను ఎలా బలంగా మార్చుకోవాలో చూద్దాం.
మీ శుక్ర కణాల సంఖ్యను సహజంగా పెంచుకోవడానికి కింది కొన్ని ఉత్తమమైన సహజ మార్గాలు:
సరైన నిద్ర మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శుక్ర కణాల సంఖ్య పెరుగుతుందని చాలామంది ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన దినచర్యను పాటిస్తూ బరువు తగ్గడం వల్ల శుక్రకణాల పెరుగుదలకు దోహదపడుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
చైన్ స్మోకర్ల (విపరీతంగా ధూమపానం చేసే వాళ్లు)లో శుక్ర కణాల సంఖ్య తక్కువగా ఉంటుందని, అందువల్ల వారు తక్కువ సంతాన సామర్థ్యాన్ని కలిగి ఉంటారని పరిశోధకులు గుర్తించారు. ధూమపానం తగ్గించడం వల్ల శుక్ర కణాల సంఖ్య మెరుగవుతుందని, అందువల్ల ఆ వ్యక్తి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మద్యం లేదా డ్రగ్స్ ఎక్కువగా తీసుకునే పురుషుల్లో శుక్ర కణాల సంఖ్య తక్కువగా ఉంటుందని మరియు టెస్టోస్టిరాన్ తక్కువగా ఉంటుందని చాలా అధ్యయనాల్లో తేలింది. ఎందుకంటే కొకైన్, గంజాయి మొదలైన మందులు పురుషుల్లో వీర్యం ఉత్పత్తిని తగ్గిస్తాయి.
మెంతుల (హిందీలో మేథీ) సప్లిమెంట్ తీసుకోవడం వల్ల శుక్ర కణాల సంఖ్య స్థాయి పెరుగుతుందని వైద్యులు చెబుతుంటారు. తక్కువ శుక్ర కణాల సంఖ్య ఉన్న పురుషులకు అనేక సహజ నివారణల్లో ఒకటి. కాబట్టి సరైన మొత్తంలో మెంతులు తీసుకోవడం వల్ల సహజంగా శుక్ర కణాల ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతుంది.
విటమిన్లు మరియు ఖనిజాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల శుక్ర కణాల సంఖ్య సహజంగా పెరుగుతుంది. అనేక విటమిన్లు మరియు ఖనిజాలు, ముఖ్యంగా విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు శుక్ర కణాల సంఖ్యను పెంచడంలో సాయపడతాయి. తద్వారా మీ భాగస్వామిలో గర్భధారణ అవకాశాలను పెరుగుతాయి. కాల్షియం మరియు ఐరన్ లోపం నేరుగా శుక్ర కణాల సంఖ్య తగ్గడంపై పడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని సరైన మొత్తంలో తీసుకోవడం వల్ల శుక్ర కణాల స్థాయి మరియు సంతానోత్పత్తి సామర్థ్యం పెంచవచ్చని శిక్షణ పొందిన నిపుణులు సూచిస్తుంటారు. శుక్ర కణాలతో పాటు వేరే ఇతర కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్ సమ్మేళనాలను నిష్క్రియం చేయడంలో ఇవి సాయపడుతాయి. అందువల్ల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల శుక్ర కణాల డ్యామేజీని తగ్గిస్తుంది మరియు మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచుతుంది.
సరైన మోతాదులో అశ్వగంధ శుక్ర కణాల సంఖ్య పెరగడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అశ్వగంధను సాధారణంగా ఇండియన్ జిన్‌సెంగ్ అని పిలుస్తారు. మగవారిలో శుక్ర కణాల సంఖ్యను పెంచడంలో మరియు సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ముగింపు (Conclusion)
సరైన మొత్తంలో సహజ పదార్థాలు, ఇంటి చిట్కాలు మరియు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటే శుక్ర కణాల సంఖ్య పెరగడానికి మరియు సహజంగా గర్భం దాల్చే అవకాశాలను పెంచుతాయని చాలా మంది పరిశోధకులు మరియు ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
శుక్ర కణాల సంఖ్యను పెంచడానికి మరియు గర్భధారణ కోసం వీర్యాన్ని సహజంగా బలోపేతం చేయడానికి సహాయపడే కొన్ని చిట్కాలు: సరైన వ్యాయామం మరియు నిద్ర, ధూమపానం వంటి హానికరమైన అలవాట్లను మానుకోవడం, మద్యం మరియు డ్రగ్స్ అధిక వినియోగాన్ని తగ్గించడం, మెంతి సప్లిమెంట్లను సరిగ్గా వినియోగించడం, తగినంత విటమిన్లు, ఖనిజాలుకలిగి కలిగిన ఉన్న ఆహారం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారపదార్థాలు తినడం మరియు సరైన మొత్తంలో అశ్వగంధ తీసుకోవడం.
Making Sperm stronger in telugu, sperm for pregnancy, best foods for making sperm stronger in telugu, make sperm stronger naturally at home in telugu.
Also Read In:
English: How To Make Sperm Stronger For Pregnancy
Bengali: How to make sperm stronger for pregnancy naturally in Bengali
Tamil: How to make your Sperm Stronger for Pregnancy Naturally in Tamil
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











శిశువు మెదడు అభివృద్ధి కోసం ఉత్తమ ఆహారాలు (Best Foods for Baby Brain Development in Telugu)

గర్భధారణ సమయంలో గుండె దడ: లక్షణాలు, కారణాలు & చికిత్స | Palpitation in Pregnancy: Symptoms, Causes & Treatment in Telugu

గర్భధారణ సమయంలో అటుకులు: ప్రయోజనాలు, రకాలు & వంటకాలు | Poha During Pregnancy: Benefits, Types & Recipes in Bengali

గర్భధారణ సమయంలో రాగి: ప్రయోజనాలు మరియు పోషక విలువలు

గర్భధారణ సమయంలో కొంతమంది మహిళలకు HCG ఇంజెక్షన్ ఎందుకు సిఫార్సు చేస్తారు? (Recommended HCG Injection During Pregnancy in Telugu)

మహిళలకి సంబంధించిన టాప్ 10 ఆరోగ్య సమస్యలు (Top 10 Health Issues Related To Women in Telugu)